iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: ప్రిన్స్ తో రెచ్చిపోతున్న రతిక.. మీ సరసాలు తగలెయ్య..!

Bigg Boss 7 Telugu: ప్రిన్స్ తో రెచ్చిపోతున్న రతిక.. మీ సరసాలు తగలెయ్య..!

బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్ కి ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ప్రతి సీజన్లలో ఏదో ఒక జంట ఉంటూనే ఉంటుంది. లవ్ ట్రాక్ ఉంటే ఎలాంటి కవరేజ్ లభిస్తుందో హౌస్ లోకి వెళ్లే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. అందుకే అవకాశం ఉన్న వాళ్లు.. పులిహోర కలపడానికే ఎక్కువ ప్రయత్నాలు చేస్తుటారు. ఆ జంటకు బిగ్ బాస్ నుంచి మంచి కవరేజ్ లభిస్తుంది. అవకాశం దొరికినప్పుడల్లా.. వారికి క్లోజ్ షాట్లు వేస్తూ ప్రోమోలు, ఎపిసోడ్ లో స్క్రీన్ స్పేస్ ఇస్తారు. నామినేషన్స్ లో ఉన్న సమయంలో ఇది బాగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఇదే ఫార్ములాని రతికా రోజ్ వాడుతున్నట్లు కనిపిస్తోంది.

సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారికి ప్రేక్షకుల నుంచి ఆదరణ రావాలి అంటే గేమ్ బాగా ఆడాలి. వాళ్లు జెన్యూన్ గా ఉన్నారు అని ప్రేక్షకులు నమ్మాలి. అలాంటి సందర్భంలోనే వాళ్లకి ఓట్లు పడతాయి. అయితే అలా గేమ ఆడే వారికి కవరేజ్ కచ్చితంగా ఉంటుందా అంటే.. కష్టమనే చెప్పాలి. ఎందుకంటే హౌస్ లో లవ్ ట్రాక్ కి ఉన్న కవరేజ్, కొట్లాటకు ఉన్న కవరేజ్ మరో దేనికీ ఉండదు. అందుకే హౌస్ లో హైలెట్ కావాలి అంటే అయితే గొడవ పడాలి లేదా లవ్ ట్రాక్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు రతికా రోజ్ కూడా అదే పనిలో ఉంది. నిజానికి ఆమె స్ట్రాటజీకి ప్రేక్షకులే కాదు.. మాజీ కంటెస్టెంట్స్ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే.. హౌస్ లో సందర్భాన్ని బట్టి ఆమె మాట, ఆట ఇట్టే మార్చేస్తోంది. అప్పటికప్పుడే నవ్వుతుంది.. అప్పుడే నామినేట్ చేస్తుంది. మళ్లీ అప్పుడే వచ్చేసి వెనకాల తిరుగుతుంది. ఇప్పటి వరకు ఈ కథ అంతా ప్రశాంత్ తో జరిగింది.

ఇప్పుడు క్యాసెట్ ని ఛేంజ్ చేసి.. ప్రిన్స్ యావర్ పాట పాడుతోంది. అతని ముందు నువ్వు తోపు.. తురుము.. నీకు నువ్వే సాటి అంటూ కబుర్లు చెప్పింది. కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి మూడో పవరాస్త్రం కోసం ఎవరు అనర్హులు అంటే.. ప్రిన్స్ యావర్ పేరు చెప్పేసింది. అయితే ఆ మాటలు ప్రిన్స్ కి చూపించరు అనుకుని నోరు జారేసింది. కానీ, పెద్దయ్య అలా ఊరుకోడుగా.. వెంటనే కంటెండర్లకు వాళ్లు చెప్పిన మాటలు చూపించి కుండ బద్దలు కొట్టేశాడు. అది చూసిన కంటెస్టెంట్స్ అంతా నోరెళ్లబెట్టారు. అరెరె.. అనవసరంగా చెప్పేశానే అంటూ తెల్లముఖాలు వేశారు. ముఖ్యంగా రతికా రోజ్ ముఖంలో అయితే నెత్తురు చుక్క లేదు. ప్రిన్స్ గురించి చెప్పకుండా ఉండాల్సింది కదా అని కచ్చితంగా అనుకునే ఉంటుంది. పైగా ప్రిన్స్ కూడా రతికా అలా అనిందని తెలిసి షాక్ అయ్యాడు. ఆఖరికి రతికా కూడా నాకు సపోర్ట్ చేయలేదా? అంటూ అసహనం వ్యక్తం చేశాడు.

సీన్ కట్ చేస్తే.. ఇద్దరూ కిచెన్ లో ఉండి సరసాలు ఆడుకుంటున్నారు. సరసాలు అని నేను అనట్లేదు భయ్యో.. పల్లవి ప్రశాంత్ అన్నాడు. ప్రిన్స్ యావర్ రోటీలు కాలుస్తూ.. నీకు కావాలా రతికా? నీకోసం నేను ఎప్పటికీ ఉంటాను.. నువ్వు బాధ పడకు అంటూ ఆమెకు బటర్ పూసే పనిలో ఉన్నాడు. అది చూసిన ప్రశాంత్ మీ సరసాలు తగలెయ్య అంటూ పక్కకి వెళ్లిపోతాడు. ఇంకో అద్భుతం ఏంటంటే.. ఇద్దరూ ఒకే ప్లేట్ లో కలిసి భోజనం కూడా చేశాడు. ఇది చూసిన కంటెస్టెంట్స్ అవ్వా.. ఇది చూశావా అంటూ చెవులు కొరుక్కున్నారు. శుభశ్రీ అయితే వాష్ రూమ్ లో ఉండి తెగ సంబర పడిపోయింది. అతనికి ఓటు వేయకపోయినా కూడా.. ఇంకా రతికా వెనకే తిరుగుతున్నట్లు కామెంట్ చేసింది.

శుభశ్రీ.. ధామినీతో నువ్వు కూడా వెళ్లి తినిపించేయ్ ఒక పని అయిపోతుంది అంటూ కామెంట్ చేస్తుంది. అందుకు ధామినీ నేను చచ్చినా తినిపియ్యను అంటూ వెళ్లిపోతుంది. కిచెన్ లో అంట్లు తోముతున్న టేస్టీ తేజా కూడా రతికాపై కౌంటర్ వేస్తాడు. అందరూ రతికాలాగా పొదుపుగా ఉండాలి. చక్కగా ముగ్గురు ముగ్గురు ఒక ప్లేట్ లో తినేస్తే.. అంట్లు తగ్గుతాయిగా అంటూ నవ్వుకుంటాడు. రతికా ప్రిన్స్ యావర్ ని బ్యాక్ స్టాబ్ చేసింది. ముందు అతడు డిసర్వింగ్ అని చెప్పి.. కన్ఫెషన్ రూమ్ లో అనర్హుడు అని చెప్పింది. అది ప్రిన్స్ విని కోపంగా ఉన్నాడని అతనితో పులిహోర కలిపేసింది. అయితే కంటెంట్ కోసం.. కవరేజ్ కోసం.. ప్రిన్స్ యావర్ ని సల్లబరిచేందుకు తన క్యారెక్టర్ ని కంటెస్టెంట్స్ ముందు.. ప్రేక్షకుల ముందు ఇంతలా బ్యాడ్ చేసుకోవాలా? మరి.. రతికా రోజ్ స్ట్రాటజీలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి