iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ గొడవ: పక్కా ఆధారాలతో వారిపై కేసు నమోదు..!

Police Filed A Case On Bigg Boss 7 Telugu Fans Fight: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అట్టహాసంగా ముగిసింది. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. కానీ, అభిమానులు చూపించిన అత్యుత్సాహం మాత్రం అందరినీ బాధిస్తోంది.

Police Filed A Case On Bigg Boss 7 Telugu Fans Fight: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అట్టహాసంగా ముగిసింది. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. కానీ, అభిమానులు చూపించిన అత్యుత్సాహం మాత్రం అందరినీ బాధిస్తోంది.

బిగ్ బాస్ గొడవ: పక్కా ఆధారాలతో వారిపై కేసు నమోదు..!

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఎట్టకేలకు ముగిసింది. ఆదివారం అట్టహాసంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ టైటిల్ తో బయటకు వచ్చాడు. రన్నర్ గా అమర్ దీప్ నిలిచాడు. రైతుబిడ్డ రాజసానికి తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యి అతనికే టైటిల్ కట్టబెట్టారు. ఫ్యాన్స్ అంతా అన్నపూర్ణ స్టూడియోకి చేరుకుని.. తమ అభిమాన కంటెస్టెంట్స్ కి ఘన స్వాగతం పలికారు. రైతుబిడ్డను కలిసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ, అభిమానుల ముసుగులో కొందరు చేసిన పనికి అందరూ షాకయ్యారు. ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసం చేస్తూ నానా హంగామా సృష్టించారు. వారిపై హైదరాబాద్ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిగ్ బాస్ షో తెలుగులో ఇప్పటివరకు దిగ్విజయంగా 7 సీజన్స్ పూర్తి చేసుకుంది. కానీ, ఎప్పుడూ ఇలాంటి ఘటనలు మాత్రం జరగలేదు. తమ అభిమాన కంటెస్టెంట్స్ కి మేళ తాళాలతో ఘన స్వాగతం పలికేవారు. విన్నర్ కు జేజేలు పలుకుతూ తమ అభిమానాన్ని చాటుకునేవారు. కానీ, ఈసారి మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. కంటెస్టెంట్స్ కార్లు, ఆర్టీసీ బస్సులు, పోలీసుల వాహనాలను కూడా ధ్వంసం చేశారు. మొత్తం 6 ఆర్టీసీ బస్సులు, ఓ పోలీస్ వాహనం, బిగ్ బాస్ కంటెస్టెంట్ అశ్వినీ శ్రీ కారు, గీతూ రాయల్ కారుని కూడా ధ్వంసం చేశారు. అశ్వినీ శ్రీ కొత్త కారుని బ్యాక్ సైడ్, ఫ్రంట్ విండ్ షీల్ట్ ని పగలగొట్టారు. మరోవైపు అమర్ దీప్ తన ఫ్యామిలీతో ఇంటికి వెళ్తున్న సమయంలో అతని కారుపై కూడా దాడి చేశారు. బ్యాక్ సైడ్ అద్దం మొత్తాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనలపై అశ్వినీ శ్రీ, గీతూ రాయల్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేయడంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీపై దాడి అంటే.. సమాజంపై దాడిగానే భావించాలని చెప్పారు. ఈ దాడులను హైదరాబాద్ పోలీసులు తీవ్రంగా పరిగణించారు. సీసీటీవీ ఫుటేజ్, నెట్టింట వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగా నిందితులను గుర్తించినట్లు చెప్పారు. అలాగే దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేశారు. ఎవరైతే ఈ దాడులకు పాల్పడ్డారో వారందరినీ అరెస్టు చేస్తామంటూ పోలీసులు వెల్లడించారు. మరోవైపు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మాత్రమే కాకుండా.. సెలబ్రిటీలు, గత సీజన్స్ లో పాల్గొన్న సభ్యులు కూడా ఇలాంటి దాడులను ఖండించారు. అది కేవలం షో మాత్రమే అని.. దానిని షోలాగే చూడాలంటూ విజ్ఞప్తి చేశారు. సీజన్ ముగిసిన తర్వాత కంటెస్టెంట్స్ అందరూ ఫ్రెండ్స్ గానే ఉంటారని క్లారిటీ ఇచ్చారు. అభిమానులు అని చెప్పుకుంటూ ఇలాంటి దాడులు చేయడం సిగ్గుచేటు అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తన అస్సలు సమర్థనీయం కాదంటూ కామెంట్ చేశారు. మరి.. ఆదివారం రాత్రి జరిగిన బిగ్ బాస్ గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి