iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: అర్జున్ పై సర్వత్రా ప్రశంసలు.. టైటిల్ విన్నర్ అవుతాడంటూ..!

అంబటి అర్జున్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 తొలి ఫైనలిస్ట్ అయ్యి తన ఫ్యాన్స్ ని ఖుషీ చేశాడు. తన కష్టంతో ఆటలో విజయం సాధిస్తూ వచ్చాడు.

అంబటి అర్జున్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 తొలి ఫైనలిస్ట్ అయ్యి తన ఫ్యాన్స్ ని ఖుషీ చేశాడు. తన కష్టంతో ఆటలో విజయం సాధిస్తూ వచ్చాడు.

Bigg Boss 7 Telugu: అర్జున్ పై సర్వత్రా ప్రశంసలు.. టైటిల్ విన్నర్ అవుతాడంటూ..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట దాదాపు ముగింపు దశకు వచ్చేసింది. హౌస్ లో ఉన్న 8 మంది సభ్యుల్లో కేవలం ఐదుగురు మాత్రమే ఫినాలే వారానికి వెళ్లనున్నారు. అలాగే ఈసారి సీజన్ ఇంకో వారం పొడిగించే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే నిజమైతే ఉల్టా పుల్టా అన్నందుకు అలాగే చేసినట్లు అవుతుంది. అంతేకాకుండా ఏ సీజన్లో లేని విధంగా హౌస్ మేట్స్ కు బిగ్ బాస్ ఒక గంట సమయం కేటాయించి నిద్రపోమన్నారు. ఇంకా ఈ రెండు మూడు వారాల్లో ఇలాంటి ట్విస్టులు బిగ్ బాస్ గట్టిగానే ప్లాన్ చేసి ఉండచ్చు. ఇంక అందరూ ఇప్పుడు అంబటి అర్జున్ ఆట గురించే మాట్లాడుకుంటున్నారు. తొలి ఫైనలిస్ట్ అవ్వడంతో అతని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

అంబటి అర్జున్ హౌస్ లోకి వైల్డ్ కార్డుగా అడుగుపెట్టినప్పటి నుంచే అతనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎవరికీ కొమ్ము కాయకుండా కేవలం తన ఆట తాను ఆడుతూ సింగిల్ గా హౌస్ లో సర్వైవ్ అవుతున్నాడు. అలాగే తొలి ఫైనలిస్ట్ అయ్యి రికార్డు క్రియేట్ చేశాడు. ఫినాలే వీక్ కి తొలి ఫైనలిస్ట్ అవ్వడానికి ఈ వీక్ మొత్తం టాస్కులు పెట్టారు. ఆ టాస్కుల్లో అంచలంచెలుగా ఒక్కొక్కరిని తొలగిస్తూ వచ్చారు. అలా చివరకు అమర్- అర్జున్ మధ్య ఆఖరి పోరు నిర్వహించాల్సి వచ్చింది. ఆ తుదిపోరులో అర్జున్ అద్భుతమైన ఆటతీరుతో విజయం సాధించాడు. నిజానికి మొదట అమర్ ముందంజలో ఉండగా.. చివర్లో మాత్రం అర్జున్ చక్రం తిప్పాడు. చాలా స్పీడుగా ఆడుతూ అమర్ ని ఓడించాడు. అయితే అర్జున్ గెలవడంపై అమర్ కూడా ఆనందం వ్యక్తం చేశాడు.

ఇద్దరిలో ఎవరు ఫైనలిస్ట్ అయినా కూడా నాకు సంతోషమే అంటూ చెప్పుకొచ్చాడు. ఈ టాస్కుకు సంబంధించి అర్జున్ మీద సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఎదుకంటే ఫైనలిస్ట్ టాస్కుల్లో అందరూ కూడా తమ ఫ్రెండ్స్, సపోర్టర్స్ నుంచి పాయింట్లు తీసుకుని రేసులో నిలిచిన వాళ్లే. అమర్ కు శోభా- శివాజీ- గౌతమ్ తమ పాయింట్స్ ఇచ్చారు. గౌతమ్ కు ప్రియాంక తన పాయింట్లను ఇచ్చింది. ప్రశాంత్ కు యావర్ తన వద్దనున్న పాయింట్స్ కొన్ని ఇచ్చాడు. కానీ, అర్జున్ కు మాత్రం ఎవ్వరూ కూడా ఒక్క పాయింట్ కూడా ఇవ్వలేదు. తనకు వచ్చిన 1,110 పాయింట్లు కేవలం అతని కష్టార్జితం. అతను టాస్కుల్లో వరుసగా గెలుస్తూ ఆ పాయింట్లను సాధించాడు.

తన కష్టంతోనే ఫైనల్ కు చేరాడు. తన స్వయంకృషితోనే తొలి ఫైనలిస్ట్ కూడా అయ్యాడు. లాస్ట్ వీక్ అర్జున్ హోస్ట్ నాగార్జునతో ఒక మాట అన్నాడు. సార్.. నేను గ్రూప్ కాదు సార్. నేను కనీసం ఒక్క గ్రూపులో కూడా లేను సార్ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ఫైనలిస్ట్ టాస్కుతో ఆ విషయం రుజువైంది. హౌస్ లో అర్జున్ ఏకాకి అనే విషయం తేటతెల్లమైంది. ఈ తరుణంలోనే అర్జున్ టైటిల్ విన్నర్ కూడా అవుతాడంటూ చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఈ సీజన్ ఉల్టా పుల్టా కాబట్టి. ఇప్పటివరకు వైల్డ్ కార్డు ఎవరూ విన్నర్ అయ్యింది లేదు. కానీ, అర్జున్ కు ఆ ఛాన్స్ ఉందని చెబుతున్నారు. పైగా అర్జున్ మంచి ఎఫర్ట్స్ పెడుతున్నాడు. ఈ అన్నీ పాయింట్స్ ని దృష్టిలో పెట్టుకునే అలాంటి కంక్లూజన్ కి వస్తున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఏదీ కూడా ముందే ఊహించడానికి ఉండదు. ఎప్పుడు ఏదైనా జరగచ్చు. మరి.. అర్జున్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ అవుతాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి