iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Winner: హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. ఇలా చేశారంటే మీరు మెచ్చిన వాళ్లే విన్నర్!

బిగ్ బాస్ రియాలిటీ షోకి తెలుగులో ఎంతో ఆదరణ ఉంది. ఈ సీజన్ కూడా దాదాపు ముంగిపునకు వచ్చేసింది. ఈసారి విన్నర్ ఎవరవుతారో తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.

బిగ్ బాస్ రియాలిటీ షోకి తెలుగులో ఎంతో ఆదరణ ఉంది. ఈ సీజన్ కూడా దాదాపు ముంగిపునకు వచ్చేసింది. ఈసారి విన్నర్ ఎవరవుతారో తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.

Bigg Boss 7 Winner: హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. ఇలా చేశారంటే మీరు మెచ్చిన వాళ్లే విన్నర్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట ఆఖరికి వచ్చేసింది. 14వ వారంలోకి ఎంటర్ అయిపోయారు. ఇంకా కొన్నిరోజుల్లో బిగ్ బాస్ సీజన్ 7 పూర్తవడమే కాకుండా.. విన్నర్ ఎవరో కూడా తెలిసిపోతుంది. ఎప్పటిలాగానే మీ అభిమాన కంటెస్టెంట్ కి ఓటేసి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రేక్షకుల చేతుల్లోనే పెట్టారు. అలాగే విన్నర్ ని చేసే బాధ్యతను కూడా ఆడియన్స్ చేతుల్లోనే పెట్టారు. ఈసారి ఎప్పుడూ లేనిది బిగ్ బాస్ ఇంకో ట్విస్ట్ కూడా ఇచ్చారు. ఆ ట్విస్ట్ ఏంటి? ఉల్టా పుల్టా సీజన్ లో కొత్తగా ఏం ప్లాన్ చేశారో.. క్లియర్ గా మాట్లాడుకుందాం.

సాధారణంగా ప్రతి సీజన్లో ఆఖరి వారానికి ఐదుగురు సభ్యులు చేరతారు. వారిని టాప్ 5 కంటెస్టెంట్స్ అంటారు. ఈసారి మాత్రం 14వ వారం ఒకరిని ఎలిమినేట్ చేస్తే.. ఆరుగురు సభ్యులు ఫినాలే వీక్ కి చేరుకుంటారు. అలాంటప్పుడు టాప్-6గా అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. కానీ, అందుకు భిన్నంగా కాస్త ప్రక్రియను మార్చేశారు. అదేంటంటే.. ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉండేలా ఉంది. అంటే ఉన్న సభ్యుల్లో 14వ వారమే ఇద్దరిని ఇంటి నుంచి బయటకు పంపేసి.. టాప్-5 కంటెస్టెంట్స్ ఫినాలే వీక్ కి పంపిస్తారని అనిపిస్తోంది. అందుకు తగినట్లుగానే బిగ్ బాస్ కూడా అనౌన్స్ చేశాడు. నిజానికి నామినేషన్స్ అని చెబితే ఒకరే ఎలిమినేషన్ అనుకుంటారని.. బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చాడు.

ఈ 13 రోజులు అందరి ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయి. ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో.. వారే విన్నర్ అవుతారు. అంతేకాకుండా.. ఎవరైతే లీస్ట్ పొజిషన్ లో ఉంటారో వాళ్లు ఫినాలేకంటే ముందే ఇంటి నుంచి బయటకు పంపబడతారు అంటూ ప్రకటించారు. అంటే ఈ వీక్ కూడా ఎక్కువశాతం డబుల్ ఎలిమినేషన్ కి ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఇలాంటి ఒక ట్విస్ట్ ని పెట్టడం ఇదే తొలిసారి. ఎప్పుడూ కూడా ఇలా రెండు వారాలపాటు ఓటింగ్ లైన్స్ ని ఓపెన్ చేసి పెట్టడం చేయలేదు. అదే విషయాన్ని బిగ్ బాస్ కూడా చెప్పాడు. ఇదే తొలిసారి అంటూ చెబుతూనే.. ప్రేక్షకులు మీకు ఓట్లేస్తే మీరు విన్నర్ అవుతారు అంటూ క్లారిటీ ఇచ్చాడు.

సాధారణంగా జరిగే ప్రక్రియనే కాస్త భిన్నంగా ప్లాన్ చేశారు. ఇలా అయితే ఎవరికైతే తక్కువ ఓట్లు పడతాయో ఆ ఇద్దరూ ముందే హౌస్ నుంచి బయటకు వచ్చేస్తారు. మరి.. ఆ ఇద్దరు ఎవరు అంటే.. ఎవరికైతే తక్కువ ఓట్లు పడతాయో వాళ్లే బయటకు రావాల్సి ఉంటుంది. మీకు నచ్చిన కంటెస్టెంట్ గెలిపించుకునే ఛాన్స్ మీకు దక్కింది. ఈ 13 రోజులు మీకు నచ్చిన వాళ్లకి మీరు ఓటు వేస్తూ ఉంటే వాళ్లే విన్నర్ అవుతారు. ఇదొక మంచి అవకాశమనే చెప్పాలి. ఉల్టా పుల్టా సీజన్లో నిజంగానే మంచి ఛాన్స్ ఇచ్చారు. అయితే ఆ బాటమ్ ఇద్దరిని ఎప్పుడు హౌస్ నుంచి పంపిస్తారు అనే విషయం మాత్రం చెప్పలేదు. మరి.. ఈ సీజన్ ఎవరు విన్నర్ అవుతారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.