iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: రతికకి బిగ్ బాస్ సపోర్ట్! విన్నర్ ని కూడా చేస్తారా స్వామి?

Bigg Boss 7 Telugu: రతికకి బిగ్ బాస్ సపోర్ట్! విన్నర్ ని కూడా చేస్తారా స్వామి?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఒక పేరు మాత్రం బాగా హైలెట్ అవుతూ ఉంటోంది. ఆమె మరెవరో కాదు రతికా రోజ్. హౌస్ లో గేమ్ సంగతి పక్కన పెడితే ఎక్కువ కాంట్రవర్సీలతోనే రతికా ఆట సాగుతోంది. లవ్ ట్రాక్, పులిహోర అనే పదాలు రతికా రోజ్ విషయంలో చాలా బాగా వైరల్ అయ్యాయి. ఇప్పటికీ రతికా రోజ్ పేరు చెప్పగానే పల్లవి ప్రశాంత్ కి అన్యాయం చేశావ్ అంటూ మాట్లాడుతున్నారు. అంతేకాకుండా.. రతికాకు రాధిక అనే పేరు కూడా పెట్టారు. మరీ ఇంట్రస్టింగ్ ఏంటంటే.. హౌస్ లో కూడా రతికా పేరును రాధికా అని పిలుస్తున్నారు. ఆమె పేరు విషయంలో కన్ఫ్యూజ్ అయ్యారా? ఆమె ప్రవర్తనను బట్టి ఆ పేరు పెట్టారా? అనే అనుమానాలు వినిపిస్తున్నాయి.

ఈ ఒక్కటే కాదు.. రతికా రోజ్ విషయంలో చాలా అంశాలు వైరల్ అవుతూనే ఉంటున్నాయి. వాటిలో ఒక్కటి మాత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అదేంటంటే.. రతికా రోజ్ కు బిగ్ బాస్ సపోర్ట్ చేస్తున్నారు. అందుకే ఆమె విషయంలో ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ రావడం లేదు అని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి బిగ్ బాస్ హౌస్ లో రతికా రోజ్ గేమ్ ఆడటం, పనులు చేయడంలాంటివి ఎవరూ చూసుండరు. అదే విషయాన్ని కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో చెబుతూ ఉన్నారు. వాటికి అదనంగా రతికా రోజ్ కు హౌస్ లో గొడవలు పెడుతోంది అనే ట్యాగ్ కూడా వచ్చింది. ప్రిన్స్ యావర్ సీరియస్ అయిన సమయంలో ఆట సందీప్ ఓదారుస్తూ ఉన్నాడు. అలాంటి టైమ్ లో రతికా రోజ్ వెళ్లి ప్రియాంక- శోభా డెసిషన్ కరెక్ట్ కాదు అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటుంది. అది విన్న సందీప్ నువ్వు ఎందుకు అంతా అయిపోయిన సమయంలో వచ్చి పుల్లలు పెడతావు అంటూ సీరియస్ అవుతాడు.

హౌస్ లో రతికా కంటెంట్ కోసమే అంతా చేస్తూ ఉంటుందని గతంలో చాలా మంది కంటెస్టెంట్స్ కామెంట్ చేశారు. ముఖ్యంగా ధామినీ, శుభశ్రీ, షకీలా.. రతికా ఏం చేసినా కంటెంట్ కోసమే చేస్తుందని చెప్పారు. అలాగే ధామినీ ఎలిమినేట్ అయి వెళ్తూ.. రతికాకి ఒక సజీషన్ ఇచ్చింది. ఏదో చిన్న పాయింట్ పట్టుకుని డిస్కషన్ చేస్తుంటావు. కాస్త పూర్తిగా విని మాట్లాడు. నీకు అనిపించింది ఒక పాయింట్ పట్టుకుని సాగదీయద్దు అంటూ చెప్పింది. పైగా హౌస్ లోఎందుకు డల్ అవుతున్నావ్ అంటే.. నాకు నా మాజీ ప్రియుడు గుర్తొస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తుంది. నిజానికి హౌస్ లో ఎంతో హుషారుగా ఉంటుంది. పని విషయంలోనే కాస్త డల్ అవుతుంది. ఎందుకు అలా ఉన్నావ్ అంటే నా X గుర్తొచ్చాడు అంటుంది.

బిగ్ బాస్ విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ రతికా రోజ్ మాజీ ప్రియుడు అని ఎప్పటి నుంచో టాక్ ఉంది. అలాగే ఆ టాక్ కి మద్దతుగా రాహుల్ ఇటీవల రెండు పోస్టులు కూడా పెట్టాడు. టాలెంట్, పేరుని వినియోగించుకుంటున్నారు అంటూ కామెంట్ చేశాడు. డైరెక్ట్ గా రతికా రోజ్ ని ప్రశ్నిస్తున్నట్లుగా అనిపించింది. ఇక్కడ హోస్ట్ నాగార్జున కూడా ఆమె లవ్ బ్రేకప్ గురించి పదే పదే గుర్తు చేయడం, మాజీ ప్రియుడి ప్రస్తావన తీసుకురావడంపై కూడా నెట్టింట ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎందుకో బిగ్ బాస్, హోస్ట్ నాగార్జున రతికా రోజ్ కు సపోర్ట్ చేస్తున్నట్లు అనిపిస్తోంది అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హౌస్ మొత్తం నెగిటివ్ గా మాట్లాడినా.. నాగార్జున మాత్రం కావాలనే రతికా రోజ్ గురించి నెగిటివ్ కామెంట్స్ చేయట్లేదని చెబుతున్నారు.

రతికా రోజ్ ని వీలైనంత పాజిటివ్ గా చూపించేందుకే తాపత్రయ పడుతున్నారు అంటున్నారు. నిజానికి రతికా రోజ్ కు నెట్టింట మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె ఒక భగ్న ప్రేమికురాలు అనే సింపథీ కార్డుతో హౌస్ లో ఎంట్రీ చేయించారు. ఇప్పుడు బిగ్ బాస్, నాగార్జున సపోర్ట్ కూడా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమెకు సపోర్ట్ చేయాలని ముందే ఫిక్స్ అయ్యారు అనే విమర్శలు కూడా వస్తున్నాయి. అదే నిజమైతే రతికాకి ఉన్న ఫాలోయింగ్ కి ఆమె గేమ్ కరెక్ట్ గా ఆడితే.. ఈ నెగిటివిటీ కాస్తా పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆమె టైటిల్ విన్నర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి.. రతికా రోజ్ కు బిగ్ బాస్ సపోర్ట్ ఉంది అని వస్తున్న కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş