iDreamPost
android-app
ios-app

వీడియో: అదిరిపోయిన బిగ్ బాస్-7 గ్రాండ్ ఫినాలే ప్రోమో!

Bigg Boss-7 Promo: మరికొద్ది గంటల్లో బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఎవరు అనేది తేలనుంది. అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ మధ్య గట్టి పోటీ ఉందని టాక్. ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో ఏకంగా సినిమానే చూపించేశారు.

Bigg Boss-7 Promo: మరికొద్ది గంటల్లో బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఎవరు అనేది తేలనుంది. అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ మధ్య గట్టి పోటీ ఉందని టాక్. ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో ఏకంగా సినిమానే చూపించేశారు.

వీడియో: అదిరిపోయిన బిగ్ బాస్-7 గ్రాండ్ ఫినాలే ప్రోమో!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునే షోల్లో బిగ్ బాస్ రియాల్టీ షో ఒకటి. ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకుని.. ఏడో సీజన్ నడుస్తోంది. ఈ సీజన్ కూడా నేటితో ముగినుంది. ఆదివారం సాయంత్రం జరిగే బిగ్ బాస్ సీజన్ 7  గ్రాండ్ ఫినాలేలో విన్నర్ ఎవరో తేలనుంది. ఉల్టాపుల్టా అంటూ ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 7.. అందుకు తగ్గట్లే ఎన్నో ట్విస్టులతో సాగింది. చివరకు ఆరు మంది ఫైనలిస్టులు గ్రాండ్ ఫినాలేకి ఘనంగా ఎంట్రి ఇచ్చారు. తాజాగా బిగ్ బాస్-7 కి సంబంధించిన గ్రాండ్ ఫినాలే  ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో ఓ సినిమాను చూపించేసినట్లుగా ఉంది. ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఇక అదరగొట్టిన ఈ  బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ప్రోమోను చూసినట్లు అయితే.. 105 రోజులు, 19 మంది కంటెస్టెంట్స్, విన్నర్ ఒక్కరే, ఆ విన్నర్ ఎవరో ఈరోజు తెల్చేసుకుందమంటూ ఈ సీజన్ గ్రాడ్ ఫినాలే ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ఆట మొదలుపెట్టారు. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్ అంటూ ఆట పాటలు ఎలా ఉండబోతుందో చూపించారు. ఇక హౌస్ లో ఉన్న టాప్ సిక్స్ కంటెస్టెంట్స్ తోనే కాకుండా ఎలిమినేట్ అయిన మిగిలిన 13 మందితో కూడా బిగ్ బాస్ మాట్లాడించారు. ఈక్రమంలోనే తొలుత సింగర్ దామిని మాట్లాడారు. తనకి ఎంతో ఇష్టమైన దామినితోనే కింగ్ నాగార్జున మాట్లాడించడం ప్రారంభించారు.

హౌస్‌లోకి వెళ్లిన తరువాత నీ లైఫ్ ఎలా ఉంది? అని నాగార్జున అడిగిన ప్రశ్నకు.. పదిరెట్లు బెటర్‌గా ఉందని దామిని సమాధానం ఇచ్చారు. ఇక టేస్టీ తేజా అయితే తనకు ఏకంగా 15 సినిమా ఆఫర్లు వచ్చాయని అన్నాడు. ఎక్కడికి వెళ్లినా మనోభావాల పాప అని గుర్తు పడుతున్నారని శుభశ్రీ చెప్పింది. భోలే అంటే హీరో అంటూ  సింగర్ భోలే అదరగొట్టాడు. ఆ తరువాత ఆనందో బ్రహ్మ.. బాగుందో నా జన్మ అనే పాటతోనే అందరిని అలరించాడు. ఇక తాను సొంతంగా ట్యూన్ చేసిన పాటకు బోలే స్టెప్‌లు వేశాడు. ఇక యాంకర్ సుమ బిగ్ బాస్ కి రావడం కొత్తమే కాదు.

గతంలోనూ ఆమె వచ్చి.. ప్రేక్షకులను అల్లరించారు.  పనిలో పనిగా తన కొడుకు సినిమాను ప్రమోట్ చేసింది. మాస్ మహారాజా రవితేజ, అల్లరి నరేష్, రాజ్ తరణ్, కళ్యాణ్ రామ్, సుమ, రోషన్, పలువురు హీరోయిన్లు గెస్ట్‌లు కనిపించారు. మొత్తంగా 6 నిమిషాలకు పైగా సాగిన ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంది. విన్నర్ ఎవరు అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. మరి..  బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabet