iDreamPost
android-app
ios-app

‘అమ్మ చేతి వంట’ ఆవుల భార్గవి బ్యాగ్రౌండ్‌.. ఈ నిజాలు చాలా మందికి తెలియవు..!

  • Published May 03, 2024 | 3:26 PM Updated Updated May 03, 2024 | 3:26 PM

Youtuber Bhargavi Amma Chethi Vanta: వంట వీడియోలతో సెలబ్రిటీగా మారింది ఓ యూట్యూబర్‌. తనే అమ్మ చేతి వంట యూట్యూబ్‌ చానెల్‌ ఆవుల భార్గవి. ఆమె గురించి కొన్ని ఆసక్తికర వివరాలు మీ కోసం..

Youtuber Bhargavi Amma Chethi Vanta: వంట వీడియోలతో సెలబ్రిటీగా మారింది ఓ యూట్యూబర్‌. తనే అమ్మ చేతి వంట యూట్యూబ్‌ చానెల్‌ ఆవుల భార్గవి. ఆమె గురించి కొన్ని ఆసక్తికర వివరాలు మీ కోసం..

  • Published May 03, 2024 | 3:26 PMUpdated May 03, 2024 | 3:26 PM
‘అమ్మ చేతి వంట’ ఆవుల భార్గవి బ్యాగ్రౌండ్‌.. ఈ నిజాలు చాలా మందికి తెలియవు..!

మీరు మంచి వంటగాళ్లా.. మీ చేతి వంట అమృతం అని అందరూ పొగుడుతారా.. తక్కువ దినులుతో.. రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటలు మీ ప్రత్యేకతా.. అయితే మీకు బెస్ట్‌ ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌. పురాతన వంటకాల నుంచి.. మోడ్రన్‌ రుచులు, విదేశీ వంటకాలను కూడా పర్ఫేక్ట్‌గా చేయాలంటే.. యూట్యూబ్‌కి వెళ్లి సర్చ్‌ చేస్తే చాలు.. లెక్కకు మిక్కిలి రిజల్ట్స్‌ చూపిస్తుంది. అందులో కొందరి వీడియోలకు కోట్లలో వ్యూస్‌ ఉంటాయి. ఇలా మన తెలుగులో వంటల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారి జాబితాలో ముందు వరుసలో ఉంటుంది అమ్మ చేతి వంట ఫేమ్‌ యూట్యూబర్‌ భార్గవి.

వంటలో కనీసం పరిజ్ఞానం లేదా.. అయినా సరే.. బాధపడకండి.. అమ్మ చేతి వంట ఉండగా.. మీకు ఎందుకు చింత.. దండగా అంటూ నెటిజనుల ముందుకు వచ్చేస్తుంది ఈ యూట్యూబర్‌. ఈమె యూట్యూబ్‌ ఛానల్‌కు ఇప్పటికే 3.27 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇప్పటి వరకు 1,377 వీడియోలు అప్లోడ్‌ చేయగా.. 1,226,226,222 కోట్ల వ్యూస్‌ వచ్చాయి. కేవలం వంట ద్వారా ఇంత క్రేజ్‌, ఫేమ్‌ సంపాదించుకున్న భార్గవికి సంబందించిన పూర్తి వివరాలు మీ కోసం.

తల్లి సలహాతో యూట్యూబ్‌  ప్రయాణం..

ఇక అమ్మ చేతి వంట యూట్యూబర్‌ భార్గవి విషయానికి వస్తే.. ఆమె స్వస్థలం రాజమండ్రి. బీఎస్సీ కంప్యూటర్స్‌ పూర్తవ్వగానే తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేశారు. పెళ్ళయ్యాక భర్తతో కలిసి విశాఖపట్నంలో ఉండేది. ప్రారంభంలో ఇల్లు, పిల్లలతో బిజీగా ఉండేది. 2017 జనవరిలో.. సంక్రాంతి పండక్కి పుట్టింటికి వెళ్లింది. ఆ సమయంలో భార్గవి తల్లి గీతామహాలక్ష్మి తాము చేసే వంటలను వీడియోలు తీసి యూ ట్యూబ్‌లో పెడితే వాటిని చాలా మంది చూస్తారని.. భార్గవిని అలా చేయమని సలహా ఇచ్చింది. అంతేకాక మొదట తాను వంట చేసి వీడియోలు తీస్తే.. భార్గవిని వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చెయ్యమని చెప్పింది ఆమె తల్లి. భార్గవి అందుకు అంగీకరించింది. అలా తల్లి ప్రోత్సాహంతో యూట్యూబ్‌లో తన వంటల ప్రయాణాన్ని ప్రారంభించింది భార్గవి.

Amma chethi vanta avula bhargavi family details

తల్లి చెప్పిన సలహాతో.. విశాఖపట్నం వెళ్లాక.. భార్గవి తను వంట చేసేటప్పుడు వీడియోలు తీసి పెట్టుకునేది. 2017 మే 31న ‘అమ్మ చేతివంట’ పేరిట యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించి .. ఆ వీడియోలను పోస్టు చేసింది. అయితే ప్రారంభంలో వాటికి పెద్దగా వ్యూస్‌ రాలేదు. దాంతో సబ్‌స్క్రైబర్స్‌ను పెంచుకోవడం ఎలా.. ఏం చేస్తే వ్యూస్‌ పెరుగుతాయి.. ట్యాగ్స్, టైటిల్స్, థంబ్‌ నెయిల్స్‌ ఎలా పెట్టుకోవాలి… అనే విషయాల గురించి భార్గవే స్వయంగా టెక్‌ ఛానల్స్‌లో గాలించి, తెలుసుకుని ప్రొఫెషనల్‌గా వీడియోలు పెట్టడం నేర్చుకుంది. మొదటి నెలలోనే 90 వీడియోలు పోస్టు చేసింది. ఛానల్‌ క్లిక్‌ అవ్వడమే కాక లక్షల్లో వ్యూస్‌ రావడం మొదలైంది.

ఇక దసరా నవరాత్రులలో నైవేద్యం పెట్టే ప్రసాదం తయారీ వీడియోలకు మంచి స్పందన రావడంతో భార్గవి యూట్యూబ్‌ ఛానల్‌ బాగా ఫేమస్‌ అయ్యింది. వ్యూయర్స్‌ నుంచి ప్రోత్సాహం పెరగడంతో.. మరిన్ని వీడియోలు పోస్టుచేసేది. ఛానల్‌ ప్రారంభించిన ఐదు నెలల్లో మంచి గుర్తింపుతోపాటు, యాడ్‌లు కూడా వచ్చేవి. తన వీడియోలలో ఆనియన్‌ సమోసా బాగా క్లిక్‌ అయ్యింది. వీడియో అప్‌లోడ్‌ చేసిన రెండు వారాల్లోనే పదిలక్షల వ్యూస్‌ వచ్చాయి. ఇన్‌స్టంట్‌గా చేసుకునే టమోటా పచ్చడి, పానీపూరి వీడియోలు అప్లోడ్‌ చేసిన తర్వాత ఒక్కసారిగా ఆమె ఛానల్‌ సబ్‌స్క్రైబర్స్‌ భారీగా పెరిగారు.

Amma chethi vanta avula bhargavi family details

ఇక లాక్‌డౌన్‌లో భార్గవి ఓవెన్‌ లేకుండా కేక్‌ తయారీ వంటకాల వీడియోలు అప్లోడ్‌ చేసింది. వాటికి మంచి ఆదరణ వచ్చింది. యూ ట్యూబ్‌ టాప్‌ ట్రెండింగ్‌ వీడియోలలో భార్గవి కేక్‌ తయారీ వీడియోలు నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచాయి. సీజన్‌లకు తగ్గట్టుగా వంటల వీడియోలు చేయడం భార్గవి ప్రత్యేకత. ఇక ఇప్పటి వరకు ఆమె ఛానెల్‌ను 3.27 మిలియన్ల మంది సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారంటే.. ఆమె వంటలు ఎంత ఫేమస్సో అర్థం చేసుకోవచ్చు.