YS Jagan: మరోసారి మానవత్వం చాటుకున్న CM వైఎస్ జగన్!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేదల కోసం ఎంతగా పరితపిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో మంది సాయం కోరి వస్తే.. వెంటనే స్పందిస్తుంటారు సీఎం జగన్. అలానే తాజాగా మరొసారి సీఎం జగన్ మానవత్వం చాటుకున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేదల కోసం ఎంతగా పరితపిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో మంది సాయం కోరి వస్తే.. వెంటనే స్పందిస్తుంటారు సీఎం జగన్. అలానే తాజాగా మరొసారి సీఎం జగన్ మానవత్వం చాటుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలక కోసం ఇప్పటికే అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసింది. అలానే ‘అన్నా’ అంటూ సాయం కోరి వచ్చిన వారిని సీఎం జగన్ అక్కున చేర్చుకుంటున్నారు. అలానే ఆపదంలో ఉన్న ప్రతి ఒక్కరికీ.. నేను విన్నాను నేను ఉన్నాను అంటూ భరోసా ఇస్తున్నారు. తాజాగా మరోసారి సీఎం జగన్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఆయన చేసిన పనికి జనం నుంచి జేజేలు వస్తున్నాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

గురువారం సీఎం జగన్ మోహన్ రెడ్డి రెండో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి వివిధ గ్రామాలను దాటుకుంటూ ఎర్రగుంట్ల గ్రామానికి చేరుకున్నారు. అక్కడే ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. సంక్షేమ పథకాలపై.. ప్రజల నుంచి పలు సూచనలు సలహాలను సీఎం జగన్ తీసుకున్నారు. ఇలా సాగుతున్న వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి బస్సు యాత్రలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గం బత్తునూరు వద్ద సీఎం జగన్ కాన్వాయ్ వెనుక వస్తున్న అంబులెన్స్‌ వచ్చింది.

దీంతో వెంటనే తన వాహనాల శ్రేణిని పక్కకు తప్పించి.. అంబులెన్స్ కు సీఎం జగన్ దారి ఇచ్చారు. సీఎం జగన్ ను చూసేందుకు భారీగా జనం  చేరుకున్నారు. అయినప్పటికీ అంబులెన్స్ సజావుగా వెళ్లేలా సీఎం జగన్ సిబ్బందికి సూచనలిచ్చి తన మంచి హృదయాన్ని చాటుకున్నారు. ఇక సీఎం సూచనలతో అక్కడి సిబ్బంది అంబులెన్స్ కి దారి ఇచ్చేలా మిగిలిన వాహనాలను క్లియర్ చేశారు. అంబులెన్స్ ను పూర్తిగా సీఎం వాహన శ్రేణి దాటే వరకు సిబ్బంది చర్యలు తీసుకున్నారు. ఈ ఆసక్తికర సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ఈ వీడియో చూసిన చాలా మంది సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జగన్ అంటే ఇది , మనసున్న మహారాజు జగనన్న అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. గతంలోనూ అనేక సందర్భాల్లో పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఎందరో సాయం కోరిస్తే.. మంచి మనస్సుతో వెంటనే ఆదుకున్న నాయకుడు సీఎం జగన్. కొందరికి అయితే కోట్ల విలువ చేసే వైద్యాన్ని సైతం సీఎం జగన్ మోహన్ రెడ్డి అందించారు. ఇలా పేదల విషయంలో ఆదుకోవడంలో సీఎం జగన్ ఎప్పుడూ ముందుంటారు. అందుకే చాలా మంది ఆయనను పేదల పెన్నిది, పేదల పాలిట దేవుడు అంటూ ప్రశంసిస్తుంటారు. మరి..తాజాగా చోటుచేసుకున్నా ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments