iDreamPost
android-app
ios-app

Ariyana- Amardeep: అమర్ కు అరియానా సపోర్ట్.. అనవసరంగా ఇరుక్కుందిగా!

Ariyana- Amardeep: అమర్ కు అరియానా సపోర్ట్.. అనవసరంగా ఇరుక్కుందిగా!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 2.0లో ప్రేక్షకులకు గట్టిగానే ఎంటర్ టైన్మెంట్ లభిస్తోంది. కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డు ఎంట్రీలు కూడా బాగానే ఆడుతున్నారు. ముఖ్యంగా అంబటి అర్జున్, నయని పావని బాగా హైలెట్ అవుతున్నారు. పాత హౌస్ మేట్స్ లో చాలామందితో పోలిస్తే వీళ్లే చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఇంక అమర్ విషయానికి వస్తే.. ఈవారం కూడా తానేంటో చూపిస్తానంటూ చెబుతున్నాడు. ఆ మాట అనడానికి అమర్ కు ఇబ్బందిగా లేకపోయినా.. వినడానికి ఆడియన్స్ కు కాస్త ఇబ్బందిగానే ఉంది. అయితే ఆడలేక అల్లాడుతున్న అమర్ కు అరియానా మద్దతుగా నిలిచింది. అదేంటే కష్టాల్లో ఉన్న మిత్రుడుకి సపోర్ట్ చేస్తే అరియానాని ట్రోల్ చేస్తున్నారు.

అమర్- అరియానా ఎంత మంచి మిత్రులో అందరికీ తెలిసిందే. అమర్ హౌస్ లోకి వెళ్లినప్పటి నుంచి అరియానా గ్లోరీ తన సపోర్ట్ తెలియజేస్తూనే ఉంది. అమర్ పై ట్రోల్స్ వచ్చినప్పుడల్లా అరియానా కౌంటర్ చేస్తోంది. అతని ఆటను ప్రమోట్ చేస్తూ మద్దతిస్తోంది. తాజాగా అమర్ ఆట గురింటి అరియానా తన అభిప్రాయాన్ని వీడియో రూపంలో తెలియజేసింది. “మనం లైఫ్ లో చాలాసార్లు ఏవేవో ట్రై చేయాలి అనుకుంటా. ఏవేవో ఆశలతో ఉంటాం. ఏదో సాధించాలి, అచీవ్ చేయాలి అనుకుంటాం. మనకు పోటీగా ఉన్నవాళ్లు మనం చేయలేము చేయలేము అని పదే పదే చెబుతూ ఉంటారు. కొన్నిరోజులకు అవి వినీ వినీ మనం కూడా ఏదో లోగా ఉన్న సమయంలో నిజం అని నమ్ముతాం. అమర్ విషయంలో కూడా అదే జరిగింది.

కొన్నిసార్లు టైమ్ కలిసిరాదు. హౌస్ లోకి వెళ్లిన కొందరు అమర్ కి కావాల్సిన ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తారు. అయితే వాళ్లు మంచికోసమే నామినేట్ చేశారు. కానీ, వాళ్లు కూడా నామినేట్ చేయగానే వాడికి మరీ ఇంత బ్యాడ్ అయ్యానా? అనే అనుమానం అమర్ కి కూడా వచ్చింది. మన అనుకున్న ఫ్రెండ్స్ మనల్ని వదలరు అనుకున్న ఫ్రెండ్స్ మంచికే నామినేట్ చేసినా మానసికంగా షాక్ తగులుతుంది. వాడి మంచితనమో.. వెర్రితనమో నాకు అర్థం కావడం లేదు. లెటర్ టాస్కులో.. ఆ రోజు లెటర్ చదివి ఉంటే వాడు ఈరోజు ఈ పిరిస్థితిలో ఉండే వాడు కాదేమో. ఒక్కోసారి ఒత్తిడిలో చిన్న చిన్న లాజిక్స్ కూడా మర్చిపోతూ ఉంటాం. ఒత్తిడిలో ఉన్నప్పుడు కొన్ని బుర్రకు అందవు. ఆ చిన్న చిన్నవి అమర్ చెప్పలేక కాదు. నువ్వు ఆడవు అంటే.. ప్రతి చిన్న విషయం వాడికి పెద్ద టాస్కులా ఉంది.

టెన్షన్ తో చిన్న వాటిపై ఫోకస్ చేయలేకపోతున్నాడు. ఆ టైమ్ లో ఎవరికోసం అయితే లెటర్ త్యాగం చేశాడో వాళ్లు కాస్త ధైర్యం చెప్తే బాగుండేది. వెనకాల నవ్వకుండా” అంటూ అరియానా తన అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తూనే.. అమర్ కు సపోర్ట్ చేసింది. అయితే అరియానా గ్లోరీ వీడియో సందేశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమర్ ఫ్యాన్స్ అరియానా మాటలతో ఏకీభవిస్తూ సపోర్ట్ చేస్తున్నారు. కానీ, కొందుర మాత్రం అరియానా చెప్పిన మాటలను తప్పుబడుతున్నారు. సీరియల్స్ చూసి ఫ్యాన్ అయ్యాం.. రియల్ గా చూసి ఫీలయ్యాం అంటున్నారు. జేన్యూన్ గా ఆడితే.. ఎవరి రికమెండేషన్ అక్కర్లేదు అంటూ ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి అమర్ కు సపోర్ట్ చేయబోయి అరియానా కూడా ట్రోలింగ్ కి గురైంది. మరి.. అమర్ దీప్ ఆటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Ariyana Glory (@ariyanaglory)