కప్పు కొడతానని అంత గట్టిగా చెప్పావ్.. ఏది ఈ ఆటతోనేనా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కెప్టెన్సీ పోటీదారులు అయ్యేందుకు హౌస్ మేట్స్ చాలానే కష్టపడుతున్నారు. కప్పు కొడతానన్న అమర్ మాత్రం మొదటి రౌండ్ లోనే చతికిల పడ్డాడు. ఓడిపోవడం తప్పు కాదు.. కానీ, గెలవడం కోసం అమర్ దీప్ చేసిన పని ఇప్పుడు నిండా ముంచేలా కనిపిస్తోంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కెప్టెన్సీ పోటీదారులు అయ్యేందుకు హౌస్ మేట్స్ చాలానే కష్టపడుతున్నారు. కప్పు కొడతానన్న అమర్ మాత్రం మొదటి రౌండ్ లోనే చతికిల పడ్డాడు. ఓడిపోవడం తప్పు కాదు.. కానీ, గెలవడం కోసం అమర్ దీప్ చేసిన పని ఇప్పుడు నిండా ముంచేలా కనిపిస్తోంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కెప్టెన్సీ పోటీదారుల కోసం హౌస్ లో ఛాలెంజెస్ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ప్రియాంక, పల్లవి ప్రశాంత్ ఇద్దరూ కంటెండర్స్ గా గెలుపొందారు. హౌస్ లో ఇంకా ఛాలెంజెస్ జరుగూతనే ఉంటాయి. ఎవరికి వాళ్లు కంటెండర్స్ అయ్యేందుకు పోరాడుతున్నారు. అయితే హౌస్ నుంచి కప్పు కొట్టే పోతాను అంటూ ఛాలెంజ్ విసిరిన అమర్ దీప్ మాత్రం మొదటి ఛాలెంజ్ లోనే చతికిల పడ్డాడు. ఆట గురించి పక్కన పెడితే ఫౌల్ గేమ్ తో గెలవాలని చూశాడు. అదే స్ట్రాటజీతో ఇప్పుడు ప్రేక్షకుల నుంచే కాదు.. అభిమానుల నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

అమర్ దీప్ మొదటి నాలుగైదు వారాల్లో బాగా నెగిటివ్ అవ్వడానికి కారణం ఆట ఆడకపోవడం. అంతేకాకుండా ఆడిన ఆటను సక్రమంగా ఆడకుండా ఉండటం. అంటే ఆడే టాస్కుల్లో ఫౌల్ గేమ్ ఆడటం అనమాట. అలాంటి ఆట వల్ల హౌస్ మేట్స్ నుంచి కాకుండా.. ప్రేక్షకుల నుంచి అతని బడీ సందీప్ నుంచి కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు. వీకెండ్ లో నాగార్జున హితవు కూడా పలికారు ఆట అంటే నిజాయతీగా ఆడాలి అని. అప్పుడు సరే అని తలూపాడు. ఇప్పుడు మళ్లీ అదే ఆటను ఆటడం ప్రారంభించాడు. ఫ్లోట్ ఆర్ సింక్ టాస్క్.. చూడటానికి చాలా సిల్లీగా అనిపించినా కూడా.. చాలా కష్టమైన టాస్క్.

ఒక వస్తువు నీళ్లల్లో వేస్తే మునుగుతుందా? తేలుందా అని అంత ఫాస్ట్ గా చెప్పడం సాధ్యం కాదు. అయితే ఆటలో ఓడిపోవడం నేరం కాదు.. ఓడిపోతే ఎలిమినేట్ కారు. కెప్టెన్సీ కంటెండర్ కావడం కోసం అమర్ దీప్ ఎంతో ఫౌల్ గేమ్ ఆడాడు. శోభాశెట్టి, ప్రియాంక, రతికాలతో డీల్ చేసుకున్నాడు. ఆఖరికి సంచాలక్ ని కూడా సైగ చేయమని చెప్పాడు. ఆడే ఫౌల్ గేమ్ ని కూడా అమర్ దీప్ సరిగ్గా ఆడలేకపోయాడు. ఇంతమందిని నమ్ముకుని నట్టేట మునిగాడు. అలా మునగడం మాత్రమే కాదు.. తన క్రెడిబిలిటీని కూడా ముంచేసుకున్నాడు. ఇప్పుడు ఈ టాపిక్ మీద హౌస్ మొత్తం అమర్ దీప్ గురించి సెటైర్లు వేసుకున్నారు. శివాజీ అయితే మరీ దారుణంగా బుర్రకి స్ప్రే చేసుకోమంటే.. మోకాలికి చేసుకున్నాడేమో? అంటూ వెటకారం చేశాడు.

తాను చెప్పిన మాట వినలేదు అని శోభాశెట్టి అలిగింది కూడా. నిజంగా శోభా ఆట చూస్తే నవ్వాలో.. ఏడవాలో.. మెచ్చుకోవాలో ఏం అర్థం కాదు. చేసేది తప్పు.. మళ్లీ తనని నమ్మలేదు అని అలిగింది. నిజానికి ముందురోజు ఎపిసోడ్ లో అమర్ దీప్ చేసిన కామెంట్స్ చూసి అభిమానులు, ఆడియన్స్ ఉప్పొంగిపోయారు. అమర్ దీప్ ఈజ్ బ్యాక్ అంటూ సంబరాలు చేసుకున్నారు. కానీ, ఒకరోజు గ్యాప్ లోనే మళ్లీ తన గ్రాఫ్ ని చేతులారా పాతాళానికి పడేసుకున్నాడు. ఇలాంటి ఫౌల్ గేమ్ తో కప్పు కొట్టడం అయ్యే పని కాదు. కప్పు సంగతి పక్కన పెడితే రాత్రి తినకుండా కూర్చుని ఏడుస్తున్నాడు. మళ్లీ శోభాశెట్టి, ప్రియాంక వెళ్లి ఓదార్చారు. మరి.. అమర్ దీప్ ఆట తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments