Arjun Suravaram
Pallavi Prasanth: పల్లవి ప్రశాంత్.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తోన్న పేరు. కారణం.. ఆయన బిగ్ బాస్ విన్నర్ కావడం కాదు.. ఆ తరువాత జరిగిన పరిణామాలు. ఫ్యాన్స్ చేసిన రచ్చకు.. ఆయన జైలుకు వెళ్లి.. చివరకు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించే పరిస్థితి వచ్చింది.
Pallavi Prasanth: పల్లవి ప్రశాంత్.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తోన్న పేరు. కారణం.. ఆయన బిగ్ బాస్ విన్నర్ కావడం కాదు.. ఆ తరువాత జరిగిన పరిణామాలు. ఫ్యాన్స్ చేసిన రచ్చకు.. ఆయన జైలుకు వెళ్లి.. చివరకు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించే పరిస్థితి వచ్చింది.
Arjun Suravaram
తెలుగు బుల్లితెర షోల్లో ఒక్కటైన బిగ్ బాస్ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలే తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ 7లో రైతుబిడ్డగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. ఇంతవరకు బిగ్ బాస్ స్టోరీ, విన్నర్ కథ బాగానే ఉంది. కానీ ఆ తరువాత జరిగిన ఘటనలు తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే ఎప్పుడు జరగలేదు. గ్రాండ్ ఫినాలే రోజు ప్రశాంత్ అభిమానులు చేసిన న్యూసెన్స్ అంతాఇంతా కాదు. వారు చేసిన దాడులు చివరకు పల్లవి ప్రశాంత్ అరెస్టుకు దారి తీశాయి. అంతేకాక ఆయనకు కోర్టు రిమాండ్ కూడా విధించింది. ఇదే సమయంలో ప్రశాంత్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు.
బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే రోజు పబ్లిక్, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. ఆర్టీసీ బస్సు అద్దాలను, కొందరు సెలబ్రీటీల కార్లను పల్లవి ప్రశాంత్ అభిమానులు ధ్వంసం చేశారు. అంతేకాక పోలీసులు ఎంత చెబుతున్నా వినకుండా పల్లవి ప్రశాంత్ రోడ్డుపై మీటింగ్ పెట్టి..ట్రాఫిక్ సమస్యను క్రియేట్ చేశారు. ఇలా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజు జరిగిన పబ్లిక్ న్యూసెన్స్ కు పల్లవి ప్రశాంత్ కారణం అంటూ చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అలానే పోలీసులు కూడా దాడుల ఘటనలకు పల్లవి ప్రశాంతే కారణమని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
స్టూడియో బయట గేట్ నుంచి వెళ్లిపోమని చెప్పిన వినకుండా.. స్టూడియో ఎదుట ప్రశాంత్ ర్యాలీ చేయడంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. అలానే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేస్తూ వికృత చేష్టాలకు పాల్పడ్డారు. రన్నర్ అమర్ దీప్ కుటుంబపై దాడి చేయడమే కాకుండా..బూతులు కూడా తిట్టారు. ఇక తమను డ్యూటీ చేయకుండా అడ్డుకున్నారంటూ ప్రశాంత్ ను, అతడి సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. ఇక ఈ కేసులో ప్రశాంత్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.
తనపై నమోదైన కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. మరికాసేపట్లో నాంపల్లి కోర్టులో ఈ పిటిషన్ విచారణకు రానుంది. అటు పల్లవి ప్రశాంత్ అభిమానులు సంయమనం పాటించాలని ఆయన తరపు లాయర్ సూచించారు. ఇదే సమయంలో ప్రశాంత్ కి బెయిల్ వస్తుందా? లేదా? ఆయన అభిమానులతో పాటు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి.. పల్లవి ప్రశాంత్ విషయంలో జరుగుతున్న పరిణామాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.