Tirupathi Rao
Tirupathi Rao
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో అసలు ఆట మొదలైపోయింది. బిగ్ బాస్ టాస్కులు ఇవ్వడం మొదలు పెట్టేశాడు. ఒక్క టాస్కు గెలిస్తే 5 వారాలు హౌస్ లో ఉండచ్చు అంటూ బంపరాఫర్ ఇచ్చేశాడు. అలాగే హౌస్ లో ఉండే అర్హత కూడా సాధిస్తారు అని చెప్పారు. 5 వారాల ఇమ్యునిటీ కోసం ఇంట్లోని సభ్యులు గట్టిగానే కష్టపడ్డారు. అందరూ వాళ్ల శక్తికి మించి ప్రయత్నం చేశారు. కొంతమంది మాత్రం మొదలు కాకముందే చేతులు ఎత్తేశారు. అయితే ఆట సందీప్ మాత్రం చివరి వరకు పోరాడాడు. అలాగే ప్రేక్షకుల మనసులు కూడా గెలుచుకున్నాడు.
ఆట సందీప్ కు బయట మంచి క్రేజ్ ఉంది. ఇటీవలే నీతోనే డాన్స్ అనే షో టైటిల్ కూడా కొట్టాడు. తర్వాత బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాడు. హౌస్ లోకి వచ్చిన తర్వాత నుంచి సందీప్ పై ప్రేక్షకులకు ఎంతో మంచి అభిప్రాయం ఏర్పడింది. నిజానికి బయట సందీప్ కు కాస్త నెగిటివ్ పేరుంది. కాస్త కోపం ఎక్కువ.. ఊరికే హైపర్ అవుతాడు అంటూ కామెంట్స్ చేసేవాళ్లు. కానీ, బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత ఆ అభిప్రాయం మారుతోంది. ఎందుకంటే హౌస్ లో అందరితో కలిసి మెలిసి ఉంటున్నాడు. అన్నీ పనుల్లో హెల్ప్ చేస్తున్నాడు. అలాంటి సందీప్ హౌస్ లో ఏడవగానే ఇంట్లోని సభ్యులు కూడా ఎమోషనల్ అయ్యారు.
అసలు ఏం జరిగిందంటే.. 5 వారాల ఇమ్యునిటీ కోసం పెట్టిన బిగ్ బాస్ కుస్తీ కార్యక్రమంలో ఆట సందీప్ కూడా పాల్గొన్నాడు. చాలా మంది పోటీలోకి దిగకముందే చేతులెత్తేస్తో.. ఆట సందీప్ మాత్రం పోరాడాడు. తనకంటే రెండింతలు ఉన్న హెజ్లర్ తో బాహాబాహీకి దిగాడు. తన శక్తికి మించే పోరాడాడు. కానీ, చివరకి ఓటమి తప్పలేదు. ఆ పోటీ తర్వాత ఆట సందీప్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఓటమి తట్టుకోలేక ఏడ్చేశాడు. ప్రిన్స్ యావర్ ఓదర్చగా.. అతడిని పట్టుకుని చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. సందీప్ ఏడవడం చూసి అతని ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో బాధ పడుతున్నారు. అలా ఏడవద్దు అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఆట సందీప్ తన పోరాట పటిమను బాగా చూపించాడని మెచ్చుకుంటున్నారు.