sai
Ravi Teja Movie Offered Amardeep: మాస్ మహరాజ రవితేజ వరుస సినిమాలో దూసుకు పోతున్నాడు.. ఆ మధ్య బిగ్ బిస్ సీజన్ 7 లోకి కంటెస్టెంట్ గా వచ్చిన అమర్ దీప్ కి ఓ ప్రామిస్ చేశాడు రవితేజ.
Ravi Teja Movie Offered Amardeep: మాస్ మహరాజ రవితేజ వరుస సినిమాలో దూసుకు పోతున్నాడు.. ఆ మధ్య బిగ్ బిస్ సీజన్ 7 లోకి కంటెస్టెంట్ గా వచ్చిన అమర్ దీప్ కి ఓ ప్రామిస్ చేశాడు రవితేజ.
sai
తెలుగు ఇండస్ట్రీలో మాస్ మహరాజ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ హీరోగా మారారు. తనదైన నటనతో తిరుగేలేని స్టార్ డమ్ తో దూసుకువెళ్తున్నాడు మాస్ మహరాజ రవితేజ. తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 తో పరిచయం అయిన అమర్ దీప్ చౌదరి ఫైనల్ వరకు చేరాడు. ప్రేక్షకులు అమర్ ఆట తీరు తప్పు పట్టినా.. అతనిలోని ఫైర్ చూసి ఓట్లు వేశారు.అమర్ దీప్.. రవితేజకు హార్డ్ కోర్ ఫ్యాన్.. పలు రియార్టీ షోల్లో రవితేజను ఇమిటేట్ చేస్తుంటాడు. బిగ్ బాస్ సీజన్ 7లో రవితేజ అతిధిగా ఎంట్రీ ఇచ్చిన సమయంలో తన సినిమాలో అమర్ దీప్ కి ఒక ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చాడు.. తాజాగా ఆ మాట నెరవేర్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే..
తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు 7 సీజన్లు పూర్తయ్యాయి. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా రైతు బిడ్డ ప్రశాంత్ కప్పు గెల్చుకున్నాడు. చివరి వరకు తనదైన ఆట తీరుతో ప్రేక్షకుల ఆదరణ పొందుతూ రన్నరప్ గా నిలిచాడు బుల్లితెర సీరియల్ నటుడు అమర్ దీప్ చౌదరి. అమర్ దీప్ కి మాస్ మహరాజ రవితేజ అంటే పంచ ప్రాణాలు.. ఎప్పుడు అతన్ని స్టైల్ ఫాలో అవుతుంటాడు. పలు రియాల్టీ షోల్లో రవితేజ పాటలు, డైలాగ్స్ ఫాలో అవుతుంటాడు. బిగ్ బాస్ సీజన్ 7 లో మాస్ మహరాజ సందడి చేశాడు. బిగ్ బాస్ టైటిల్ రేస్ నుంచి తప్పుకుంటే రవితేజ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని అప్పట్లో నాగార్జున చెప్పగానే అమరు అందుకు ఒకే చెప్పాడు.. బయటకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. తనపై ఉన్న అభిమానం చూసి రవితేజ.. అమర్ కి ఫిదా అయ్యాడు.
ప్రస్తుతం రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ మూవీ చేస్తూనే మరోవైపు తన బెంజ్ మార్క్ ప్రాజెక్ట్ ఒకటి లాంచ్ చేశాడు. రవితేజ 75 వ సినిమా ‘సామజవరగమన’. ఈ చిత్రంలో రచయిత భాను బోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. రవన్న దావత్ ఇస్తున్నడు..రెడీ అయిపోండ్రీ అంటూ ‘RT75’ పేరుతో ఓ పోస్టర్ రిలీజ్ అయ్యింది. అయితే ఈ రెండు చిత్రాల్లో అమర్ దీప్ కి ఏ చిత్రంలో ఛాన్స్ ఇస్తున్నారో అన్న విషయం క్లారిటీ లేదు. మొత్తానికి అమర్ దీప్ తాను అనుకున్నది సాధించాడు.. తన అభిమాన నటుడితో నటించే అవకాశం దక్కించుకున్నారని ఫ్యాన్స్ అంటున్నారు.