అమర్ భార్య ఫొటోలు మార్ఫింగ్! ఓ స్త్రీపై ఇంత నీచమా?

బిగ్ బాస్ అంటే హౌస్ లో ఉండే కంటెస్టెంట్స్ ఆడే మాత్రమే కాదు.. బయట కూడా ఆట కొనసాగుతూనే ఉంటుంది. కంటెస్టెంట్స్ సపోర్టర్స్ వారి వారి సభ్యులు గెలవాలని సోషల్ మీడియాలో కాంపైన్లు చేస్తుంటారి. అయితే ఇప్పుడు ఇవి కుటుంబాలను టార్గెట్ చేసే స్థాయికి దిగజారిపోయాయి.

బిగ్ బాస్ అంటే హౌస్ లో ఉండే కంటెస్టెంట్స్ ఆడే మాత్రమే కాదు.. బయట కూడా ఆట కొనసాగుతూనే ఉంటుంది. కంటెస్టెంట్స్ సపోర్టర్స్ వారి వారి సభ్యులు గెలవాలని సోషల్ మీడియాలో కాంపైన్లు చేస్తుంటారి. అయితే ఇప్పుడు ఇవి కుటుంబాలను టార్గెట్ చేసే స్థాయికి దిగజారిపోయాయి.

బిగ్ బాస్ హౌస్ లో జరిగే ఆట సంగతి పక్కన పెడితే బయట జరుగుతున్న రోత మాత్రం తట్టుకోలేని స్థితిలో ఉంటోంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు విజయం సాధించాలని పోరాడుతూ ఉంటే.. బయట ఉన్న వాళ్లు మాత్రం వారి కుటుంబాలను టార్గెట్ చేస్తూ శునకానందం పొందుతున్నారు. హౌస్ లో ఆడుతున్న కంటెస్టెంట్స్ కి బయట పీఆర్లు ఉంటారు, ఫ్యాన్స్ ఉంటారు. వారి వ్యక్తి గెలవాలి అని బయట పెద్ద యుద్ధమే చేస్తూ ఉంటారు. కానీ, ఆ యుద్ధం ఎలా చేస్తున్నారు అనేదే ప్రశ్న. పీఆర్ అయినా.. ఫ్యాన్ అయినా వారి కంటెస్టెంట్ ని సపోర్ట్ చేసుకోవడానికి వారు కృషి చేస్తే బాగుంటుంది. కాన, ఈ సీజన్ లో అలా జగడం లేదు. అవతలి వారిని ట్రోల్ చేయడానికే మొగ్గు చూపుతున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో ఉండే కంటెస్టెంట్ కప్పు కోసం పోటీ పడుతుంటే.. బయటున్న వారి సపోర్టర్స్ మాత్రం గలీజ్ దందాలతో శునకానందం పొందుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. అమర్ దీప్ భార్య తేజశ్వినీ గౌడ అతనికి సపోర్ట్ చేయడం లేదు అంటూ నెట్టింట పుకార్లు వచ్చాయి. అసలు తన భర్త గెలవాలి అని తేజూనే కోరుకోవడం లేదు అంటూ నెట్టింట చర్చలు జరిగాయి. దీనికి సంబంధించి అసలు నిజాలను సీరియల్ యాక్టర్, అమర్ ఫ్రెండ్ నరేశ్ లొల్ల ఇంటర్వ్యూలో వెల్లడించాడు. “అమర్ దీప్ భార్య తేజూ ఎంతో క్షోభను అనుభవిస్తోంది. తాను పడుతున్న బాధను కనీసం ఎవరితో షేర్ కూడా చేసుకోవడం లేదు. తనకు సంబంధించిన కొన్ని ఫొటోలను మార్ఫింగ్ చేసి తనని ట్యాగ్ చేశారు. ఆ విషయాన్ని తల్లిదండ్రులు, అత్తమామలతో ఏమని చెప్పుకుంటుంది. నాలాంటి ఫ్రెండ్స్ తో తన బాధ ఎలా షేర్ చేసుకుంటుంది.

ఎవరికీ చెప్పకుండా పాపం తేజూ తనలో తానే ఆ నరకాన్ని అనుభవిస్తోంది. ఏ సీజన్లో కూడా ఎవరి ఫ్యామిలీకి ఇలాంటి కష్టం రాలేదు. నిజంగా తేజశ్వినీ తన బాధను ఎవరితో చెప్పకుండా తనలో తానే కుమిలిపోతోంది. తర్వాత నేనే సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ చేసి ఫొటోలు, అకౌంట్స్ తీయించేశాను. తేజూ అమర్ కు సపోర్ట్ చేయడం లేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆమె దగ్గర 2 ఫోన్లు ఉంటాయి. ఒక ఫోన్లో బిగ్ బాస్ లైవ్ నడుస్తూనే ఉంటుంది. అమర్ ని చూస్తూనే ఉంది. అమర్ నిద్రపోయిన తర్వాతే ఆమె పడుకుంటుంది. అమర్ కు ఏం కావాలి? ఎలాంటి డ్రస్సులు పంపాలి? అతని మెడిసిన్స్ ఉన్నాయా లేవా? అనే ప్రతి విషయాన్ని తన రెండో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఆమె ఎప్పుడూ అమర్ గురించే ఆలోచిస్తూ ఉంది. అమర్ కు తేజూ సపోర్ట్ చేయట్లేదు అనేది అవాస్తవం. అమర్ కు సపోర్ట్ చేస్తున్న అమ్మాయిలను కూడా టార్గెట్ చేస్తున్నారు.

ఒకమ్మాయి నాకు అర్ధరాత్రి 12.30 గంటలకు మెసేజ్ చేసింది. అమర్ కి సపోర్ట్ చేసినందుకు తనను టార్గెట్ చేసి తిడుతున్నారని బాధపడింది. 7 అకౌంట్స్ ని బ్లాక్ చేయించాను. దాదాపు 300 ఫేక్ అకౌంట్స్ నుంచి అమర్ ని, ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు. కొందరు చెప్పిన మాట విని అకౌంట్స్ క్లోజ్ చేస్తున్నారు. ఇంకొంతమంది భయపడి క్లోజ్ చేశారు” అంటూ నరేశ్ లొల్ల చెప్పుకొచ్చాడు. ఇప్పటికే తనని తిడుతున్నారు అని అమర్ తల్లి బయటకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేయడం చూశాం. ఆవిడ ఎంత బాధపడుంటే అలాంటి మాటలు మాట్లాడతారు? మిగిలిన సీజన్స్ తో పోలిస్తే.. ఈ సీజన్లో మాత్రం ఫ్యామిలీని టార్గెట్ చేసి ట్రోల్ చేయడం చూస్తున్నాం. ఇప్పుడు మరీ దిగజారి అమర్ భార్య ఫొటోలను మార్ఫ్ చేశారు. అమర్ దీప్ ఫ్యామిలీని టార్గెట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments