Dharani
Dharani
రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. నవ రత్నాల పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఎక్కడా అవినీతికి తావులేకుండా.. నేరుగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నారు సీఎం జగన్. అంతేకాక.. అర్హులైన లబ్ధిదారులకు ఏదైనా కారణాల వల్ల వారి ఖాతాలో నగదు జమ కాకపోతే.. సమస్య పరిష్కారం అయిన తర్వాత.. వారి అకౌంట్‌లో నగదు జమ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి.. నగదు అందుకోలేక మిగిలిపోయిన అర్హుల ఖాతాల్లో నేడు డబ్బులు జమ చేయనున్నారు.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందించాలనేది సీఎం జగన్ ఉద్దేశం. ఈ క్రమంలోనే 2022 డిసెంబర్ నుంచి 2023 జులై వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి.. వేర్వేరు కారణాలతో లబ్ధి పొందని సుమారు 2,62,169 మంది అర్హుల ఖాతాలో నేడు సీఎం జగన్ నగదు జమ చేయనున్నారు. వీరి ఖాతాలో సుమారు రూ.216.34 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి.. బటన్ నొక్కి జమ చేయనున్నారు. అలాగే కొత్తగా అర్హత పొందిన మరో 1,49,875 మందికి పింఛన్లు.. 4,327 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 2,00,312 మందికి రేషన్ కార్డులు, 12,069 మందికి ఇళ్ల పట్టాలను అందించనున్నారు.
వేర్వురు కారణాల వల్ల.. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన వారు కూడా కొందరు లబ్ధి పొందలేకపోయారు. ఈ క్రమంలో వారు.. ఆయా పథకాలను అందించిన నెలలోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ అనంతరం.. మిగిలిపోయిన అర్హులకు కూడా ఆర్నెళ్లకు ఒకసారి ప్రభుత్వం ప్రయోజనాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఏడాదిలో రెండుసార్లు వారికి డబ్బుల్ని జమ స్తోంది రాష్ట్ర ప్రభుత్వం.