iDreamPost
android-app
ios-app

జగన్ జీవితంలో అద్భుతం.. ఏకంగా 20లక్షల కుటుంబాలకు సాయం!

ప్రపంచంలో చరిత్ర సృష్టించే వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. అయితే వారు తీసుకునే సంచలన నిర్ణయాలు.. వారిని చరిత్రలో నిలిచేలా చేస్తాయి. అంతేకాక ఆ నిర్ణయాలు వారి జీవితాల్లోనే అద్భుతమైనవిగా నిలుస్తాయి. అలాంటిదే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో జరిగింది.

ప్రపంచంలో చరిత్ర సృష్టించే వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. అయితే వారు తీసుకునే సంచలన నిర్ణయాలు.. వారిని చరిత్రలో నిలిచేలా చేస్తాయి. అంతేకాక ఆ నిర్ణయాలు వారి జీవితాల్లోనే అద్భుతమైనవిగా నిలుస్తాయి. అలాంటిదే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో జరిగింది.

జగన్ జీవితంలో అద్భుతం.. ఏకంగా 20లక్షల కుటుంబాలకు సాయం!

ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు ఎందరో దేశాన్ని, రాష్ట్రాలను పరిపాలిస్తుంటారు. అయితే కొందరు మాత్రమే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. కారణం.. ఆ నేతల హయాంలో జరిగే అభివృద్ధి, కీలక నిర్ణయాలు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ కోవాకు చెందిన వ్యక్తులే. అయితే వీళ్లను మించి.. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇక సీఎం జగన్ జీవితంలోనే ఓ అద్భుతమైన ఘటన ఒక్కటి శుక్రవారం నూజివీడులో చోటుచేసుకుంది. ఏకంగా 20 లక్షల కుటుంబాల్లో సీఎం జగన్ వెలుగు నింపారు. ఆ కుటుంబాలన్ని సీఎం జగన్ ను తమ జీవితకాలం గుర్తుంచుకుంటాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తనదైన పాలనతో ప్రజల్లో గుర్తింపు పొందారు. అంతేకాక ఇప్పటి వరకు పని చేసిన ఏ సీఎంలు చేయను పనులను, పథకాలను జగన్ ప్రారంభించారు. అందుకే సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనపై మేధావులు, రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం గురించి ఆలోచించే నేతలు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతారు.  అలాంటి పనులకే జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టుడుతున్నారు.

ఇప్పటికే ఎన్నో అద్భుతమైన స్కీమ్స్, సంస్కరణలను చేపట్టిన సీఎం జగన్.. తాజాగా తన  జీవితంలోనే గుర్తుండిపోయే కార్యక్రమం చేశారు. అంతేకాక ఇప్పటి వరకు ఏ సీఎం చేయని పని చేశారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంతో 20 లక్షల కుటుంబాల్లో వెలుగులు నిండాయి.దాదాపు 20 ఏళ్లకు పైబడి అసైన్డ్ చేస్తున్న వారి భూములను..శాశ్వతంగా వారికి చెందేలే చేశారు సీఎం జగన్. నూజివీడులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 20, 24, 709  మందికి 35, 44, 866 ఎకరాల్లో భూ పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టారు.

ఇప్పటి వరకు అసైన్డ్ చేస్తున్న ఈ భూములను శాశ్వతంగా వారికి హక్కు కల్పించేలా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు భూమి ఉన్నప్పటికి.. వాటి విలువల్లో తేడా ఉండేవి. ఒక భూమి 10 లక్షలు ఉంటే.. ఆ పక్కనే ఉండే భూమి 3 లక్షలు ఉంటుంది. కారణం.. ఆ భూములపై  ఉండే హక్కుల్లో తేడా ఉంటుంది. రిజిస్టర్డ్ భూముల ధర ఒకలా,  దాని పక్కనే ఉన్నా.. అసైన్డ్ భూముకి ధర మరోలా ఉంటుంది.  ఎందుకుంటే.. భూములు స్వభావం ఒక్కటే అయినా..అసైన్డ్ భూమి కలిగిన వారిని కొందరు వేధింపులకు గురిచేస్తుంటారు. ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలు వంటి అంశాల్లో ఇబ్బందులకు గురిచేస్తారు.

అదే భూమి.. వారి పేరున రిజిస్టర్డ్ అయితే.. ఈ వేధింపులు ఉండవు, అదే విధంగా అమ్ముకోవడానికి, ఇతర విషయాల్లో ఇబ్బందులు తలెత్తవు. ఇలా ఇబ్బందులు పడుతున్న 20 లక్షల మందికి.. అంటే 20 లక్షల కుటుంబాల్లో సీఎం జగన్ వెలుగు నింపినట్లే. అంతేకాక ఇన్ని కుటుంబాలాకు సాయం అంటే.. జగన్ జీవితంలోనే  సాధించిన అద్భుతంగా ఈ కార్యక్రమం నిలుస్తుంది. చంద్రబాబు నాయుడు చేద్దామని అనుకుంటూ  వదిలేసిన అంశాన్ని జగన్ చేసి చూపించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.