iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: లీక్ చేసిన నాగార్జున.. హౌస్ లోకి రాబోతోంది వీళ్లే!

  • Published Oct 01, 2023 | 4:24 PM Updated Updated Oct 01, 2023 | 4:24 PM
  • Published Oct 01, 2023 | 4:24 PMUpdated Oct 01, 2023 | 4:24 PM
Bigg Boss 7 Telugu: లీక్ చేసిన నాగార్జున.. హౌస్ లోకి రాబోతోంది వీళ్లే!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టా అని మొదటి నుంచీ చెబుతూనే ఉన్నారు. అయితే మొదట్లో కాస్త ఉల్టా ఫీలయినా కూడా.. ఇప్పుడు మళ్లీ షో రొటీన్ అనే భావన కలుగుతోంది. అయితే ఉల్టా పుల్టాకి జస్టిఫికేషన్ ఇచ్చే సమయం దగ్గర్లోనే ఉంది అంటున్నారు. అందుకు చేయాల్సిన ఏర్పాట్లు కూడా చేసేశారు అంట. ఈ సీజన్ కి సంబంధిచి ఇప్పటికే చాలానే గాసిప్స్ వినిపిస్తూ ఉన్నాయి. అందులో ఒక విషయం మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిజంగా అలా జరుగుతుందా అని నోరెళ్లబెడుతున్నారు. అయితే చివరికి నాగార్జున నోటి నుంచి కూడా అదే విషయం రావడంతో అంతా బిగ్ బాస్ కి బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చేందుకు రెడీ అయిపోతున్నారు.

ఈ సీజన్ లో కేవలం 14 మందినే హౌస్ లోకి పంపి ప్రేక్షకులకు షాకిచ్చారు. అందులోనూ మూడు బెడ్ రూమ్స్ పెట్టి అందరినీ కన్ఫ్యూస్ చేశారు. అయితే ఇందులో పెద్ద ప్లానే ఉంది అంటున్నారు. ఇప్పటికే హౌస్ లో ఉన్న వారిలో ఐదు వారాలకు ఐదుగురు ఎలిమినేట్ అవుతారు. అప్పుడు హౌస్ లో 9 మంది ఉంటారు. ఆట ముందుకు వెళ్లాలి అంటే కచ్చితంగా ఇంకో ఐదుగురు కంటెస్టెంట్స్ కావాల్సిందే. అందుకే మొదటి నుంచి 5 వైల్డ్ కార్డు ఎంట్రీల ఉంటాయి అని చెబుతున్నారు. ఇప్పుడు కొత్తగా గ్రాండ్ లాంఛ్ 2.0 ఉంటుందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా కోడై కూస్తోంది. అందరూ వాటిని లైట్ తీసుకున్నారు. కానీ, నాగార్జున నోటి నుంచి హింట్ రావడంతో అందరూ ఇప్పుడు కచ్చితంగా గ్రాండ్ లాంఛ్ 2.0 ఉంటుందని ఫిక్స్ అయిపోయారు.

అక్టోబర్ 8న అంటే వచ్చే ఆదివారం ఈ లాంఛ్ ఉంటుందని చెబుతున్నారు. అందుకోసం ఇప్పటికే కంటెస్టెంట్స్ కూడా ఖరారు అయిపోయారు అంటూ కొన్ని పేర్లను కూడా వైరల్ చేస్తున్నారు. అంబటి అర్జున్, అంజలి పవన్, పూజా మూర్తి, భోలె షావళి, నయని పావని సెకండ్ లాంఛ్ రోజు హౌస్ లోకి వస్తున్నారు అని చెబుతున్నారు. అయితే ఈ పేర్లు అటూ ఇటూ మారినా కూడా గ్రాండ్ లాంఛ్ మాత్రం తప్పకుండా ఉంటుందని బలంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సీజన్ కి సంబంధించి నెట్టింట వచ్చిన రూమర్స్ లో చాలా వరకు నిజం అయ్యాయి. పైగా ఆడియన్స్ లో ఒక బజ్ ఏర్పడితే దానిని నిజం చేసేందుకే నిర్వాహకులు చూస్తున్నారు. ఉల్టా పుల్టా అంటున్నారు కాబట్టే.. ఈ సీజన్ లో రెండో లాంఛింగ్ ఈవెంట్ పెడతారు అని ఫిక్స్ అయిపోయారు.

నాగార్జున కూడా చాలా ఈ సీజన్ లో ఎప్పుడూ ఎక్కడా జరగని విషాలు జరగబోతున్నాయి.. ఈ సీజన్ ఉల్టా పుల్టా అని మర్చిపోకండి అంటూ నొక్కి చెప్పారు. ఈ మాట విన్న తర్వాత వచ్చే వారం గ్రాండ్ లాంఛ్ ఉంటుందని అంతా ఫిక్స్ అయిపోయారు. అలాగే కంటెస్టెంట్స్ గా దాదాపుగా వీళ్లే వెళ్తారని కూడా చెబుతున్నారు. కొత్తగా హౌస్ లోకి సభ్యులు వస్తే అది కచ్చితంగా ఆట రసవత్తరంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు హౌస్ లో ఉన్న వాళ్లు కొందరు, ఇప్పటివరకు బయట ఉండి ఆట చూసిన వాళ్లు కొందరు. వారిలో ఎవరు బాగా ఆడతారు? ఎవరు పైచేయి సాధిస్తారు? అనే విషయాలు నిజంగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మరి.. గ్రాండ్ లాంఛ్ ఈవెంట్, కొత్త కంటెస్టెంట్స్ ఈ వార్తలు అన్నింటిలో నిజం ఎంతుందో తెలియాలి అంటే కచ్చితంగా ఇంకో వారం ఆగాల్సిందే. గ్రాండ్ లాంఛ్ 2.0పై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio