Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తుంది. పర్యాటకరంగం అభివృద్ధికి కూడా ఎంతో కృషి చేశారు. ఈ క్రమంలోనే ఏపీ వాసులకు అదిరిపోయే శుభవార్త ఒకటి బయటకు వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తుంది. పర్యాటకరంగం అభివృద్ధికి కూడా ఎంతో కృషి చేశారు. ఈ క్రమంలోనే ఏపీ వాసులకు అదిరిపోయే శుభవార్త ఒకటి బయటకు వచ్చింది.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమం, అభివృద్ధి రెండిటిని జొడెద్దుల్లా పరిగెట్టిస్తున్నారు. ఇదే సమయంలో పర్యాటకరంగం అభివృద్ధికి కూడా ఎంతో కృషి చేశారు. రిషికొండ ప్రాంతంలో పర్యాటక భవనాలను ఏర్పాటు చేశారు. అలానే సముద్ర తీరంలో ఉండే వివిధ ప్రాంతాల్లో పర్యటకంగా అభివృద్ధి పనులు చేశారు. తాజాగా ఏపీ వాసులకు ఓ శుభవార్త వచ్చింది. త్వరలోనే సముద్రంపై ప్రయాణించే విమానాల సేవలు అందుబాటులోకి తీసుకురానుంది.
ఏపీలో త్వరలోనే సీ ప్లేన్ సేవలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అమెరికా, మాల్దీవు వంటి దేశాల్లో ఈ సీ ప్లేన్ సర్వీసులు నడుస్తున్నాయి. ఇక వాటి తరహాలో ఆంధ్రప్రదేశ్ లో కూడా సీ ప్లేన్‌లను తీసుకువచ్చేందుకు ఏపీ టూరిజం డెవలప్మెంట్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే నీటిపై విమానంలో విహరించవచ్చు. అలానే గాల్లోనూ ఎగురుతూ ఎంజాయ్ చేయవచ్చు. ఏపీలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు సీ ప్లేన్ సేవలు తీసుకురావాలని ఏపీ టూరిజమ్ డెవలప్మెంట్ అథారిటి ఆలోచన చేస్తోంది. ప్రధాన పర్యాటక ప్రాంతాల మధ్య ఈ సీ ప్లేన్ సేలను వినియోగంలోకి తీసుకురావాలని పర్యాటకాభివృద్ధి సంస్థ ఆలోచనలో ఉంది. మొదటి దశలో భాగంగా, విజయవాడ-కాకినాడ, రుషికొండ-కాకినాడ, లంబసింగ్-రుషికొండ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.
అలానే కోనసీమ-రిషికొండ, విశాఖపట్నం-కోనసీమ మధ్య ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాంతాలను 40 నిమిషాల్లో కవర్ చేసేలా సీ ప్లేన్ సేవలను అందుబాటులోకి తేవాలని ప్లాన్లు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీ ప్లేన్ సేవలను అందించేందుకు ఇప్పటికే టెండర్లకు ప్రభుత్వం ఆహ్వానించింది. పీపీ విధానంలో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. మొత్తం ఆరు ప్రాంతాల్లో నడిపేందుకు రెండు ఫ్లోటింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేయాలని టూరిజం డిపార్ట్మెంట్ అధికారులు ప్రతిపాదనలు చేశారు. అధికారులు అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే ఏపీ వాసులకు సీ ప్లేన్ సేవలను వినియోగించుకోవచ్చు. మరి.. త్వరలో సీ ప్లేన్ సేవలకు అందుబాటులోకి రానుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.