iDreamPost
android-app
ios-app

ప్రిన్స్ పై రెచ్చిపోయిన గౌతమ్.. అర్థంలేని ఆరోపణలు చేస్తూ..!

ప్రిన్స్ పై రెచ్చిపోయిన గౌతమ్.. అర్థంలేని ఆరోపణలు చేస్తూ..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో రెండో వారంలోనే గొడవలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఒకరిని ఒకరు పర్సనల్ గా టార్గెట్ చేసుకునే స్థాయికి దిగజారిపోయారు. ఈ మొత్తం హడావుడి 2 నెలలు ఇంట్లో ఉన్నప్పుడో.. కప్పు కొట్టడానికి రెండు అడుగుల దూరంలో ఉన్నప్పుడో జరిగితే ప్రేక్షకులు కూడా ఏదో ఫ్రస్ట్రేషన్ లో అన్నారులే అనుకుంటారు. కానీ, రెండో వారంలోనే ఇంత పర్సనల్ అటాక్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. పైగా కోట్ల మంది చూస్తున్న టీవీ షోలో ఒక వ్యక్తి క్యారెక్టర్ ని అసాసిన్ చేయడం ఎంత వరకు కరెక్ట్?

హౌస్ లో మాయాస్త్ర టాస్క్ పూర్తైన తర్వాత కంటెస్టెంట్స్ మధ్య పొరపొచ్చాలు వచ్చిన విషయం తెలిసిందే. వాటి వల్ల హౌస్ లో కార్చిచ్చు రాజుకుంది. ఇప్పటికే హౌస్ లో రతిక చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తాను గేమ్ ఛేంజర్ కావడం కోసం.. కంటెస్టెంట్స్ అందరితో ఆడుకుంది. అందరిపై నోరేసుకు పడిపోయింది. ఎంతకీ ఆమె మాట వినడం లేదు అంటూ మహాబలి టీమ్ వాళ్లే అడ్జస్ట్ అయినట్లు కనిపిస్తోంది. తాజాగా వచ్చిన ప్రోమో చూస్తే హౌస్ లో యుద్ధ వాతావరణం నెలకొందనే చెప్పాలి. ముఖ్యంగా గౌతమ్- ప్రిన్స్ యావర్ మధ్య జరిగిన గొడవపై నెట్టింట చర్చలు మొదలయ్యాయి. గౌతమ్- ప్రిన్స్ యావర్ లో ఎవరిది తప్పు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఈ గొడవకు సంబంధించి పెద్దగా చర్చించాల్సిన అవసరం కూడా లేదు. నూటికి నూరు శాతం ఈ గొడవలో గౌతమ్ దే తప్పు. ప్రిన్స్ యావర్ కష్టాన్ని హేళన చేయడమే కాకుండా.. అతడి క్యారెక్టర్ ని తప్పుబడుతూ గౌతమ్ కామెంట్స్ చేశాడు. పవరాస్త్రం కోసం కంటెండర్లను ఎన్నుకునే అవకాశాన్ని మహాబలి టీమ్ కు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే రతిక చేసిన పని వల్ల ఎవరు ముందు రావాలి, ఎవరు ఏ ప్లేస్ లో రావాలి అనే విషయాన్ని నిర్ణయించే అధికారాన్ని కూడా రణధీర టీమ్ కే ఇచ్చారు. అలాగే అమర్ దీప్, శోభాశెట్టి, ప్రియాంక జైన్ ను రేసు నుంచి బిగ్ బాస్ తప్పించాడు. దాంతో అమర్ దీప్ చాలా గొడవ చేశాడు. తన బాధను బూతుల రూపంలో వెళ్లగక్కాడు. మొత్తం ముగ్గురు సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

తర్వాత వచ్చిన గౌతమ్ తన నిర్ణయాన్ని వెల్లడించేందుకు వస్తాడు. అతను ప్రిన్స్ యావర్ నుంచి మాయాస్త్రం భాగాన్ని తీసుకుంటాను అని చెప్పగానే యావర్ ఫుల్ ఫైర్ అవుతాడు. గౌతమ్ అసలు రీజన్ లేకుండా తన మాయాస్త్రం భాగాన్ని తీసుకుంటున్నాడు అంటూ గోల చేస్తాడు. ప్రిన్స్ యావర్ కేకలు వేయడంతో గౌతమ్ కూడా ఫుల్ సీరియస్ అవుతాడు. ఇద్దరూ మీద మీదకు వెళ్తారు. ఆ సమయంలో ప్రిన్స్ యావర్ నా బాడీ చూశావా అంటూ చూపిస్తాడు. దాంతో గౌతమ్ ఫుల్ ఫైర్ అయిపోయి సైగలు చేస్తాడు. నీ బాడీ ఎలా వచ్చిందో నాకు తెలుసు అన్నట్లు గౌతమ్ సైగ చేశాడు. ఆ సైగ చూసిన తర్వాత ప్రిన్స్ యావర్ రెచ్చిపోయాడు. అలా ఎలా మాట్లాడతావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పర్సనల్ గా ఎందుకు కామెంట్స్ చేస్తున్నావ్ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రిన్స్ యావర్ బాధతో ఏడ్చేశాడు.

ప్రిన్స్ యావర్ ని అమర్ దీప్ ఓదార్చాడు. అందరినీ ఏడిపించి వీళ్లు ఏం సాధిస్తారు అంటూ ప్రశ్నించాడు. తర్వాత కిచెన్ లో కూర్చుని మాట్లాడుతూ నేను డాక్టర్ ని.. నా దగ్గరకు వచ్చి చూపిస్తే ఆ బాడీ ఎలా వచ్చిద్దో నాకు తెలీదా? అంటూ కామెంట్ చేశాడు. లాన్ లో ఏదో కోపంలో అలా చేశాడు అనుకునే అవకాశం కూడా లేదు. గతంలో తేజ పెట్టిన గొడవలో కూడా గౌతమ్ అదే మాట అన్నాడు. మళ్లీ అలాగే మాట్లాడాడు. గౌతమ్ ఈ ఎపిసోడ్ తో చాలా పెద్ద నెగిటివిటీ మూటగట్టుకున్నాడు. తెలుగు రాకపోయినా ప్రిన్స్ యావర్ హౌస్ లో బాగా ఆడుతున్నాడనే చెప్పాలి. ఈ ఎపిసోడ్ తో ప్రిన్స్ రేంజ్ మరింత పెరుగుతుంది. గౌతమ్ గ్రాఫ్ మరింత పడిపోయింది. ఈ వారం గౌతమ్ ఎలిమినేట్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి.. గౌతమ్ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి