iDreamPost
android-app
ios-app

పల్లవి ప్రశాంత్ అరెస్టుపై తొలిసారి స్పందించిన అమర్ దీప్!

Amardeep On Pallavi Prashanth Arrest: బిగ్ బాస్ సీజన్ 7 ముగిసినా కూడా ఆ షో మీద వార్తలు మాత్రం ఆగట్లేదు. తాజాగా అమర్ దీప్ పల్లవి ప్రశాంత్ అరెస్టుపై స్పందించాడు.

Amardeep On Pallavi Prashanth Arrest: బిగ్ బాస్ సీజన్ 7 ముగిసినా కూడా ఆ షో మీద వార్తలు మాత్రం ఆగట్లేదు. తాజాగా అమర్ దీప్ పల్లవి ప్రశాంత్ అరెస్టుపై స్పందించాడు.

పల్లవి ప్రశాంత్ అరెస్టుపై తొలిసారి స్పందించిన అమర్ దీప్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగిసి చాలా రోజులు అవుతోంది. కానీ, ఆ సీజన్ గురించి మాత్రం ఎక్కడో ఒక దగ్గర వార్తలు వస్తూనే ఉన్నాయి. నిజానికి ఉల్టా పుల్టాగా వచ్చిన ఈ సీజన్ ఆద్యంతం ఉల్టాగానే సాగింది. అంతేకాకుండా ఏ సీజన్ లో జరగనివి, చూడనివి ఈ సీజన్ లో చూశాం. కామన్ మ్యాన్ విన్నర్ అయ్యాడు, అదే విన్నర్ అరెస్టు అయ్యాడు. ఇంత వరకు ఈ రెండూ ఏ సీజన్లో జరగలేదు. ఈ ఒక్క సీజన్ లోనే చూశాం. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ బెయిల్ పై ఉన్న విషయం తెలిసిందే. అతని అరెస్టు తర్వాత సెలబ్రిటీలు, కంటెస్టెంట్స్ చాలామంది రెస్పాండ్ అయ్యారు. తాజాగా బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్ కూడా పల్లవి ప్రశాంత్ అరెస్టుపై రియాక్ట్ అయ్యాడు.

నిజానికి సీజన్ ప్రారంభం నుంచి విన్నర్- రన్నర్ మధ్య అస్సలు వర్కౌట్ కాలేదు. ఇద్దరూ ఏదో ఒక విషయంలో కొట్టుకుంటూనే ఉన్నారు. అది ఆఖరి వారం వరకు సాగింది. నిజానికి ఆఖరి రెండ్రోజుల వరకూ జరిగిందనే చెప్పాలి. ఆ తర్వాత గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత కూడా వారి మధ్య కోల్డ్ వార్ అయితే నడిచింది. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పేరిట అమర్ కారుపై దాడి చేశారు. పైశాచికంగా కారు అద్దాలు పగలగొట్టారు. లోపల అమర్ భార్య, తల్లి ఉన్నారని కూడా చూడకుండా నానా రచ్చ చేశారు.

Amardeep reaction on prashanth arrest

అమర్ కుటుంబం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ ఘటనపై అమర్ కూడా రియాక్ట్ అయ్యాడు. తన కుటుంబానికి ఏమవుతుందో అని భయపడినట్లు తెలిపాడు. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేయడం, పల్లవి ప్రశాంత్ సోదరులను అరెస్టు చేయడం కూడా జరిగిపోయింది. అయితే పల్లవి ప్రశాంత్ అరెస్టుపై ఇప్పటివరకు అమర్ స్పందించలేదు. కానీ, తాజాగా అతని అరెస్టుపై అమర్ రియాక్ట్ అయ్యాడు. అలాగే రవితేజాతో సినిమా, ఫ్యామిలీ గురించి కూడా కామెంట్స్ చేశాడు.

“నేను చాలా బాగున్నాను. బిగ్ బాస్ విన్నర్ కాలేకపోయాను అనుకుంటున్నారు. కానీ, రవితేజ గారు సినిమా ఇచ్చినప్పుడే నేను గెలిచాను. రవితేజ గారి మూవీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. కాల్ ఇంకా రాలేదు. త్వరలోనే వస్తుందని భావిస్తున్నాను. మరో కొన్ని ప్రాజెక్ట్స్ తో మీ ముందుకు వస్తాను. బిగ్ బాస్ వల్ల లైఫ్ ఛేంజ్ అయిపోయింది అని చెప్పను. కానీ, ఇప్పుడు కామన్ ఆడియన్స్ అందరికీ నేను దగ్గరయ్యాను. ఎప్పుడన్నా బయటకు వెళ్తే అందరూ నన్ను చూసి గుర్తు పడుతున్నారు” అంటూ చెప్పుకొచ్చాడు. పల్లవి ప్రశాంత్ అరెస్టుపై మాట్లాడుతూ.. “అది కేవలం కొన్ని మిస్ అండర్ స్టాండింగ్స్ వల్ల అలా జరిగింది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అవన్నీ క్లియర్ అయిపోయాయి. ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఫ్యాన్స్ మధ్య గొడవలు అంటే నేను కాలేజ్ ఉన్నప్పుడు కూడా నా హీరో సినిమా అంటే నా హీరో సినిమా అని కొట్టుకున్నవాళ్లమే. వాళ్ల సపోర్ట్ వల్లే ఇక్కడి దాకా వచ్చాం. అలాంటివి ఏమీ పెట్టుకోకండి. అందరూ బాగుండండి” అంటూ అమర్ దీప్ ఫ్యాన్స్ వార్ గురించి కూడా కామెంట్స్ చేశాడు. మరి.. పల్లవి ప్రశాంత్ అరెస్టుపై అమర్ తొలిసారి రియాక్ట్ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి