iDreamPost
android-app
ios-app

శివాజీని ఎందుకు ఎలిమినేట్‌ చేయడంలేదు.. నాగార్జునను నిలదీసిన అర్జున్‌

  • Published Oct 22, 2023 | 1:23 PM Updated Updated Oct 22, 2023 | 1:23 PM

బిగ్‌ బాస్‌ హైజ్‌లో గత కొన్ని రోజులుగా శివాజీని చూసే జనాలకు, అటు కంటెస్టెంట్లకు ఉన్న డౌట్‌ ఇదే.. ఆరోగ్యం బాగా లేనప్పుడు హౌజ్‌లోనే ఉంచడం ఎంత వరకు కరెక్ట్‌ అని. ఇదుగో దీని గురించి కొత్త కెప్టెన్‌ అర్జున్‌.. డైరెక్ట్‌గా నాగార్జుననే అడిగేశాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది అంటే..

బిగ్‌ బాస్‌ హైజ్‌లో గత కొన్ని రోజులుగా శివాజీని చూసే జనాలకు, అటు కంటెస్టెంట్లకు ఉన్న డౌట్‌ ఇదే.. ఆరోగ్యం బాగా లేనప్పుడు హౌజ్‌లోనే ఉంచడం ఎంత వరకు కరెక్ట్‌ అని. ఇదుగో దీని గురించి కొత్త కెప్టెన్‌ అర్జున్‌.. డైరెక్ట్‌గా నాగార్జుననే అడిగేశాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది అంటే..

  • Published Oct 22, 2023 | 1:23 PMUpdated Oct 22, 2023 | 1:23 PM
శివాజీని ఎందుకు ఎలిమినేట్‌ చేయడంలేదు.. నాగార్జునను నిలదీసిన అర్జున్‌

ఉల్టాపుల్టా అంటూ ప్రారంభమైన బిగ్‌బాస్‌ సీజన్‌ 7.. ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. గత సీజన్లతో పోలిస్తే.. విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రారంభం నుంచి విభిన్నంగా సాగుతూ.. ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిరేకిత్తిస్తోంది. బిగ్‌బాస్‌ అనేది ఒక రియాలిటీ షో. గెలుపే లక్ష్యంగా కంటెస్టెంట్లు.. హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తారు. ఇక బిగ్‌బాస్‌ హౌజ్‌లో కొనసాగడం అంటే మాములు విషయం కాదు. కంటెస్టెంట్ల అసలు క్యారెక్టర్‌ని బయటపెట్టడం కోసం రకరకాల టాస్క్‌లు ఇస్తూ ఉంటారు. ఇక ఫిజికల్‌ టాస్క్‌ల్లో అందరూ పాల్గొనాల్సిందే. ఆడ, మగా అనే తేడా ఉండదు. అయితే గతంలో గంగవ్వ బిగ్‌బాస్‌ హౌజ్‌లకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఫిజికల్‌ టాస్క్‌లో ఆమె భాగస్వామ్యం ఎక్కువగా లేకపోవడంతో.. వయసు కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని.. మధ్యలోనే ఆమెని హౌజ్‌ నుంచిబయటకు పంపారు.

ఈ సారి సీజన్‌లో కూడా ఒక కంటెస్టెంట్‌ అలానే ఉన్నారు. శివాజీ ఫిజికల్‌ టాస్క్‌ల్లో పెద్దగా పాల్గొనడం లేదు. ఆయన అనారోగ్య సమస్యలు కూడా ఒక కారణం కావచ్చు. కానీ దీని మీద మిగతా కంటెస్టెంట్లు కొన్ని సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా వీకెండ్‌ ఎపిసోడ్‌లో భాగంగా కొత్త కెప్టెన్‌ అర్జున్‌ అంబటి.. దీని గురించి ఏకంగా నాగార్జనను ప్రశ్నించారు. అతడి వాదనతో చాలా మంది ఏకీభవిస్తున్నారు. ఇంతకు అర్జున్‌ ఏమన్నాడంటే..

వీకెండ్‌ ఎపిసోడ్‌లో భాగంగా.. కంటెస్టెంట్ల తప్పొప్పుల గురించి మాట్లాడిన తర్వాత.. హౌస్‌లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా.. మీ మైండ్‌లో మిగిలిపోయిన ఇష్యూస్ ఉన్నాయా.. అని అడిగారు నాగార్జున. దీంతో కెప్టెన్ అర్జున్ చేయి పైకి ఎత్తాడు. ఆ తర్వాత అర్జున్‌ మాట్లాడుతూ.. ‘‘సార్.. ఇది నాకే కాదు.. హౌస్‌లో చాలామందికి ఉన్న ఇబ్బంది. వాళ్లు చెప్పలేకపోవచ్చు.. బయటపెట్టలేకపోతున్నారు. అందుకే నేను మీ ముందు దీని గురించి చెప్తన్నాను. శివాజీ అన్న హెల్త్ ఇష్యూ గురించి తొందరగా నిర్ణయం తీసుకుంటే మంచిది’’ అన్నాడు.

‘‘ఎందుకంటే.. ఆయన గేమ్ ఆడట్లేదు. శివాజీని సంచాలక్‌గా పెట్టి ఇంకెన్ని రోజులు ఇలా ఉంచుతారు. అది ఆయన ప్రాబ్లమ్ కాదు.. హెల్త్ బాలేదు కాబట్టి.. అలా చేసి ఉండొచ్చు. కానీ.. అలా ఆట ఆడించకుండా.. సంచాలక్‌గా పెట్టి ఎన్నిరోజులు ముందుకు తీసుకుని వెళ్తారు? శివాజీ అన్న గురించి త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది. ఇది హౌజ్‌లోని అందరి అభిప్రాయం’’ అంటూ డైరెక్ట్‌గా నాగార్జుననే అడిగేశాడు అర్జున్‌.

పంపిచేయమన్న శివాజీ..

అర్జున్‌ అడిగిన ప్రశ్నపై నాగార్జున స్పందిస్తూ.. ‘‘ఆడేవాడు గెలిచేవాడు ఎలా ఉంటాడో తెలుసా.. తనకు ఏమైనా పట్టించుకోడు.. ఆటలోని ఉండి గెలిచి చూపిస్తాడు’’ అంటూ చెప్పుకొచ్చాడు. అనంతరం శివాజీని కన్ఫెషన్ రూంకి పిలిచారు నాగార్జున. అతడి సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. ‘‘ఏంటి శివాజీ ఏమైంది.. ఆరోగ్యం ఎలా ఉంది’’ అని అడిగారు. దీంతో శివాజీ.. ‘‘బాలేదు సార్.. శరీరం నా మాట వినడం లేదు. నిద్ర లేదు.. చేయి మొత్తం లాగుతుంది. స్నానం చేయాలన్నా.. బాత్ రూంకి వెళ్లాలన్నా ఇబ్బందిగానే ఉంది. నేను ఇక ఆడలేను.. మిమ్మల్ని అడిగి వెళ్లిపోదాం అని ఆగాను.. నాకు తెలిసిపోతుంది.. ఇక నేను ఉండలేను’’ అని చెప్పుకొచ్చాడు శివాజీ.

శివాజీకి ఫిజియో..

అందుకు నాగార్జున.. ‘‘ఇది నీ బాడీ కండిషనా? మైండ్ కండిషనా? అని అడిగారు. అప్పుడు శివాజీ ‘‘బాడీ కండిషన్ బాబుగారూ.. మైండ్‌కి తీసుకోను.. నేను చాలా మొండివాడ్ని’’ అని చెప్పుకొచ్చాడు శివాజీ. అదే మొండితనంతో రిక్కీకి చెప్పి వచ్చావ్ కదా.. నీ ఆరోగ్యం గురించి డాక్టర్లు ఎప్పటికప్పుడు ట్రీట్ మెంట్ చేస్తూనే ఉన్నారు. నువ్వు టెన్షన్ పడకు.. డాక్టర్లు.. నీ బాడీ సహకరించదు అని చెప్పిన క్షణాన మేమే నిర్ణయం తీసుకుంటాం’’ అని అన్నారు నాగార్జున.

దాంతో శివాజీ.. ‘‘నాకు ఫిజియో ఉంటే సెట్ అవుతుందని అనిపిస్తుంది’’ అన్నాడు. అందుకు నాగార్జున.. సరే వెంటనే ఏర్పాటు చేస్తాం అని మాట ఇచ్చారు. ఆతర్వాత హౌజ్‌మెట్స్‌తో మాట్లాడిన నాగార్జున ‘శివాజీ రెట్టింపు ఉత్సాహంతో ఆట ఆడబోతున్నాడు. అతని పరిస్థితిని డాక్టర్ల చూస్తారు.. వాళ్లు రిపోర్ట్ ఇచ్చిన తరువాత.. బిగ్ బాస్ నిర్ణయం తీసుకుంటారు’ అని చెప్పారు నాగార్జున.