iDreamPost
android-app
ios-app

జన్ మత్ లేటెస్ట్ సర్వే.. మరోసారి ఏపీలో అధికారంలో వైఎస్సార్ సీపీ! ఎన్ని స్థానాలంటే..

  • Published Feb 01, 2024 | 5:48 PM Updated Updated Mar 13, 2024 | 5:59 PM

YS Jagan: రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మరోసారి వైఎస్సార్ సీపీ విజయం సాధిస్తుందని స్పష్టమైంది. ఇప్పటికే అనేక సర్వేలు వైఎస్సార్ సీపీకే పట్టం కట్టాయి. తాజాగా జన్ మత్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలోను అదే స్పష్టమైంది.

YS Jagan: రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మరోసారి వైఎస్సార్ సీపీ విజయం సాధిస్తుందని స్పష్టమైంది. ఇప్పటికే అనేక సర్వేలు వైఎస్సార్ సీపీకే పట్టం కట్టాయి. తాజాగా జన్ మత్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలోను అదే స్పష్టమైంది.

  • Published Feb 01, 2024 | 5:48 PMUpdated Mar 13, 2024 | 5:59 PM
జన్ మత్ లేటెస్ట్ సర్వే.. మరోసారి  ఏపీలో అధికారంలో వైఎస్సార్ సీపీ! ఎన్ని స్థానాలంటే..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి  ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టి ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ముఖ్యంగా విద్యా, వైద్యరంగంలో తనదైన మార్క్ ను చూపించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం రెండిటిని జోడెద్దుల పరిగెత్తిస్తున్నారు. సీఎం జగన్ పరిపాలన ఇలా సాగుతుంటే.. మరోవైపు సర్వేల హడావుడి మొదలైంది. ఇప్పటికే పలు సర్వే సంస్థలు నిర్వహించిన ప్రీపోల్ సర్వేల్లో ప్రజలు వైఎస్సార్ సీపీకే అధికారం ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. తాజాగా జన్ మత్ పోల్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేల్లో మరోసారి సీఎంగా జగన్ అవుతారని స్పష్టం చేసింది. మరి.. ఆ సంస్థ చేసిన సర్వేలో ఏ పార్టీ ఎన్ని సీట్లు వచ్చాయో ఇప్పుడు చూద్దాం…

ఏపీలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది అన్ని ప్రధాన పార్టీలు స్పీడు పెంచాయి. అధికార వైసీపీ..175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తూ అధికార పార్టీ  దూసుకెళ్తోంది. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేనాలు అధికారం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించింది లేదు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఏపీకి సంబంధించి ఓ సర్వే వివరాలు బయటకు వచ్చాయి. అందులో భారీ మెజార్టీలో సీఎం జగన్ కే మరోసారి ప్రజలు అధికారం ఇస్తారని తేలింది.

Once again the survey decided that Jagan will be next CM!

రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఒక్కటి ఒకవైపు.. మిగతా పార్టీలన్ని ఒకవైపుగా పోటీ సాగనుందని స్పష్టంగా కనిపిస్తోంది. రానున్న ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది.. ఎంత శాతం ఓట్లు రాబడుతుంది.. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనే అంశాల మీద ప్రముఖ సర్వే సంస్థ జన్ మత్ పోల్స్  సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే  అధికారంలోకి వైసీపీ వస్తుందని ఈ సర్వే తేల్చింది. గురువారం ఈ సర్వే ఫలితాలను విడుదల చేసింది.

ఇక ఈ సర్వే సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. అధికార వైఎస్సార్ సీపీ పార్టీకి 110 నుంచి 113 స్థానాలు వస్తాయని ఈ సంస్థ తెల్చింది. అలానే పొత్తుతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ, జనసేనకు 54 నుంచి 56 స్థానాలు మాత్రమే వస్తాయని  తెలిపింది. ఇక జాతీయ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ లకు ఒక్కస్థానం కూడా లభించదని ఈ సర్వే స్పష్టం చేసింది. మొత్తంగా జన్ మత్ పోల్స్ సర్వే ప్రకారం.. ఏపీలో మరోసారి వైఎస్సార్ సీపీదే అధికారంమని తేల్చింది. అంటే మరోసారి  జగన్ మోహన్ రెడ్డి సీఎం కానున్నారు. మొత్తంగా జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో పెద్దగా అసంతృప్తి లేదని ఈ సర్వే అభిప్రాయపడింది. ఈ జన్ మత్  సర్వే.. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. మరి.. తాజాగా వెల్లడైన ఈ సర్వేపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş