Shivaji Double Game In Bigg Boss 7 Telugu: హౌస్ లో శివాజీది మైండ్ గేమ్ కాదు.. డబుల్ గేమ్!

హౌస్ లో శివాజీది మైండ్ గేమ్ కాదు.. డబుల్ గేమ్!

బిగ్ బాస్ హౌస్ లో గత రెండు వారాలుగా శివాజీ చేతికి కట్టుతోనే ఉన్నాడు. అలాగే గేమ్ కూడా ఆడుతున్నాడు. తాను కూడా హౌస్ లో ఉండలేకపోతున్నాను అంటూ కామెంట్స్ చేస్తున్నాడు. ఇలాంటి నేపథ్యంలో అతను డబుల్ గేమ్ ఆడుతున్నాడు అనే విమర్శలు కూడా పెరిగాయి.

బిగ్ బాస్ హౌస్ లో గత రెండు వారాలుగా శివాజీ చేతికి కట్టుతోనే ఉన్నాడు. అలాగే గేమ్ కూడా ఆడుతున్నాడు. తాను కూడా హౌస్ లో ఉండలేకపోతున్నాను అంటూ కామెంట్స్ చేస్తున్నాడు. ఇలాంటి నేపథ్యంలో అతను డబుల్ గేమ్ ఆడుతున్నాడు అనే విమర్శలు కూడా పెరిగాయి.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఈ వారం నామినేషన్స్ పర్వం రణరంగా సాగింది. అయితే ఈ వారం మొత్తం 8 మంది నామినేషన్స్ లోకి వచ్చారు. శోభాశెట్టి, భోలే షావలి, శివాజీ, అశ్వినీ శ్రీ, ప్రియాంకా జైన్, అమర్ దీప్, సందీప్, గౌతమ్ కృష్ణ ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటు ఇప్పటి నుంచే ఊహాగానాలు మొదలు పెట్టేశారు. ఈ వీక్ అయినా మగవాళ్లు ఎలిమినేట్ అవుతారా? అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ నామినేషన్స్ తర్వాత హౌస్ లో శివాజీ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. వాటిని బట్టి శివాజీది డబుల్ గేమ్ అని మరోసారి అర్థమైపోయింది అంటున్నారు.

హౌస్ లో చేతికి కట్టు వేసుకుని శివాజీ దాదాపుగా రెండు వారాలుగా హౌస్ లో ఉంటున్నాడు. అక్కడికీ అర్జున్ లాంటి ఇంటి సభ్యులు నేరుగా నాగార్జునానే అడిగేశారు. అలా ఎన్ని రోజులు ఇలాగే ఉంటారు. గేమ్ ఆడట్లేదు పనులు చేయలేకపోతున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఉంటారు అనే ప్రశ్నను సూటిగానే అడిగేశాడు. అందుకు నాగార్జున కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి అడిగినప్పుడు కూడా శివాజీ ఇంటికి వెళ్లిపోతాను అన్నాడు. హౌస్ లో కూడా మొదటి వారం నుంచి శివాజీ ఈ ఇంటికిపోతా అనే పాట పాడుతూనే ఉన్నాడు. చేయి నొప్పి కూడా బాగా ఉంది. ఉండలేకపోతున్నాను ఇలా ఈ బాధతో అంటూ చెప్పుకొచ్చాడు.

ఎవరూ లేనప్పుడు ఏడుస్తున్నాను అని చెప్పారు. మరి.. అంత ఇబ్బందిగా ఉంటే శివాజీ బయటకు వెళ్లిపోవచ్చు. గతంలో కూడా ఆరోగ్య కారణాల రీత్యా హౌస్ నుంచి వెళ్లిన వాళ్లు ఉన్నారు. కానీ, వెళ్తాను అనే మాటను కచ్చితంగా చెప్పడం లేదు. నాగార్జున ఉండు అనగానే సరే అన్నాడు. మళ్లీ హౌస్ నుంచి వెళ్లిపోతా అంటూ కామెంట్ చేశాడు. నామినేషన్స్ పూర్తైన తర్వాత రతికా, యావర్ తో మాట్లాడుతూ.. ఈవారం నామినేషన్స్ కరెక్ట్ గా జరిగాయి. చూస్తాను ఏం చేస్తారో. లేదంటే ఎవరో ఒకడిని కొట్టి వచ్చే వారం నేనే వెళ్లిపోతాను అన్నాడు. అంటే సందర్భం ఏదైనా కావచ్చు.. శివాజీకి మాత్రం నోటి నుంచి నేను పోతాను అనే మాటే వస్తోంది. కానీ, హౌస్ లో మాత్రం ఉండాల్సిందే అంటూ ప్రవర్తిస్తున్నారు.

గతవారం కెప్టెన్సీ కంటెండర్ గా తప్పించారు అంటూ గోల చేశాడు. నేను ఆడలేకపోయినా కూడా ఆడిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. మరోవైపు ఆరోగ్యం బాగున్నప్పుడు మాత్రం పల్లవి ప్రశాంత్ ని కెప్టెన్ చేయాలి, యావర్ ని కెప్టెన్ చేయాలి అని ఆడాడు. కాఫీ ఇవ్వకపోతే నేను ఇంటికోపోతా అంటాడు, ఎవరన్నా ఒక మాట అనగానే.. వీళ్లతో నేను ఎందుకు అనిపించుకోవాలి నేను పోతా అంటాడు. ఇంక చేతికి దెబ్బ తగిలిన తర్వాత ఈ మాట వినిపిస్తూనే ఉంది. ఇదంతా చూసిన తర్వాత కొందరు ప్రేక్షకులు కూడా శివాజీ చెప్పే మాటలకు, ఆడే ఆటకు అసలు సంబంధం లేదంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి కారణాలు చూపిస్తూ శివాజీ డబుల్ గేమ్ ఆడుతున్నాడు అంటూ గట్టిగానే కామెంట్ చేస్తున్నారు. మరి.. శివాజీ హౌస్ లో డబుల్ గేమ్ ఆడుతున్నాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments