iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు

Pallavi Prashanth Got Bail: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు గుడ్ న్యూస్ అందింది. ప్రశాంత్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Pallavi Prashanth Got Bail: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు గుడ్ న్యూస్ అందింది. ప్రశాంత్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

బ్రేకింగ్: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు

బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు కోర్టులో భారీ ఊరట లభించింది. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ అల్లర్ల కేసులో రిమాండు ఖైదీగా చంచల్ గూడ జైలులో ఉన్నాడు. పోలీసులు సుమోటోగా నమోదు చేసిన కేసులో పల్లవి ప్రశాంత్ ఏ-1 ముద్దాయిగా ఉన్నాడు. అతడిని రెండ్రోజుల క్రితం స్వగ్రామం అయిన కొల్గూరులో పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు అతని సోదరుడిని కూడా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా పల్లవి ప్రశాంత్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. అతనికి నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. ఈ వార్త తెలియగానే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్టైన విషయం తెలిసిందే. అతనికి న్యాయస్థానం 14 రోజుల రిమాండు విధించగా.. చెంచల్ గూడ జైలులో ఉంచారు. ప్రశాంత్ అరెస్టు కాబోతున్నాడు అనే విషయం తెలిసినప్పటి నుంచి అతని లాయర్లు బెయిల్ కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. గురువారం బెయిల్ కోసం దరఖాస్తు చేయగా.. విచారణను శుక్రవారానికి వాయిదా పడింది. శుక్రవారం పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. అలాగే ఆదివారం పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా రూ.15 వేల చొప్పున రెండు షూరుటీలను సమర్పించాలని కోర్టు తెలిపింది.

పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరైందనే విషయం తెలియగానే కుటుంబసభ్యులు మాత్రమే కాకుండా.. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే సెలబ్రిటీలు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా ప్రశాంత్ కి బెయిల్ వచ్చిందని తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్ కోసం సపోర్ట్ చేయడంటూ భోలే షావలి, శివాజీ, ప్రిన్స్ యావర్, అశ్వినీ శ్రీ, ఆట సందీప్ వంటి వాళ్లు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి పల్లవి ప్రశాంత్, అతని సోదరుడికి కోర్టు షరతులతో కూడా బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసు ఎంతదూరం వెళ్తుంది? ప్రశాంత్ కు ఏమైనా శిక్ష పడుతుందా? అనే విషయాలపై క్లారిటీ రావాలంటే కాస్త సమయం పడుతుంది.

అసలు కేసేంటి?:

పల్లవి ప్రశాంత్ డిసెంబర్ 17న విన్నర్ గా బయటకు వచ్చాడు. అయితే పల్లవి ప్రశాంత్ కోసం ఫ్యాన్స్ ఎంతో మంది ఎదురుచూస్తూ ఉన్నారు. అప్పటికే పోలీసులు ఎవరినీ తీసుకురావద్దు అని చెప్తే.. ప్రశాంత్ కోసం ఊరి నుంచి కూడా జనాలు వచ్చారు. పరిస్థితి అదుపు తప్పుతుందనే భయంతో పోలీసులు ప్రశాంత్ ను బ్యాక్ డోర్ నుంచి వెళ్లిపోమన్నారు. బిగ్ బాస్ యాజమాన్యం అతడిని బ్యాక్ డోర్ నుంచి పంపేసింది. కానీ, ప్రశాంత్ మాత్రం తాను దొంగని కాదని.. తన కోసం వచ్చిన వారిని కలుస్తానంటూ తిరిగి మళ్లీ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరకు వచ్చాడు. అక్కడ కూడా పోలీసులు ర్యాలీ వద్దని వారించారు. కానీ, ప్రశాంత్ మాత్రం కారులో అలాగే ముందుకు వెళ్లాడు. ఆ రోజు జరిగిన దాడుల్లో అమర్ దీప్, గీతూ రాయల్, అశ్వినీ శ్రీ కార్లు ధ్వంసం అయ్యాయి. 6 ఆర్టీసీ బస్సులు, ఒక పోలీసులు వాహనంపై కూడా దాడి జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమైన నేపథ్యంలో పోలీసులు సుమోటోగా పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ ఏ-1గా ఉన్నాడు. మరి.. పల్లవి ప్రశాంత్ కు బెయిల్ రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.