iDreamPost
android-app
ios-app

పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేసే ఆలోచనలో పోలీసులు అంటూ వార్తలు!

Case On Pallavi Prashanth: ఆదివారం ఎంతో అట్టహాసంగా బిగ్ బాస్ సీజన్ 7 వేడుక ముగిసింది. పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసిన హంగామా వివాదస్పదంగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ ను అరెస్ట్ చేసే ఆలోచనలో పోలీసులు ఉన్నారనే వార్తలు వినిపిస్తోన్నాయి.

Case On Pallavi Prashanth: ఆదివారం ఎంతో అట్టహాసంగా బిగ్ బాస్ సీజన్ 7 వేడుక ముగిసింది. పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసిన హంగామా వివాదస్పదంగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ ను అరెస్ట్ చేసే ఆలోచనలో పోలీసులు ఉన్నారనే వార్తలు వినిపిస్తోన్నాయి.

పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేసే ఆలోచనలో పోలీసులు అంటూ వార్తలు!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న షోల్లో బిగ్ బాస్ ఒకటి. ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఆదివారమే సీజన్ 7ని కూడా ఘనంగా ముగించింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 ఎంత అట్టహాసంగా ముగిసింది. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 విజేతగా నిలిచారు. ఇక ఈ గ్రాండ్ ఫినాలే ఎంతో అద్భుతంగా జరిగిందో ఆ తర్వాత  బయట కూడా అంతే హంగామా జరిగింది.  అన్నపూర్ణ స్టూడియో బయట పల్లవి ప్రశాంత్ అభిమానులు నానా రచ్చ చేశారు. ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సు అద్దాలను పగలగొట్టారు. అంతేకాకుండా ప్రభుత్వ, పోలీసు వాహనాలపై కూడా దాడులు చేశారు. ఈ ఘటనలపై పల్లవి ప్రశాంత్ స్పందించిన తీరు చాలా వివాదాస్పదంగా మారిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనను అరెస్టు చేయొచ్చని టాక్ కూడా వినిపిస్తోంది.

బిగ్ బాస్  సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. రైతు బిడ్డగా హౌస్ లోకి అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్ తనదైన ఆటతో అభిమానులను సొంతం చేసుకున్నారు. చివరకు రైతు బిడ్డగా వెళ్లి.. బిగ్ బాస్ విన్నర్  ప్రశాంత్ గా బయటకు వచ్చారు. ఇంత వరకు అంత బాగానే ఉన్నా.. గ్రాండ్ ఫినాలే రోజు.. అతడి అభిమానులు చేసిన పనులు చాలా ఘోరంగా ఉన్నాయి. ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సు, కంటెస్టెంట్స్ కార్లపై రాళ్లతో దాడికి దిగారు. కేవలం ప్రశాంత్ పై, అతని కారుపై మాత్రమే ఎలాంటి దాడి జరగలేదు.

There are reports that the police are planning to arrest Prashant

ఈ నేపథ్యంలోనే ఈ దాడికి కారణం పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంటూ వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక విన్నర్ బాగా బయటకు వచ్చిన తరువాత పల్లవి ప్రశాంత్ ప్రవర్తించిన తీరుపై కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అప్పటికే జరిగిన సంఘటనపై కొంచెం కూడా ప్రశాంత్ స్పందించలేదు. పైగా లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది అవుతుందని చెప్పినా.. ప్రశాంత్ నడి రోడ్డుపైనే ఉన్నారు. అక్కడే మీడియాతో అభిమానులతో మాట్లాడుతూ.. ట్రాఫిక్ సమస్యకు కారణమయ్యాడని కొందరు అభిప్రాయపడుతున్నారు.

అంతేకాక తన అభిమానులు చేసిన తప్పును కనీసం ఎక్కడా ప్రస్తావించలేదు. చాలా సమయం పాటు నడి రోడ్డుపైనే మాట్లాడుతూ..  సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేశాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. సుమోటోగా కేసులు కూడా నమోదు చేశారంటూ చెబుతున్నారు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్, అతని ఫ్యాన్స్ పై స్వచ్ఛందంగా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారంటూ వార్తలు వస్తున్నాయి. ఆదివారం జరిగిన రచ్చ, ఆ తరువాత లా అండ్ ఆర్డర్  సమస్యను క్రియేట్ చేశాడంటూ పల్లవి ప్రశాంత్ పై పోలీసులు సీరియస్ గా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

తమ మాట లెక్క చేయకుండా పల్లవి ప్రశాంత్ నడి రోడ్డుపై చేసిన ట్రాఫిక్ ఇష్యూకి పోలీసులు కోపంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అతని అరెస్టు చేసే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. ఇదే సమయంలో పల్లవి ప్రశాంత్ కూడా మీడియాకు, మరెక్కడా కనిపించకుండా ఉన్నాడని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా.. తన అభిమానులు చేసిన దాడులపై పల్లవి ప్రశాంత్ స్పందించకపోవడం, పైగా బయటకు వచ్చిన తర్వాత రోడ్డుపైనే మీటింగ్ పెట్టడం వంటివి అందరినీ ఆగ్రహానికి గురి చేశాయి. ఈ క్రమంలోనే అతడిని అరెస్టు చేయాలంటూ కొందరు డిమాండ్ కూడా చేశారు.ఇక ఈ విషయంపై పల్లవి ప్రశాంత్ ను సంప్రదించేందుకు మీడియా ప్రయత్నించింది. అయితే మీడియాకు కూడా పల్లవి ప్రశాంత్ అందుబాటులోకి రాలేదు. మరి పోలీసులు.. ప్రశాంత్ ను అరెస్టు చేస్తారా? లేదా అనేది తెలియాలంటే ఎదురు చూడాల్సిందే.