iDreamPost
android-app
ios-app

గౌతమ్ తో మురారి సీక్వెల్? క్లారిటీ ఇచ్చేసిన కృష్ణ వంశీ..

  • Published Aug 16, 2024 | 6:41 PM Updated Updated Aug 16, 2024 | 6:41 PM

Krishna Vamsi Clarified No Murari Sequel With Gautham: మురారి సినిమా రీ రిలీజ్ నుంచి టాలీవుడ్ లో ఒక కొత్త విషయం ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే.. మహేశ్ కుమారుడు గౌతమ్ తో మురారి సినిమాకి సీక్వెల్ తీయాలి అని. ఆ విషయంపై కృష్ణవంశీ క్లారిటీ ఇచ్చేశాడు.

Krishna Vamsi Clarified No Murari Sequel With Gautham: మురారి సినిమా రీ రిలీజ్ నుంచి టాలీవుడ్ లో ఒక కొత్త విషయం ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే.. మహేశ్ కుమారుడు గౌతమ్ తో మురారి సినిమాకి సీక్వెల్ తీయాలి అని. ఆ విషయంపై కృష్ణవంశీ క్లారిటీ ఇచ్చేశాడు.

  • Published Aug 16, 2024 | 6:41 PMUpdated Aug 16, 2024 | 6:41 PM
గౌతమ్ తో మురారి సీక్వెల్? క్లారిటీ ఇచ్చేసిన కృష్ణ వంశీ..

టాలీవుడ్ లో అందరి ఫ్యాన్స్ ది ఒక లెక్క.. సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ది ఒక లెక్క. మురారి సినిమాని రీ రిలీజ్ చేసి ఇటీవల టాలీవుడ్ లో క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. అంతేకాకుండా.. థియేటర్స్ మొత్తం వాళ్లు చేసిన హంగామాకి సోషల్ మీడియాలో షేక్ అయిపోయింది. ఆఖరికి పెళ్లి తంతు కూడా థియేటర్లోనే చేసేసుకున్నారు. నెట్టింట డ్యాన్సులు, పెళ్లిళ్లతో నిండిపోయింది. అలాగే ఆ రోజు నుంచి ఒక ప్రశ్న, మహేశ్ ఫ్యాన్స్ నుంచి కోరిక బాగా వైరల్ అవుతూ వస్తోంది. అదేంటంటే.. మురారి సీక్వెల్ తీయాలి. అది కూడా మహేశ్ కుమారుడు గౌతమ్ తో తీయాలి. ఈ ప్రశ్నకు కృష్ణవంశీ సమాధానం చెప్పేశారు.

ఆగస్టు 9న మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి సినిమాని ఫ్యాన్స్ రీ రిలీజ్ చేశారు. ఆరోజు మహేశ్ ఫ్యాన్స్ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. ఆ రోజు స్టార్ట్ అయిన మురారి బజ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. రీరిలీజ్ వారం రోజులు అయినా కూడా ఇంకా మురారి సినిమా వార్తల్లో నిలుస్తూనే ఉంది. అందుకు ఉన్న ప్రధాన కారణం ఏంటంటే.. మహేశ్ ఫ్యాన్స్ లో పుట్టిన ఒక కోరిక. అవును మహేశ్ ఫ్యాన్స్ అంతా ఆగస్టు 9 నుంచి కృష్ణవంశీకి రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు. మహేశ్ కుమారుడు గౌతమ్ తో మురారి సినిమాకి సీక్వెల్ తీయండి అంటూ నెట్టింట కామెంట్స్ పెట్టేస్తున్నారు. మహేశ్- నమ్రతకు ఓకే అయితే తీయడానికి నేను రెడీ అని కృష్ణవంశీ చెప్పారు అని వార్తలు కూడా వచ్చాయి.

అయితే ఆ సీక్వెల్ పై ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదు. కానీ, కృష్ణవంశీ తాజాగా మురారి సీక్వెల్ కి సంబంధించి కుండ బద్దలు కొట్టేశారు. మురారి సినిమాకి సంబంధించి ఎలాంటి సీక్వెల్ లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఎక్స్.కామ్ లో ఒకరు కృష్ణవంశీ పేరిట ఒక కామెంట్, గౌతమ్ పిక్ ని పోస్ట్ చేశారు. దానిని రీపోస్ట్ చేస్తూ.. మురారి సీక్వెల్ లేదు ప్లీజ్ ఇంక ఆపేయండి అంటూ కామెంట్ చేశారు. ఈ ఒక్క పోస్ట్ తో మురారి సీక్వెల్ వార్తలకు బ్రేక్ పడినట్లు అయ్యింది. గౌతమ్ తో మురారి సినిమాకి ఎలాంటి సీక్వెల్ లేదు అని క్లారిటీ అయితే వచ్చింది. ఇంక మహేశ్- రాజమౌళి సినిమాకి సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ అయితే లేవు. ఇటీవల మహేశ్ కొత్త లుక్స్ వైరల్ అయ్యాయి. ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. మరి.. మురారికి సీక్వెల్ లేదని కృష్ణవంశీ క్లారిటీ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom