Arjun Suravaram
YS Jagan: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్వేల ఫలితాలు అందరిలో ఆసక్తిని పెంచేస్తున్నాయి. తాజాగా జాతీయ స్థాయిలో జన్ మత్ పోల్స్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో వైఎస్సార్ సీపీ ప్రభంజనం స్పష్టంగా కనిపిచింది.
YS Jagan: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్వేల ఫలితాలు అందరిలో ఆసక్తిని పెంచేస్తున్నాయి. తాజాగా జాతీయ స్థాయిలో జన్ మత్ పోల్స్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో వైఎస్సార్ సీపీ ప్రభంజనం స్పష్టంగా కనిపిచింది.
Arjun Suravaram
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. ఎన్నో సంక్షేమా, అభివృద్ధి పధకాలను ప్రవేశ పెట్టి ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం రెండిటిని జోడెద్దుల పరిగెత్తిస్తున్నారు. సీఎం జగన్ పరిపాలన ఇలా సాగుతుంటే.. మరోవైపు సర్వేల హడావుడి మొదలైంది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ సర్వేల ఫలితాలు అందరిలో ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఇప్పటికే పలు సర్వే సంస్థలు నిర్వహించిన ప్రీపోల్ సర్వేల్లో ప్రజలు వైఎస్సార్ సీపీకే అధికారం ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. తాజాగా జాతీయ స్థాయిలో జన్ మత్ పోల్స్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో వైఎస్సార్ సీపీ ప్రభంజనం స్పష్టంగా కనిపిచింది. ఆ సంస్థ చేసిన సర్వేలో ఏపీ లోక్ సభ స్థానాల్లో పార్టీ ఎన్ని సీట్లు వచ్చాయో ఇప్పుడు చూద్దాం..
2024లో దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది అన్ని ప్రధాన పార్టీలు స్పీడు పెంచాయి. ఏపీలో అధికార వైసీపీ..175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తూ అధికార పార్టీ దూసుకెళ్తోంది. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేనాలు వైసీపీ గెలుపును అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించింది లేదు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఏపీతో పాటు జాతీయ స్థాయిలో లోక్ సభకు సంబంధించి ఓ సర్వే వివరాలు బయటకు వచ్చాయి. లోక్ సభ ఎన్నికల్లో కూడా వైఎస్సార్ సీపీ ప్రభంజనం ఉంటుందని ఆ సర్వే స్పష్టం చేసింది.
రానున్న ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఒక్కటి ఒకవైపు.. మిగతా పార్టీలన్ని ఒకవైపుగా పోటీ సాగనుందని స్పష్టంగా కనిపిస్తోంది. రానున్న ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఏపీలో అధికారంతో పాటు లోక్ సభలో ఎక్కువ స్థానాలు గెలిచేందుకు కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది.. ఎన్ని సీట్లు రాబడుతుంది.. కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తుందనే దాని మీద ప్రముఖ సర్వే సంస్థ జన్ మత్ పోల్స్ సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీ నుంచి లోక్ సభకు అత్యధిక స్థానాలు వైఎస్సార్ సీపీ సాధిస్తుందని ఈ సర్వే తేల్చింది. శుక్రవారం ఈ సర్వే ఫలితాలను విడుదల చేసింది.
జన మత్ సంస్థ మొత్తం 543 స్థానాలకు క్షేత్ర స్థాయిలో సర్వే చేసింది. ఇక ఈ సర్వే సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో లోక్ సభలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ఈ సర్వే తేల్చింది. బీజేపీకి 324 నుంచి 327 లోక్ సభ స్థానాలను గెలుచుకుంటుంది. అలానే కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం మెరుగపడలేదని ఈ సర్వే తేల్చింది. కాంగ్రెస్ కి 45 నుంచి 47 వస్తాయి. అలానే ఏపీలో వైఎస్సార్ సీపీ కి17 నుంచి 19 లోక్ సభ స్థానాలు గెల్చుకుంటుంది. టీడీపీ కూటమి 6 నుంచి 7 స్థానాలు దక్కనున్నట్లు సర్వే తెలిపింది. అలానే మమత బెనర్జీ పార్టీ అయిన తృణముల్ కాంగ్రెస్ 22 నుంచి 24 స్థానాలను, ఆమ్ ఆద్మీ పార్టీ 6 నుంచి 7 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఈ జన్ మత్ సర్వే తేల్చింది. మొత్తంగా లోక్ సభ ఎన్నికల్లో మరోసారి వైసీపీ ప్రభంజనం ఉండనుందని ఈ సర్వే స్పష్టం చేసింది. మొత్తంగా జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో పెద్దగా అసంతృప్తి లేదని ఈ సర్వే అభిప్రాయపడింది. ఈ జన్ మత్ సర్వే.. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరి.. తాజాగా వెల్లడైన ఈ సర్వేపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Loksabha election 2024
Total 543 seats opinion
Ground report todayBJP =324-327
Congress =45-47
YSRCP=17-19
TMC=22-24
AAP=06-07
BJD =10-12
TDP+ =06-07#LoksabhaElections2024
— Janmat polls (@Janmatpolls) February 22, 2024