YS Jagan: ఏప్రిల్ లో ఎన్నికలు.. క్లీన్ స్వీప్ మా లక్ష్యం: సీఎం జగన్

ఏప్రిల్ లో ఎన్నికలు.. క్లీన్ స్వీప్ మా లక్ష్యం: సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే  అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు ఎన్నికలకు కసరత్తులు చేస్తున్నాయి. ఇక రాష్ట్రంలో 175కు 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేసేందుకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సన్నద్ధమయ్యారు. అందులో భాగంగా సోమవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తసున్నారు. ఇందుకు విజయవాడలోని ఇందిరా గాంధీ  మున్సిపల్ స్టేడియం వేదికైంది. గత 53 నెలలుగా సుపరిపాలన, సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా ప్రజలకు, రాష్ట్రానికీ చేసిన మంచిని, ప్రతిపక్షాలు ఎల్లో మీడియా చేస్తున్న విష ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టే విధంగా వైఎస్సార్ సీపీ నేతలకు సీఎం  వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో సీఎం జగన్ కీలక ప్రసంగం చేశారు.

ఇక ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రజలకు సేవకుడిగా సేవలందించాను కాబట్టే 52 నెలల కాలంలో సువర్ణాక్షరాలతో లిఖించేలా పాలన అందించాని ఆయన అన్నారు. అంతేకాక మూడు ప్రాంతాల ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ మూడు రాజధానులను తీసుకొచ్చామని, అధికారాన్ని ప్రజలకు తొలి సేవకుడి బాధ్యతగా తీసుకున్నామని సీఎం తెలిపారు. వైఎస్ జగన్ అంటే మాట నిలబెట్టుకుంటాడాని నిరూపించుకున్నాను, సామాజిక వర్గాలకు, ప్రాంతాలకు సమన్వాయం చేశామని, రూ.2 లక్షల 35 వేల కోట్లను డీబీటీ ద్వారా అందించామని సీఎం జగన్ తెలిపారు.

నామినేటేడ్ పదవుల్లో 50 శాతానికిపైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇచ్చామని, అదే విధంగా స్థానిక సంస్థల నుంచి కేబినెట్ వరకూ సామాజిక న్యాయం చేశామని సీఎం పేర్కొన్నారు. మార్చి, ఏప్రిల్ లో ఎన్నికలు జరగొచ్చాని, మన లక్ష్యం క్లీన్ స్వీప్ చేయడమే అని నాయకులను ఉద్దేశించి సీఎం జగన్ అన్నారు.  ఇదే సందర్భంగా “వై ఏపీ నీడ్స్ జగన్” అనే కార్యక్రమ ఉద్దేశం ఏమిటో సీఎం జగన్ వివరించారు. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 10 వరకూ వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని చేపడతామని ఆయన తెలిపారు. ప్రజలకు మరింత మంచి చేయడానికి మళ్లీ జగన్ రావాలని,  వైఎస్సార్ సీపీ తప్ప  ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకున్న పార్టీ దేశంలోనే మరొకటి లేదని సీఎం తెలిపారు.

జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలి, రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా వ్యాధుల బారిన పడకూడదని, వ్యాధి సోకిన వారికి తగిన చికిత్స ఇచ్చేందుకు సురక్ష స్కీమ్ తెచ్చామని సీఎం తెలిపారు. అదే విధంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మలకు ఇచ్చామని, 22 లక్షల ఇళ్లు అక్క చెల్లెమ్మల పేరుతో నిర్మాణం జరుగుతున్నాయని ఆయన తెలిపారు. విద్యా,వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చామని, పేదరికంలో ఉన్నవారు ఉన్నత స్థానానికి వచ్చేలా చర్యలు తీసుకున్నామని సీఎం పేర్కొన్నారు. అంతేకాక  ఇక అనేక విషయాలను ప్రస్తావిస్తూ.. వచ్చే ఎన్నికల్లో 175కి 175స్థానాలు గెలిచేలా ముందుకు సాగాలని పార్టీ నేతలు దిశా నిర్దేశం చేశారు. మరి.. సీఎం జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments