iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్-7లోకి అగ్గిపెట్టె మచ్చా? వైల్డ్ కార్డు ఎంట్రీలో ట్విస్ట్!

  • Published Sep 25, 2023 | 1:59 PM Updated Updated Sep 25, 2023 | 1:59 PM
  • Published Sep 25, 2023 | 1:59 PMUpdated Sep 25, 2023 | 1:59 PM
బిగ్ బాస్-7లోకి అగ్గిపెట్టె మచ్చా? వైల్డ్ కార్డు ఎంట్రీలో ట్విస్ట్!

గత సీజన్స్ తో పోలిస్తే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కు క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. ఉల్టా పుల్టా పేరిట ప్రేక్షకులకు షాకులు, ఝలకులు ఇస్తూ దూసుకుపోతోంది. నిజానికి ఈ సీజన్ లో మీరు ఇప్పడు దాకా చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే అని చెబుతున్నారు. గేమ్ అబీ బాకీ హే అంటూ లీకులు వస్తున్నాయి. అదేంటంటే ఈ సీజన్ కు గ్రాంఢ్ లాంచ్ 2.0 ప్లాన్ లో ఉందని చెబుతున్నారు. 5 వారాల తర్వాత ఇంకొంతమంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వస్తారని చెబుతున్నారు. అంతేకాకుండా వైల్డ్ కార్డు ఎంట్రీల విషయంలో కూడా నెట్టింట బాగా ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే వైల్డ్ కార్డు ఎంట్రీలో ఒక పేరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

బిగ్ బాస్ హౌస్ లో ఈ సీజన్ కచ్చితంగా వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయని బలంగా చెబుతున్నారు. అందుకు గట్టి కారణం కూడా ఉంది. ఎందుకంటే హౌస్ లో ఉన్న వారితో గేమ్ 15 వారాలు కొనసాగించడం కష్టం కాబట్టి. కొత్త కంటెస్టెంట్స్ హౌస్ లోకి తప్పకుండా వస్తారనే చెప్పాలి. అయితే ఎలా వస్తారు అనేది ప్రశ్న. వైల్డ్ కార్డు రూపంలోనా? గ్రాండ్ లాంఛ్ 2.0 రూపంలోనా? ఎలా వచ్చినా ఆట మరో స్థాయికి చేరుతుంది. పైగా హౌస్ లో గొడవలు జరిగే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. గేమ్ కాస్త ఫ్రెష్ గా స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే నెట్టింట వైల్డ్ కార్డు రూపంలో హౌస్ లోకి వచ్చేది వీళ్లే అంటూ కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. అంబటి అర్జున్, పూజా మూర్తి, జబర్దస్త్ నరేశ్, బుల్లెట్ భాస్కర్, పాపులర్ హీరోయిన్ అంటూ చాలానే పేర్లు చెబుతున్నారు.

వారిలో ఎవరు హౌస్ లోకి వస్తారు? ఎవరు రారు అని అడిగితే.. ఎవరి పేరుని కన్ఫామ్ చేసి చెప్పలేం. ఇక్కడే ఒక పేరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అదేంటంటే.. అగ్గిపెట్టె మచ్చాను వైల్డ్ కార్డు ఎంట్రీ రూపంలో తీసుకొస్తున్నారు అంటూ చెబుతున్నారు. ఈ మాట విన్నాక అందరూ కచ్చితంగా షాక్ అవుతారు. మనోడిని వైల్డ్ కార్డు రూపంలో బిగ్ బాస్ కి తీసుకొస్తారా?  అంటా ప్రశ్నిస్తున్నారు. అయితే షోలలో పాల్గొనడం అగ్గిపెట్టె మచ్చాకు కొత్తేం కాదు. కాకపోతే బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో మనోడు పాల్గొంటాడు అంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు. అయితే సోషల్ మీడియా, మీమర్స్ ప్రపంచంలో అగ్గిపెట్ట మచ్చాకు మంచి ఫాలోయింగ్ ఉంది. షోకి సంబంధించి ఎక్కడన్నా బజ్ తగ్గినా.. గేమ్ కి సంబంధించి సోషల్ మీడియాలో మరింత హైప్ క్రియేట్ చేయాలని భావించినా.. అగ్గిపెట్టె మచ్చాను వైల్డ్ కార్డు రూపంలో హౌస్ లోకి పంపుతారని చెబుతున్నారు.

అగ్గిపెట్టె మచ్చా మానసిక స్థితిని బట్టి చూస్తే మనోడు హౌస్ లోఉండలేడు. కానీ, అవసరం అనుకుంటే ఒక వారం రోజులైనా మచ్చాని హౌస్ లోకి పంపాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఎక్కడా అధికారిక, పక్కా సమాచారం అయితే లేదు. ప్రస్తుతానికి ఎంత బలంగా చెప్పినా ఇవి పుకార్లు మాత్రమే. బిగ్ బాస్ కి సంబంధించి ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో.. ఎవరూ చెప్పలేరు. కాబట్టి అగ్గిపెట్టె మచ్చా హౌస్ లోకి వచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. కానీ, దాదాపు ఇది పుకారుగానే పరిగణించాల్సి ఉంటుంది. హౌస్ లోకి వస్తే మాత్రం మీమర్స్ అంతా బిగ్ బాస్ కి ట్యూన్ అయిపోతారు. మరి.. అగ్గిపెట్టె మచ్చా బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: రతికకి బిగ్ బాస్ సపోర్ట్! విన్నర్ ని కూడా చేస్తారా స్వామి?

ఇది కూడా చదవండి: ఆట లేని ఆట సందీప్! సాక్ష్యాలతో పరువు తీసిన నాగార్జున!

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom