iDreamPost
android-app
ios-app

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ తో పాటు అతడి సోదరుడు కూడా అరెస్ట్.. కారణమిదే

  • Published Dec 21, 2023 | 8:34 AM Updated Updated Dec 21, 2023 | 8:34 AM

బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అతడి సోదరుడిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఎందుకంటే..

బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అతడి సోదరుడిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఎందుకంటే..

  • Published Dec 21, 2023 | 8:34 AMUpdated Dec 21, 2023 | 8:34 AM
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ తో పాటు అతడి సోదరుడు కూడా అరెస్ట్.. కారణమిదే

రైతు బిడ్డ కామన్ మ్యాన్ అనే ట్యాగ్ తో బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లి.. తనను తాను నిరూపించుకుని.. టైటిల్ విన్నర్ గా బయటకు అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్ కు ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. ఫ్యాన్స్ వల్ల అయితేనేమి లేక స్వయంగా అతడు చేసిన అతి వల్ల అయితేనేమి.. కేసుల పాలయ్యాడు. బిగ్ బాస్ విన్నర్ గా సెలబ్రేషన్స్ చేసుకోవాల్సిన వాడు కాస్త.. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ రోజు నాడు.. కృష్ణానగర్ రోడ్లపై పల్లవి ప్రశాంత్ అభిమానులతో పాటు కొందరు న్యూసెన్స్ క్రియేట్ చేయడాన్ని సుమోటోగా తీసుకుని జూబ్లీహిల్స్ పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసులో పల్లవి ప్రశాంత్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. అనగా ఈ కేసులో పల్లవి ప్రశాంత్ ని ఏ-1గా చేర్చారు పోలీసులు. ఈ కేసులో మొత్తం ఐదుగురిని నిందితులుగా పేర్కొనగా.. ఏ4, ఏ5లను ఇప్పటికే అరెస్ట్ చేశారు. తాజాగా ఏ-1 పల్లవి ప్రశాంత్‌ను అరెస్ట్ చేశారు.

అయితే ఈ కేసులో ఏ-1 పల్లవి ప్రశాంత్ తో పాటు పల్లవి ప్రశాంత్‌తో పాటు ఈ కేసులో ఏ-2గా ఉన్న ఆయన సోదరుడు రవిరాజును కూడా గజ్వేలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్ స్వగ్రామమైన గజ్వేలు మండలం కొల్గూరులో ఆయన నివాసం వద్దే అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. ఇక ప్రశాంత్ సోదరుడిని కూడా పబ్లిక్ న్యూసెన్స్ కేసులోనే అరెస్ట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియో బయట అల్లర్లు చోటు చేసుకోవడం, ఆర్టీసీ బస్సుల మీద రాళ్లు రువ్వడం వంటి సంఘటన వల్ల నమోదైన పబ్లిక్ న్యూసెన్స్ కేసులో భాగంగానే పల్లవి ప్రశాంత్ సోదరుడు రవిరాజును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పల్లవి ప్రశాంత్‌పై మొత్తం 9 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక అతడికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.

 

బిగ్ బాస్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్‌కు ఘన స్వాగతం పలికేందుకు బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే జరిగిన ఆదివారం (డిసెంబర్ 22న) నాడు వందలాది మంది అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నారు. అలాగే, ఇతర బిగ్ బాస్ ఫైనలిస్టుల అభిమానులు కూడా వచ్చారు. కానీ వారిలో ఎక్కువ మంది పల్లవి ప్రశాంత్ అభిమానులే ఉన్నారని చెబుతున్నారు. అలానే రన్నరప్ గా నిలిచిన అమర్ దీప్ అభిమానులు కూడా వచ్చారు. ఈ క్రమంలో ఇరువురూ అభిమానుల మధ్య గొడవ చోటు చేసుకుంది.

ఈ క్రమంలోనే కొందరు రన్నరప్‌గా నిలిచి భార్య, తల్లితో కలిసి కారులో అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటికి వచ్చిన అమర్‌దీప్‌పై పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేశారు. కారు అద్దం పగలగొట్టారు. రాళ్లు రువ్వారు. అలాగే, మరికొంత మంది సెలబ్రిటీల కార్లపై కూడా దాడులు చేశారు. ఇక పల్లవి ప్రశాంత్ స్టూడియో నుంచి బయటికి వచ్చిన తర్వాత పోలీసులు హెచ్చరికలు బేఖాతరు చేస్తూ ర్యాలీ తీశారు. ఆర్టీసీ బస్సులను కూడా ధ్వంసం చేశారు. గొడవ జరుగుతున్న నేపథ్యంలో బిగ్ బాస్ యాజమాన్యం పోలీసుల సాయంతో పల్లవి ప్రశాంత్ ని వేరే మార్గం గుండా బయటకు పంపించారు. తిరిగి అక్కడకు రాకూడదని హెచ్చరించారు. కానీ ప్రశాంత్ వారి ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. అక్కడకు వెళ్లడంతో.. గొడవ మరింత ముదిరింది. ఈ కారణంగానే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.