iDreamPost
android-app
ios-app

CPI Narayana: బిగ్ బాస్ ప్రోగ్రామ్ ఆపండి.. సీపీఐ నారాయణ కామెంట్స్

బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ రోజు జరిగిన సంఘటన నేపథ్యంలో సీపీఐ నారాయణ మరోసారి బిగ్ బాస్ ప్రోగ్రామ్ పై హీరో నాగార్జునపై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు.

బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ రోజు జరిగిన సంఘటన నేపథ్యంలో సీపీఐ నారాయణ మరోసారి బిగ్ బాస్ ప్రోగ్రామ్ పై హీరో నాగార్జునపై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు.

CPI Narayana: బిగ్ బాస్ ప్రోగ్రామ్ ఆపండి.. సీపీఐ నారాయణ కామెంట్స్

బిగ్ బాస్ ఫీవర్ అలా ఇలా లేదు. కుర్రకారు వెర్రెక్కిపోతున్నారు. బిగ్ బాస్ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేయాలని, అందుకు ఎన్ని మార్గాలున్నాయో వెతికివెతికి వేసారి, చివరికి డబ్బు వెదజల్లైనా సరే బిగ్ బాస్ స్టార్ అయిపోవాలని నిద్రపోకుండా తిరుగుతున్నవాళ్లు ఆడా,మగాలో కూడా ఉన్నారంటే బిగ్ బాస్ ఎంత కలకలం రేపిందో అర్ధమవుతుంది. ప్రోగ్రామ్ జరుగున్నంత సేపు ఓకే. ఫలితాలు వెల్లడైనప్పుడు మాత్రం ఒకటే గందరగోళం. అడ్డుకోలేని అవాంతరాలు. వీటి వల్ల బిగ్ బాస్ మోతాదు మించి మరీ చెడ్డపేరును మూట గట్టుకుంటోంది.

ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ నారాయణ ఎప్పటి నుంచో బిగ్ బాస్ మీద గుర్రుగా ఉన్నారు. ఎప్పుడు మాట్లాడినా ఇదొక అసాంఘిక కార్యక్రమంగానే ఆయన ప్రసంగించడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా కూడా నారాయణ బిగ్ బాస్ ప్రోగ్రామ్ మీద చాలా సీరియస్ లెవెల్లో ఫైర్ అయ్యారు. దానికి కారణం లేకపోలేదు. ఈ సీజన్ విన్నర్ ని ప్రకటించిన వెంటనే అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ అభిమానుల మధ్యన చిచ్చు మొదలైంది. కుస్తీ పట్టలేదు గానీ అంత పనీ జరిగింది. అదెంత వరకూ వెళ్ళిందంటే.. అదేదో అల్టిమేట్ ఫర్ ది కంట్రీ అన్న స్థాయిలో గొడవ ముదిరిపోయింది. బుర్ర చెడిపోయిన పల్లవి ప్రశాంత్ అభిమానులు అమర్ దీప్ కారు అద్దాలు పగలగొట్టేశారు. అక్కడితో ఆగలేదు. రెండు ఆర్టీసి బస్సుల అద్దాలు, ఒక పోలీసు వ్యాన్ అద్దాలు కూడా ఆ ఆవేశంలో బద్దలు కొట్టారు. ఈ ఘటనపై స్పందిస్తూ.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బాధ్యులని శిక్షిస్తామని చెప్పారు.

ఇక ఈ మాట నారాయణకి బొత్తిగా రుచించలేదు. దీంతో డైరెక్ట్ అటాక్ కే దిగారు. సంచలన వ్యాఖ్యలతో వాతావరణాన్ని వేడెక్కించారు. సజ్జనార్ చెప్పినట్టుగా కాకుండా బిగ్ బాస్ మేనేజ్ మెంట్ మీద, హీరో అక్కినేని నాగార్జున మీద కేసులు ఫైలు చేయాలని కేకలు పెట్టారు. వ్యక్తులను ఈ కూపంలోకి లాగి, ఎంజాయ్ మెంట్ కే అన్నట్టుగా తయారైంది ఈ షో అని కామెంట్ చేశారు. ఈ సారి గ్రామీణ నేపధ్యాన్ని టార్గెట్ చేసి అక్కడ కూడా పాపులారిటీ తెచ్చుకోవాలని బిగ్ బాస్ మేనేజ్ మెంట్ కావాలనే రైతు పాత్రల మీద ప్లాన్ చేశారని దుయ్యబట్టారు. వాళ్ళ స్వప్రయోజనం కోసమే ఇటువంటి కార్యక్రమాలను డిజైన్ చేస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. వెనువెంటనే బిగ్ బాస్ షోని ఇప్పటికైనా సరే కనీసం బ్యాన్ చేయాలని చెబుతూ, ఇంత జరుగుతున్నా కూడా నాగార్జున ఏమీ స్పందించకపోవడం పట్ల తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. మరి బిగ్ బాస్ షోపై, నాగార్జునపై మరోసారి నారాయణ విరుచుకుపడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.