iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీ నుండి హౌస్ లోకి తెలుగమ్మాయి.. నటి రతిక ప్రస్థానం!

  • Author ajaykrishna Updated - 11:31 AM, Mon - 4 September 23
  • Author ajaykrishna Updated - 11:31 AM, Mon - 4 September 23
ఇండస్ట్రీ నుండి హౌస్ లోకి తెలుగమ్మాయి.. నటి రతిక ప్రస్థానం!

ఇండస్ట్రీలో గుర్తింపు రావడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. కొంతమందికి రెండు మూడు సినిమాలకే మంచి క్రేజ్ రావచ్చు.. ఇంకొందరికి కొన్నేళ్లు పట్టొచ్చు. మరికొందరు మాత్రం అందం ఉన్నా.. అభినయం పరంగా ప్రూవ్ చేసుకునే అవకాశాలు రాక ప్రయత్నాల దగ్గరే మిగిలిపోతారు. అందులోనూ ఇండస్ట్రీలో క్లిక్ అవ్వాలంటే కొంచం అదృష్టం కూడా కలిసి రావాలని అంటుంటారు. కానీ.. ఏ ఒక్కటీ కలిసి రాక టాలెంట్ ఉండి.. మిగిలిపోయిన వారికి అప్పుడప్పుడు రియాలిటీ షో బిగ్ బాస్ బ్రేక్ ఇస్తుంటుంది. కింగ్ నాగ్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో.. తాజాగా 7వ సీజన్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈసారి బిగ్ బాస్ 7ని కాస్త గట్టిగానే ప్లాన్ చేశారు నిర్వాహకులు.

మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన బిగ్ బాస్ 7లో.. తెలుగు బ్యూటీ రతిక రోజ్ అడుగు పెట్టింది. ఎంతో అందంగా క్యూట్ గా ఉన్న రతికను చూసి.. అప్పుడే ప్రేక్షకులు అట్రాక్ట్ అయిపోయారు. అసలు ఎవరీ బ్యూటీ? ఇండస్ట్రీలో ఉండాల్సిన భామ ఇక్కడేం చేస్తుందంటూ వివరాలు ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. మరి అసలు ఎవరీ రతిక రోజ్ అనే వివరాల్లోకి వెళ్తే.. ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో నటిగా రాణించే ప్రయత్నాలు చేస్తోంది. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసిన రతిక.. తమిళంలోను డెబ్యూకి రెడీ అయ్యింది. ‘మారో’ అనే మూవీతో కోలీవుడ్ లో అడుగు పెట్టబోతుంది రతిక.

ఇక ఇండస్ట్రీలో క్లిక్ అయ్యే ప్రయత్నాలు చేస్తూనే.. ఓవైపు సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది రతిక. దాదాపు లక్ష ముప్పై వేలకు పైగా ఫాలోయింగ్ కలిగిన ఈ బ్యూటీ.. అచ్చ తెలుగమ్మాయి. ఇటీవల నేను స్టూడెంట్ సార్ మూవీలో పోలీస్ క్యారెక్టర్ పోషించింది. సోషల్ మీడియాలో తన గ్లామర్ తో ఆకట్టుకుంటున్న రతిక.. ఎన్ని సినిమాలు చేసినా గుర్తింపు రాలేదు, అందుకే బిగ్ బాస్ లోకి వచ్చానంటూ సూటిగా చెప్పేసింది. ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన రతిక.. మొదటగా ప్రియా పేరుతో పటాస్ షోలో స్టాండప్ కామెడీ చేసింది. ఆ తర్వాత ఏమైందో తెలీదు గానీ.. కొన్నాళ్ళకు రతిక రోజ్ గా ఎంట్రీ ఇచ్చింది. మరి బిగ్ బాస్ లో అయినా రతికకు బ్రేక్ లభిస్తుందేమో చూడాలి. మరి రతిక గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Rathika (@rathikarose_official)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet