Arjun Suravaram
Machilipatnam Greenfield Port: కృష్ణా జిల్లా వాసుల ఏళ్ల కల త్వరలో నేరవేరబోతుంది. మచిలీపట్నంలోని గ్రీన్ ఫీల్డ్ పోర్టును పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సముద్రపు అలలతో పోటీ పడి మరి.. ఈ పోర్టు పనులు సాగుతోన్నాయి.
Machilipatnam Greenfield Port: కృష్ణా జిల్లా వాసుల ఏళ్ల కల త్వరలో నేరవేరబోతుంది. మచిలీపట్నంలోని గ్రీన్ ఫీల్డ్ పోర్టును పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సముద్రపు అలలతో పోటీ పడి మరి.. ఈ పోర్టు పనులు సాగుతోన్నాయి.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ ధ్యేయంగా పాలన సాగిస్తున్నారు. అంతేకాక సంక్షేమం, అభివృద్ధి రెండిటిని జొడెద్దుల్లా పరుగులు పెట్టిస్తున్నారు. విద్యా, వైద్య రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారు. సీఎం జగన్ అనేక కొత్త పరిశ్రమలను ఆహ్వానించి యువతకు ఉపాధి అందిస్తున్నారు. సీఎం జగన్ తలపెట్టిన పలు ప్రాజెక్టల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాంటి వాటిల్లో మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టు ఒకటి. బందరు వాసులు ఎన్నో ఏళ్లుగా కన్న కళ్లను సీఎం జగన్ నిరవేరుస్తున్నారు. ఈ గ్రీన్ ఫీల్డ్ పోర్టు పనులు సముద్రపు అలతో పోటీ పడుతూ శరవేగంగా సాగుతున్నాయి. మరి.. ఈ బందర్ గ్రీన్ ఫీల్డ్ పోర్టు గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఏపీని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే లక్ష్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన సాగుతోంది. అలానే రాష్ట్రంలోని యువత, ప్రజలకు ఉపాధి కల్పించే దిశగా అనేక అభివృద్ధి పనులను సీఎం జగన్ ప్రారంభించారు. అలాంటి వాటిల్లో ఒకటే మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టు. ఇది కృష్ణా జిల్లా వాసుల చిరకాల కోరిక. ఆ చిరకాల వాంఛ నిరవేరే దిశగా పోర్టు పనులు శరవేగంగా జరుగుతోన్నాయి. భారీ పెట్టుబడితో ఈ బందర్ పోర్టు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణం పూర్తి అయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి లభించనుంది. సుమారు రూ.11,464 కోట్ల భారీ పెట్టుబడితో ఈ పోర్టు నిర్మాణానికి సీఎం జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. మొత్తం 16 బెర్తులతో, 115.97 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఈ పోర్టును నిర్మించనున్నారు.
దేశ తూర్పు తీరంలో దక్షిణాసియా దేశాలకు అత్యంత దగ్గరగా మచిలీపట్నం పోర్డు ఉంది. దీంతో ఇతర దేశాలతో వ్యాపారాలు చేసేందుకు ఈ పోర్టు ఎంతో అనుకూలంగా ఉంది. అలా ఏపీలోనే మచిలీపట్నం పోర్టు ఎంతో కీలకమైనది. అందుకే ఈ పోర్టుకు నిర్మాణానికి దివగంత నేత, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి 2008 ఏప్రిల్ 23న శంకుస్థాపన చేశారు. ఆయన మరణం తరువాత వచ్చిన వారు ఈ పోర్టు గురించి పట్టించుకోలేదు. తిరిగి 2019లో సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పోర్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. భారీ పెట్టుబడితో సీఎం జగన్ ఈ పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించారు. వీలైన త్వరగా ఈ పోర్టు నిర్మాణం పూర్తి చేసి.. కృష్ణ జిల్లా వాసులకు అందించాలని సీఎం జగన్ సంకల్పించారు. ఆ దిశగానే పోర్టు పనులు వేగంగా జరుగుతోన్నాయి.
ఇప్పటికే ఈ పోర్టుకు జాతీయ రహదారితో అనుసంధానిస్తూ 6.5 కి.మీ నాలుగు లైన్ల రహదారి, 7 కిలోమీటర్ల మేరు రైల్వే లైన్ నిర్మాణాలకు అనుమతులు కూడా లభించాయి. తొలిదశలో 5,156కోట్ల భారీ పెట్టుబడితో ఈ పోర్టు నిర్మాణం జరుగుతోంది. తొలి దశలో 35 మిలియన్ టన్నుల సామర్థ్యంతో పోర్టును నిర్మిస్తోన్నారు. తొలిదశలో నాలుగు బెర్తులను నిర్మించనున్నారు. ఇందులో రెండు సాధారణ బెర్తులుగా కాగా మరొకటి మల్టీ పర్సపస్ బెర్తు ఉండనుంది. 2024 డిసెంబర్ నాటికి ఈ కార్యకలాపాలను ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పోర్టులోకి ఓడలు వచ్చేందుకు వీలుగా 14.2మీటర్ల మేర సముద్రంలో రహదారిని ఏర్పాటు చేస్తున్నారు.
ఈ పోర్టు ద్వారా తెలంగాణతో పాటు మన రాష్ట్రంలోని ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలు ప్రయోజనం పొందనున్నారు. ఎరువులు, బొగ్గు, వంట నూనెలు, కంటైనర్ల దిగుమతులకు ఈ పోర్టు అనువుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్, సిమెంట్ క్లింకర్, గ్రానైట్ బ్లాక్స్, ముడి ఇనుము ఎగుమతికి ఈ పోర్టు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రాజెక్టను పూర్తి చేసేందుకు సంకల్పించారు. ఆ దిశగానే ఈ పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తంగా అతి త్వరలో కృష్ణా జిల్లా వాసుల సాకారం కానుంది. ఈ విధంగానే ఏపీలోని ప్రజల అభివృద్ధి కోసం సీఎం జగన్ నిరంతరం కృషి చేస్తున్నారు. అందుకు నిదర్శనమే ఇలాంటి ప్రాజెక్టల నిర్మాణ పనులు జరుగుతున్న తీరు.