iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: మరోసారి రైతుబిడ్డపై కుట్ర! ఒక్కడిని చేసి ఇంత అన్యాయమా?

Bigg Boss 7 Telugu: మరోసారి రైతుబిడ్డపై కుట్ర! ఒక్కడిని చేసి ఇంత అన్యాయమా?

ఒక చిన్న కథ చెప్పుకుందాం.. ఒక బకెట్ లో 10 ఎండ్రకాయలను వేశాం అనుకుందాం. వాటిలో చాలా ఎండ్రకాయలు ఏం చేయకుండా ఖాళీగా, కామ్ గా ఉంటాయి. కానీ, ఒకటి రెండు మాత్రం బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. నిజానికి శక్తికి మించి పోరాడుతూ ఉంటాయి. కానీ, మిగిలిన ఎండ్రకాయలు ఏం చేయకపోగా.. పైకి ఎక్కే దాన్ని కాలు పట్టుకుని కిందకు లాగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కూడా ఇదే తరహా ఆట జరుగుతూ ఉంది. ఎంతో కష్టపడి రైతుబిడ్డ ఇంటి తొలి కెప్టెన్ అయితే.. సెలబ్రిటీలు అంతా కలిసి అతని కెప్టెన్సీని లాగేసుకుని రాక్షసానందం పొందుతున్నారు.

తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 2.0కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో ఇంటి కెప్టెన్ కి ఉండాల్సిన లక్షణాలు చెప్పండి అని హౌస్ మేట్స్ ని బిగ్ బాస్ అడిగాడు. అందుకు తలా ఒక రీజన్ చెప్పారు. నిజానికి వీళ్లు కెప్టెన్ అయితే ఏం పొడుస్తారో తెలియదు గానీ.. అయిన వాడు మాత్రం అలా లేడు ఇలా లేడు అంటూ బాగానే నీతి వ్యాఖ్యాలు వల్లించారు. మరి.. ప్రశాంత్ అలా ఉన్నాడా? అనే ప్రశ్నను వేశాడు బిగ్ బాస్. అంతేకాకుండా బిగ్ బాస్ బ్యాడ్ కెప్టెన్ అని ఎవరెవరు అనుకుంటున్నారు అని కూడా అడిగాడు. ఇంకేముంది పొలోమని సెలబ్రిటీలు అందరూ చేతులు ఎత్తేశారు. హౌస్ లో ఉన్న శోభా, అమర్ దీప్ మినహా అందరూ చేతులు ఎత్తేశారు. ఆఖరికి శివాజీ కూడా బ్యాడ్ కెప్టెన్ అని చేతులు ఎత్తడంతో అంతా షాకయ్యారు.

ఇప్పుడు మనం అసలు కుట్ర గురించి మాట్లాడుకుందాం. ఒక ఇంటికి ఎవరైనా పెద్ద అవ్వాలి అంటే ఇంట్లో ఉన్న వాళ్లంతా ఆయన పెద్దరికాన్ని అంగీకరించాలి. అంతేకాదు ఆయన మాటకు విలువ ఇవ్వాలి, చెప్పిన పనులకు ఎదురుచెప్పకుండా చేయాలి. అదే బిగ్ బాస్ హౌస్ లో చూసుకుంటే.. ఇంటికి పెద్ద కెప్టెన్ అవుతాడు. ఆ కెప్టెన్ ని టాస్కుల ద్వారా ఎంచుకుంటారు. ఆ టాస్కుల్లో తన సత్తా చాటి కెప్టెన్ అవ్వాల్సి ఉంటుంది. అలా కెప్టెన్ అయిన వ్యక్తి మాటను ఇంట్లో ఉన్న వాళ్లంతా వారంపాటు వినాల్సి ఉంటుంది. కానీ, ప్రశాంత్ విషయంలో మాత్రం అలా జరగడం లేదు. ఎంతో కష్టపడి, పోరాడి ఇంటికి కెప్టెన్ అయ్యాడు. కానీ, అతని మాటను లెక్కచేసే వాళ్లే లేనట్లుగా ఉన్నారు. అతను ఏం చెప్పినా కూడా అసలు చేసే పరిస్థితి ఇంట్లో కనిపించడం లేదు. అదే విషయాన్ని ప్రశాంత్ స్వయంగా బిగ్ బాస్ కి వెల్లడించాడు. ఎవరూ నా మాట వినడం లేదని.. ఏదైనా పని చెప్తే నువ్వేంది నాకు చెప్పేది అన్నట్లు చూస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు.

అంతా విన్న తర్వాత బిగ్ బాస్ బ్యాడ్ కెప్టెన్ అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించాడు. సెలబ్రిటీలు అంతా కలిసి చేతులు ఎత్తేశారు. మరి.. బిగ్ బాస్ హౌస్ లో ప్రశాంత్ ఉండటం వీళ్లకు ఇంష్టం లేదా? లేక ప్రశాంత్ లాంటి కామన్ మ్యాన్ వీళ్ల మీద పెత్తనం చలాయించడం ఇష్టం లేదా? ఎందుకు వీళ్లంతా కలిసి పదే పదే రైతుబిడ్డను టార్గెట్ చేస్తున్నారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలి అంటే వీకెండ్ ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే. ఇప్పటికి మాత్రం ప్రశాంత్ బ్యాడ్జ్ ని తీసి స్టోర్ రూమ్ లో పెట్టేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. కళ్లవెంట కన్నీళ్లు పెట్టుకుని పల్లవి ప్రశాంత్ ఆ బ్యాడ్జ్ ని స్టోర్ రూమ్ లో పెట్టేశాడు. ఇక్కడ ఒక కెప్టెన్ తన విధులను నిర్వర్తించాలి అంటే ముందు ఆ హౌస్ లో ఉన్నవాళ్లు అతని మాట వినాలి. కానీ, వీళ్లు మాట వినకుండా చివరికి బిగ్ బాస్ చెప్పగానే చేతులు ఎత్తేశారు. దీని బట్టి చూస్తే కావాలనే సెలబ్రిటీలు ప్రశాంత్ ని టార్గెట్ చేశారు అనే భావన కలగకుండా మానదు. మరి.. ప్రోమోలో చూపించిన విధంగా హౌస్ లో ప్రశాంత్ కెప్టెన్సీ పోబోతోందా? ఎపిసోడ్ లో ఏమైనా ట్విస్టులు ప్లాన్ చేస్తారా చూడాలి. మరి.. పల్లవి ప్రశాంత్ ని సెలబ్రిటీలు టార్గెట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి