iDreamPost
android-app
ios-app

AP Education System: APలో కార్పొరేట్ స్కూల్స్ కి పోటీగా.. సర్కార్ బడులు!

నాడు–నేడు ద్వారా కనీవినీ ఎరుగని రీతిలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. సర్కార్ బడుల్లో చదువుకున్న పూర్వవిద్యార్థులు తమ పాఠశాల చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలా ప్రభుత్వ స్కూళ్లపై సీఎం జగన్ తనదైన మార్క్ ను చూపించారు.

నాడు–నేడు ద్వారా కనీవినీ ఎరుగని రీతిలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. సర్కార్ బడుల్లో చదువుకున్న పూర్వవిద్యార్థులు తమ పాఠశాల చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలా ప్రభుత్వ స్కూళ్లపై సీఎం జగన్ తనదైన మార్క్ ను చూపించారు.

AP Education System: APలో కార్పొరేట్ స్కూల్స్ కి పోటీగా.. సర్కార్ బడులు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన 58 నెలల పాలనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. గత పాలకులు చేయని, వారి ఆలోచనకే రానీ ఎన్నో పథకాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టారు. విద్యా రంగంలో తనదైన మార్క్ ను చూపించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. పేద పిల్లలకు అందించే ఆస్తి.. మంచి విద్యే అని బలంగా నమ్మి.. విద్యారంగలో అనేక సంస్కరణలు ప్రవేశ పెట్టారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలు కనీవినీ ఎరుగనీ రీతిలో మారిపోయాయి. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా సర్కార్ బడులను రూపొందించారు. పాఠశాలలో చదువుకున్న పూర్వవిద్యార్థులు పాఠశాలను చూసి తాము చదువుకున్న పాఠశాల ఇదేనా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి విద్యా విప్లవం తీసుకొచ్చారు. నాడు-నేడు పథకం కిందంకి 56,703 ప్రభుత్వ పాఠశాలను తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఫేజ్ -1లో రూ.3,669 కోట్లతో 15,715 స్కూళ్లలలో సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆ పాఠశాల్లో డిజిటల్ క్లాస్ లు అందుబాటులోకి వచ్చాయి. అలానే ఫేజ్-2లో రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలకు మౌలిక వసతలు కల్పించేదుకు చర్యలు చేపట్టారు. ఈ ఐదేళ్ల కాలంలో ఏపీలోని పాఠశాలల్లో ఎంతో మార్పు వచ్చింది. కార్పొరేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ ను సీఎం జగన్ మోహన్ రెడ్డి తయారు చేశారు.

సాధారణంగా ఎక్కడైనా ప్రభుత్వ పాఠశాలలు అంటే చిన్న చూపు ఉండేది. ఏపీలో అలాంటి పరిస్థితులను సీఎం జగన్ పూర్తిగా మార్చేశారు. నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలను మార్చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తరువాత ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల బంగారు భవిష్యత్ కి బాటలు వేసేందుకు నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతేకాక ఈ ప్రోగ్రామ్ కి భారీగా నిధులను కేటాయించి.. నేడు ప్రైవేటు స్కూల్స్ సర్కారు బడులు ఏమాత్రం తీసిపోని విధంగా తయారు చేశారు. పాఠశాలల్లో దశల వారిగా మౌలిక సదుపాయలను కల్పిస్తూ వచ్చారు. నిరంతర నీటి సరఫరాతో పాటు టాయిలెట్లు, శుద్ధి చేసిన తాగునీరు సరఫరా, పెద్ద చిన్న మరమ్మతులు, క్లాసుల్లో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు,డబుల్ డెస్క్ ఫర్నిచర్ లు ఏర్పాటు చేశారు.

అలానే పుష్టికరమైన మధ్యాహ్నభోజనం తదితర అన్ని సౌకర్యాలను కల్పించారు. లక్షల రూపాయల ఫీజు కట్టే ప్రైవేటు స్కూళ్లలో కూడా లేని ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్‌ బోర్డ్స్‌ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన జరుగుతోంది. అత్యాధునిక పద్ధతుల ద్వారా జ్ఞానాన్ని అందించే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక మార్పులు ప్రశంసనీయని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి..విద్యారంగంపై, ప్రభుత్వ పాఠశాలపై సీఎం జగన్ తీసుకున్న చర్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.