Krishna Kowshik
బిగ్ బాస్ సీజన్ ముగిసింది. అదేంటీ ఎప్పుడో ముగిసింది కదా అనుకుంటున్నారా.. ఇక్కడ కాదు హిందీలో. అక్కడ సీజన్ 17కి జనవరి 28న తెరపడింది. ఇందులో విజేతగా నిలిచాడు. మునావర్ ఫరూఖీ.. అయితే అతడు తెలుగు వారికి సుపరిచితమే.. ఎలా అంటే..
బిగ్ బాస్ సీజన్ ముగిసింది. అదేంటీ ఎప్పుడో ముగిసింది కదా అనుకుంటున్నారా.. ఇక్కడ కాదు హిందీలో. అక్కడ సీజన్ 17కి జనవరి 28న తెరపడింది. ఇందులో విజేతగా నిలిచాడు. మునావర్ ఫరూఖీ.. అయితే అతడు తెలుగు వారికి సుపరిచితమే.. ఎలా అంటే..
Krishna Kowshik
బుల్లితెరపై ఎంటర్‌టైన్‌మెంట్ షోగా మారిపోయింది బిగ్ బాస్. విదేశాల నుండి అరువు తెచ్చుకున్న ఈ షో ఇప్పటికే అనేక భాషల్లో ప్రసారం అవుతుంది. హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్, మరాఠీ, బెంగాలీ భాషల్లో ఈ షో నడుస్తోంది. అయితే హిందీ బిగ్ బాస్ రూటే సెపరేట్. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ఇప్పటికే 16 సీజన్లను పూర్తి చేసుకుంది. ఇటీవల మొదలైన 17వ సీజన్ ఈ ఆదివారంతో ముగిసింది. లెటెస్ట్ సీజన్ విన్నర్ అయ్యాడు మునావర్ ఫరూఖీ. తన పుట్టిన రోజు నాడే అతడు బిగ్ బాస్ టైటిల్ గెలవడం విశేషం. మరో కంటెస్టెంట్ అభిషేక్ కుమార్‌ను వెనక్కు నెట్టి ఈ టైటిల్ సాధించాడు. మునావర్ ఫరూఖీ తెలుగు వారికి సుపరిచితమే. ఇంతకు అతడు ఎవరంటే..
మునావర్ ఫరూఖీ.. ప్రముఖ స్టాండప్ కమెడియన్ కమ్ ర్యాపర్. గుజరాత్‌కు చెందిన స్టాండప్ కమెడియన్‌గా అతడికి ఆల్ ఓవర్ ఇండియా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే తరచూ వివాదాల్లో నిలుస్తూ ఉంటాడు. దానికి కారణం..తన కామెడీలో హిందూ దేవుళ్లను కించపరుస్తాడన్న విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. గతంలో అతడు మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ బీజెపీ ఎంపీ కుమారుడు ఏకలవ్య సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జైలుకు కూడా వెళ్లాడు. అనంతరం బెయిల్ పై విడుదలయ్యాడు. మళ్లీ తన స్టాండప్ కామెడీతో అలరిస్తున్నాడు. అయితే అతడు ఎక్కడ షోలు నిర్వహించినా.. హిందూ సంఘాల నుండి వ్యతిరేకత రావడం ప్రారంభమైంది. దీంతో అతడి షోలు చివరి నిమిషంలో రద్దు అవుతూ ఉండేవి.
అలా 2022లో హైదరాబాద్‍లో షోను ఏర్పాటు చేశాడు మునావర్ ఫరూఖీ. అయితే ఫరూఖీ హిందూ దేవుళ్లను కించపరుస్తున్నాడని, అతడి షో నిర్వహించకూడదంటూ గోషామహాల్ బీజెపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అలా ఫరూఖీ ప్రదర్శన నిర్వహించే శిల్పకళా వేదిక వద్ద వేసిన సెట్ ను తగులబెట్టేందుకు వెళుతుండగా.. రాజా సింగ్‌ను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మునావర్ షో ముగించుకుని వెళ్లిపోయాడు. కానీ అతడిపై విమర్శలు చేసే క్రమంలో రాజా సింగ్..మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో వివాదం మరింత ముదిరింది. చివరకు బీజెపీ అతడిని సస్పెండ్ చేయాల్సి వచ్చింది. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు రాజా సింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయగా.. మళ్లీ గోషా మహాల్ నుండి పోటీ చేసి గెలుపొందాడు రాజా సింగ్.
ఇది ఇలా ఉంటే మునావార్ అటు స్టాండప్ కమెడియన్ గా నిరూపించుకుంటూనే పలు టీవీ షోల్లో కూడా పాల్గొన్నాడు. కంగనా రనౌత్ హోస్ట్ చేసిన టీవీ షో లాక్ అప్ 2022 సీజన్‌లో అతడు పాల్గొన్ని విజేత అయ్యాడు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 17లోకి అడుగుపెట్టాడు. తన ఆట తీరుతో ఫైనల్ వరకు చేరుకున్నాడు. అరుణ్ మహా శెట్టి, మన్నారా చోప్పా, అకింత లోకండే, అభిషేక్ లను వెనక్కు నెట్టి..విజయం సాధించాడు. అతడికి బిగ్ బాస్ టీం నుండి రూ. 50 లక్షల క్యాష్ ప్రైజ్.. కారు అందుకున్నాడు. మునావర్ గెలవడంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు అతడి ఫ్యాన్స్. రాజా సింగ్ విమర్శలు ఎదుర్కొన్న అతడు బిగ్ బాస్ టైటిల్ గెలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
What could be a better birthday gift than lifting the Bigg Boss 17 trophy? 😍🏆@munawar0018 #MunawarFaruqui𓃵 #HappyBirthdayMunawarFaruqui #Munawar #BiggBoss17Winner pic.twitter.com/Lwri4xwuKl
— JioTV (@OfficialJioTV) January 28, 2024