iDreamPost

కాబోయే భర్తకు గిఫ్ట్ గా ఖరీదైన కారు ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ! ధరెంతంటే?

ఓ బిగ్ బాస్ బ్యూటీ తనకు కాబోయే భర్తకు పుట్టినరోజు కానుకగా ఏకంగా ఓ కాస్ట్లీ కారును గిఫ్ట్ గా ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఆ బ్యూటీ ఎవరు? ఆ కారు ధరెంత? తెలుసుకుందాం పదండి.

ఓ బిగ్ బాస్ బ్యూటీ తనకు కాబోయే భర్తకు పుట్టినరోజు కానుకగా ఏకంగా ఓ కాస్ట్లీ కారును గిఫ్ట్ గా ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఆ బ్యూటీ ఎవరు? ఆ కారు ధరెంత? తెలుసుకుందాం పదండి.

కాబోయే భర్తకు గిఫ్ట్ గా ఖరీదైన కారు ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ! ధరెంతంటే?

సాధారణంగా తమకు కాబోయే భార్యా లేదా భర్తకు పెళ్లికి ముందే సర్ప్రైజ్ గిఫ్ట్ లు ఇస్తూ ఉంటారు కొందరు. వారి పుట్టినరోజుకో లేదా వేరే అకేషన్ కో ప్రత్యేక బహుమతులను ప్లాన్ చేస్తుంటారు. తాజాగా ఓ బిగ్ బాస్ బ్యూటీ తనకు కాబోయే భర్తకు పుట్టినరోజు కానుకగా ఏకంగా ఓ కాస్ట్లీ కారును గిఫ్ట్ గా ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా..  ఇటీవలే ఈ జోడీ ఎంగేజ్ మెంట్ కూడా చేసింది. మరి కాబోయే భర్తకు కారు బహుమతిగా ఇచ్చిన ఆ బిగ్ బాస్ బ్యూటీ ఎవరు? ఆ కారు ధరెంతో తెలుసుకుందాం పదండి.

బిగ్ బాస్ సీజన్ 7 ద్వారా గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్స్ లో శోభాశెట్టి ఒకరు. ఈ సీజన్ లో ఎలాంటి రీజన్స్ పెద్దగా లేకున్నాగానీ.. వ్యతిరేకతను ఎదుర్కొంది ఈ బ్యూటీ. ఇక బిగ్ బాస్ లోకి రాకముందే.. శోభాశెట్టి ‘కార్తీక దీపం’ సీరియల్ ద్వారా అందరికి పరిచయమే. ఈ సీరియల్ లో మోనిత అనే విలన్ పాత్రలో శోభా ఆకట్టుకుంది. ఒకటి, రెండు మూవీల్లో కూడా నటించింది. ఇదిలా ఉండగా.. కార్తీక దీపం సీరియల్లో నటించిన తన సహనటుడు యశ్వంత్ తో రీసెంట్ గా ఎంగేజ్ మెంట్ చేసుంది శోభా. ఈ సీరియల్ లో నటిస్తున్నప్పుడే వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం.. ప్రేమకు దారితీసింది. దాంతో ఇద్దరు పెళ్లికి సిద్దమైయ్యారు. నిశ్చితార్థంతో పాటుగా ఇటీవలే కొత్త ఇంట్లోకి కూడా ఆమె అడుగుపెట్టింది.

ఇదంతా కాసేపు పక్కనపెడితే.. తాజాగా తనకు కాబోయే భర్త యశ్వంత్ కు పుట్టినరోజు కానుకగా ఖరీదైన కారును గిప్ట్ గా ఇచ్చింది. బీస్ట్ ఎక్స్ యూవీ 700 కారును కొనుగోలు చేసి.. అతడికి బహుమతిగా ఇచ్చిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మార్కెట్ లో ఈ కారు ధర రూ. 15 లక్షల నుంచి 20 లక్షల మధ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. తనకు కాబోయే భర్త పుట్టినరోజుకే ఈ రేంజ్ గిఫ్ట్ ఇచ్చిందంటే.. ఇక పెళ్లికి ఏ రేంజ్ లో బహుమతి ఇస్తుందో అని అభిమానులు అనుకుంటున్నారు. మరి శోభాశెట్టి తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి కారు గిఫ్ట్ గా ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by gαуαм єѕнωαя (@dir_actorr)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి