iDreamPost
android-app
ios-app

Priyanka Jain: బిగ్ బాస్ ప్రియాంకకు సర్జరీ.. విషయం వెల్లడించిన ప్రియుడు!

  • Published Jan 06, 2024 | 7:13 PM Updated Updated Jan 07, 2024 | 4:58 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 తర్వాత ప్రియాంక్ లైఫ్ లో బిజీ అయిపోయింది. తాజాగా తనకు సర్జరీ జరిగింది. ఆ విషయాన్ని వీడియో ద్వారా వెల్లడించారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 తర్వాత ప్రియాంక్ లైఫ్ లో బిజీ అయిపోయింది. తాజాగా తనకు సర్జరీ జరిగింది. ఆ విషయాన్ని వీడియో ద్వారా వెల్లడించారు.

  • Published Jan 06, 2024 | 7:13 PMUpdated Jan 07, 2024 | 4:58 PM
Priyanka Jain: బిగ్ బాస్ ప్రియాంకకు సర్జరీ.. విషయం వెల్లడించిన ప్రియుడు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కు ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సీజన్ లో పాల్గొన్న అందరు సెలబ్రిటీలకు మరింత గుర్తింపు, ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ అయ్యింది. ఈ సీజన్ లో ఏ లేడీ కంటెస్టెంట్ కి రాని హైప్, ఫ్యాన్ బేస్, గుర్తింపు ప్రియాంక జైన్ కు దక్కింది. ఆమె స్వతహాగానే సీరియల్ ఆర్టిస్టుగా తెలుగు బుల్లితెర ప్రేక్షకుల నుంచి ఆదరణ ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్లి వచ్చాక అది మరింత పెరిగింది. ఇప్పుడు ప్రియాంక జైన్ కు సంబంధించిన ఒక వార్త ఆమె ఫ్యాన్స్ ను కాస్త కంగారు పెడుతోంది. అదేంటంటే.. ప్రియాంక జైన్ కు సర్జరీ జరిగింది. ఆ విషయాన్ని ఆమె ప్రియుడు అధికారికంగా ప్రకటించాడు. అందుకు సంబంధిచిన వీడియో కూడా వారి యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ప్రియాంక జైన్ కు ఫైటర్ లేడీగా పేరొచ్చింది. అబ్బాయిలతో పోటీగా ఆమె సీజన్ మొత్తం పోరాడింది. చాలాసార్లు ఆమెకు చేయి దాకా వచ్చిన అవకాశాలు దక్కకుండా పోయాయి. కానీ, ఎక్కడా అధైర్య పడకుండా ఆమె ఆడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అంతేకాకుండా వాయిస్ రైజ్ చేయాల్సిన దగ్గర గట్టిగా మాట్లాడటం, అందరితో కలివిడిగా ఉడటం, అందరికీ వంట చేసి పెట్టడం ఈ విషయాల్లో ప్రియాంకకు చాలా మంచి పేరొచ్చింది. తన ఫ్రెండ్స్ హౌస్ లో ఉన్నా కూడా ఇండివిడ్యూవల్ గా ఆమె ఆడిన తీరు మంచి అప్లాజ్ అందుకుంది. ఇప్పుడు బిగ్ బస్ ప్రియాంక తన ఫ్యాన్స్ కు షాకింగ్ విషయం వెల్లడించింది. ఆమె సర్జరీ చేయించుకుంది. ఆ విషయాన్ని తన ప్రియుడు శివకుమార్ వెల్లడించాడు. ఆ మొత్తం విషయాన్ని వివరిస్తూ వాళ్లు ఒక వీడియో విడుదల చేశారు. అయితే ఇందులో కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు.

ప్రియాంకకు చిన్నప్పటి నుంచి ఐ సైట్ ఉంది. అందుకోసం కళ్లజోడు పెట్టుకుంటుంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో శివకుమార్ కూడా తన కళ్లకు సర్జరీ చేయించుకున్నాడట. ఇప్పుడు అదే సర్జరీని ప్రియాంకకు కూడా చేయించారు. ఈ సర్జరీ వల్ల ఆమెకు కళ్లజోడు పెట్టుకునే అవసరం ఉండదట. వాళ్లు ఆస్పత్రికి వెళ్లినప్పటి నుంచి సర్జరీ జరిగిన విధానాన్ని కూడా షూట్ చేసి వీడియోలో చూపించారు. ఈ సర్జరీ గురించి చెప్తూ ప్రియాంక కూడా ఎమోషనల్ అయ్యింది. “మన శరీరంలో ఎంతో ముఖ్యమైన అవయవం కళ్లు. నేను ఇలాంటి ఒక రిస్క్ ఎప్పుడూ తీసుకోలేదు. కానీ, ఈసారి తప్పక ఇలాంటి ఒక రిస్క్ తీసుకుంటున్నాను” చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ఆమె ఫ్యాన్స్, నెటిజన్స్ ఆమె ధైర్యం చెప్తున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. మరి.. ప్రియాంక జైన్ సర్జరీ చేయించుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio