iDreamPost
android-app
ios-app

Shobha Shetty :ప్రియుడితో పెళ్ళికి రెడీ .. ఎంగేజ్ మెంట్ వీడియో షేర్ చేసిన శోభ శెట్టి

  • Published May 03, 2024 | 6:43 PM Updated Updated May 03, 2024 | 6:43 PM

కార్తీక దీపం సీరియల్ లో దీప , కార్తీక్ లు ఎంత ఫేమస్ అయ్యారో.. వారితో పాటు ఆ సీరియల్ లో విలన్ గా మోనిత పాత్రలో నటించిన శోభ శెట్టి కూడా అంతే ఫేమస్ అయింది. ఇది తాజాగా ఆమె తనకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ను అందరితో షేర్ చేసుకుంది.

కార్తీక దీపం సీరియల్ లో దీప , కార్తీక్ లు ఎంత ఫేమస్ అయ్యారో.. వారితో పాటు ఆ సీరియల్ లో విలన్ గా మోనిత పాత్రలో నటించిన శోభ శెట్టి కూడా అంతే ఫేమస్ అయింది. ఇది తాజాగా ఆమె తనకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ను అందరితో షేర్ చేసుకుంది.

  • Published May 03, 2024 | 6:43 PMUpdated May 03, 2024 | 6:43 PM
Shobha Shetty :ప్రియుడితో పెళ్ళికి రెడీ .. ఎంగేజ్ మెంట్ వీడియో షేర్ చేసిన శోభ శెట్టి

బిగ్ బాస్ పుణ్యమా అని ఆ రియాలిటీ షో కు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బాగా ఫేమస్ అయిపోతున్నారు. కొంతమంది ఫేమస్ అయిన తర్వాతే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తారు. ఆలాంటి వారిలో ఒకరు శోభ శెట్టి. కార్తీక దీపం సీరియల్ తెలుగు వారందరిని ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సీరియల్ లో దీప, కార్తీక్ లతో పాటు.. విలన్ పాత్రలో తన విలక్షణమైన నటనతో అందరిని కట్టిపడేసింది.. శోభ శెట్టి అలియాస్ మోనిత. శోభ శెట్టి అనే పేరుతో కంటే మోనిత అనే పేరుతోనే ఈ అమ్మడు బాగా ఫేమస్. ఇక అదే క్రేజ్ తో గత ఏడాది తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. ఇక ఆ షో లో అందరూ ఆశ్చర్య పోయేలా.. తన ప్రియుడిని పరిచయం చేసింది. ఇప్పుడు తాజాగా ఆమె మరో శుభవార్తను చెప్పింది.

బుల్లి తెర ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయే పేరు మోనిత. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 7 లోను.. తన చలాకీతనం, ఆట పాటలతో, అందంతో అందరిని టీవీ లకు కట్టిపడేసింది ఈ అమ్మడు. ఇక బిగ్ బాస్ గేమ్ షో లో ఉన్నప్పుడే కార్తీక దీపం సీరియల్ లో నటించిన యశ్వంత్ తో డేటింగ్ లో ఉన్నట్లు .. అతనిని అందరికి పరిచయం చేసి ఆశ్చర్యపరిచింది ఈ అమ్మడు. ఇక అప్పటి నుంచి వీళ్లిద్దరి గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. వీరిద్దరూ కలిసి కార్తిక దీపం సీరియల్ చేస్తున్నప్పుడే.. ప్రేమలో పడ్డారట. ఇక ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లోను వీరిద్దరూ కలిసి నటించారు. బిగ్ బాస్ అయిపోయిన వెంటనే పెళ్ళికి సిద్ధం అంటూ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వీరికి సంబంధించిన ఫోటోలు కూడా చూస్తూనే ఉన్నాము. అలాగే జనవరిలో వీరిద్దరికి సంబంధించిన ఫోటోలను చూసి.. వీరికి నిశ్చితార్థం అయిందని అనుకున్నారు అంతా.

కానీ, అప్పుడు జరిగింది పెళ్లి చూపులాట. తాజాగా వీరికి సంబంధించిన మరికొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టాయి. నెటిజన్లు ఏంటా అని ఆరా తీయగా.. వారి ఇరువురికి నిశ్చితార్థం అయిందంటూ .. యూ ట్యూబ్ లో శోభ శెట్టి ఓ వీడియో షేర్ చేసింది. దీనితో ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సెలెబ్రిటీలకు సంబంధించిన ఏ విషయమైనా నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయన్న సంగతి తెలిసిందే కదా. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి .

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş