iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ విన్నర్ కి లైఫ్ ఎందుకు ఉండటం లేదు?

Winning Bigg Boss Telugu Show Is Worth Or Not: బిగ్ బాస్ షో అయితే దిగ్విజయంగా సీజన్ల మీద సీజన్లు పూర్తి చేసుకుని వెళ్తోంది. కానీ, అందులో విజేతలుగా నిలిచిన వాళ్లు మాత్రం కెరీర్ లో ఎదుగూ బొదుగూ లేకుండా అలాగే ఉండిపోతున్నారు.

Winning Bigg Boss Telugu Show Is Worth Or Not: బిగ్ బాస్ షో అయితే దిగ్విజయంగా సీజన్ల మీద సీజన్లు పూర్తి చేసుకుని వెళ్తోంది. కానీ, అందులో విజేతలుగా నిలిచిన వాళ్లు మాత్రం కెరీర్ లో ఎదుగూ బొదుగూ లేకుండా అలాగే ఉండిపోతున్నారు.

బిగ్ బాస్ విన్నర్ కి లైఫ్ ఎందుకు ఉండటం లేదు?

ఇండియాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విదేశాల్లో ఎంతగానో సక్సెస్ అయిన బిగ్ బ్రదర్ షోని.. ఇండియాలో బిగ్ బాస్ గా స్టార్ట్ చేశారు. మన దేశంలో కూడా ప్రారంభమైన ప్రతి భాషలోనూ విశేషమైన ఆదరణను సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలుగులో కూడా ఈ షోకి ఎంతో మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అప్పటికే 7 సీజన్లు, ఒక ఓటీటీ సీజన్ ను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఒక ప్రశ్న బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే.. బిగ్ బాస్ గెలిచారు బాగానే ఉంది. ఆ విన్నర్స్ కెరీర్ బిగ్ బాస్ తర్వాత ఏమాత్రం బాగుపడింది? అసలు బిగ్ బాస్ విన్నర్లకు లైఫ్ ఎందుకు ఉండటంలేదు?

బిగ్ బాస్ షో అనగానే తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి జోష్ వచ్చేస్తుంది. ఈ షో తాజాగా ఏడో సీజన్ ని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. కామన్ మ్యాన్ కేటగిరీలో హౌస్ లోకి అడుగుపెట్టిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ సీజన్ 7 విజేతగా నిలిచాడు. సామాన్యుడిగా వచ్చి సెలబ్రిటీలను కూడా వెనక్కి తోసి అసమాన్యుడు అనే బిరుదును సొంతం చేసుకున్నాడు. అయితే ఇలా గతంలో కూడా బిగ్ బాస్ షోలో విన్నర్స్ అయినవాళ్లు ఉన్నారు. అయితే ఈ షోలో పాల్గొని 105 రోజులు ఇంట్లో ఉండి కప్పు కొట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ప్రైజ్ మనీ కాకుండా.. వారి కెరీర్ కోసం ఈ షో ఏ విధంగా ఉపయోగపడుతుంది? అనే ప్రశ్నలు వినిపిస్తూ ఉంటాయి. బిగ్ బాస్ షో తెలుగులో ప్రారంభమైనప్పుడు అప్పటివరకు అసలు ఈ షో గురించి చాలా మందికి తెలియదు. అలాంటి తరుణంలో తొలి సీజన్ కు చాలా మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. తొలి సీజన్ విజేతగా శివ బాలాజీ నిలిచాడు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ, శివ బాలాజీకి ఆ కప్పు తప్ప దక్కింది ఏమీ కనిపించలేదు. అతని కెరీర్ కి కూడా ఆ షో విన్నర్ అనే పేరు ఉపయోగపడింది లేదు.

ఆ తర్వాత సీజన్ మరింత ఆసక్తిగా సాగింది. కౌశల్ విన్నర్ అయ్యాడు. కౌశల్ కోసం ఒక ఆర్మీ కూడా ఏర్పడింది. కౌశల్ ఆర్మీ అతడిని విన్నర్ గా నిల్చోబెట్టింది. ఆ తర్వాత కౌశల్ కెరీర్ లో సాధించిన విజయాలు, దక్కిన అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే శూన్యం అనే చెప్పాలి. మూడో సీజన్ కథ కాస్త భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే.. ఈ సీజన్లో విన్నర్ గా నిలిచిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మొదటి నుంచే టాలెంటెడ్ కాబట్టి.. అతనికి బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఫేమ్ అంటూ ఏమీ లేదు. కానీ, ఆ ప్రైజ్ మనీతో తాను కలలు కన్న సెలూన్ ప్రారంభించగలిగాడు. ఆర్థికంగా మాత్రం బిగ్ బాస్ రాహుల్ సిప్లిగంజ్ కు మంచి సపోర్ట్ గా నిలిచింది. నాలుగో సీజన్ చూస్తే.. హీరో అభిజిత్ విన్నర్ అయ్యాడు. అతను కూడా విన్నర్ అయిన తర్వాత పెద్దగా చెప్పుకోదగ్గ ఆఫర్స్ ఏమీ రాలేదు. అలాగే అతని కెరీర్ ఏమీ పరుగులు కూడా పెట్టలేదు.

ఐదో సీజన్లో వీజే సన్నీ విన్నర్ అయ్యాడు. ఆ తర్వాత హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఆరో సీజన్లో విన్నర్ గా నిలిచిన సింగర్ రేవంత్ ఈ కోవకు చెందడు. ఎందుకంటే స్వతహాగానే సింగర్ గా రేవంత్ కు చాలా మంచి గుర్తింపు ఉంది. బిగ్ బాస్ కి రాకముందే రేవంత్ మంచి పొజిషన్ లో ఉన్నాడు. అయితే ఈ షో ద్వారా ప్రైజ్ మనీ మాత్రమే కాకుండా.. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైనట్లు అయ్యింది. ఇక ఓటీటీ విన్నర్ బిందు మాధవికి కూడా తెలుగులో పెద్దగా అవకాశాలు వచ్చినట్లు కనిపంచలేదు. ఒక వెబ్ సిరీస్ లో మెరిసింది. తాజాగా సీజన్ 7 విన్నర్ గా నిలిచిన రైతుబిడ్డ జీవితం ఈ బిగ్ బాస్ తర్వాత ఎలా మారుతుందో చూడాలి. స్వతహాగా రైతు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్ కాబట్టి అతని లైఫ్ ఏమైనా టర్న్ తీసుకుటుందా అంటే వెయిట్ చేయాల్సిందే.

అయితే బిగ్ బాస్ వల్ల కెరీర్ లో దూసుకుపోయిన వాళ్లు కూడా బాగానే ఉన్నారు. ఒక కామన్ మ్యాన్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన రివ్యూవర్ ఆదిరెడ్డి లైఫ్ ఇప్పుడు చాలా అద్భుతంగా మారిపోయింది. అలాగే సోహెల్ కూడా బిగ్ బాస్ రెమ్యూనరేషన్, సూట్ కేస్ లో వచ్చిన డబ్బుతో బాగానే సెటిల్ అయ్యాడు. ముఖ్యంగా హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజా సీజన్లో యూట్యూబర్ గా వచ్చిన టేస్టీ తేజా కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే 4 సినిమాలు సైన్ చేశానని చెప్పాడు. ఇన్నాళ్లు సంపాదించి ఒకెత్తైతే.. బిగ్ బాస్ తర్వాత అంత సంపాదించానంటూ చెప్పుకొచ్చాడు. అయితే బిగ్ బాస్ విన్నర్లకు మాత్రం పెద్దగా ఒరిగింది ఏమీ లేదనే చెప్పాలి. బిగ్ బాస్ వల్ల కెరీర్లు పాడైన వాళ్లు కూడా ఉన్నారు. మొత్తానికి ఈ షో వల్ల పేరు, ప్రైజ్ మనీ అయితే వస్తున్నాయి. కానీ, కెరీర్ కి మాత్రం ఈ టైటిల్ పెద్దగా అక్కరకు రావట్లేదు. మరి.. బిగ్ బాస్ టైటిల్ విన్నర్స్ కు ఎందుకు లైఫ్ ఉండట్లేదు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.