iDreamPost
android-app
ios-app

నాయనమ్మ కోసం స్పెషల్ వెహికల్.. పేదరికం నుంచి పుట్టిన ఆలోచన!

ఎంతో మంది పేదరికంతో అనేక ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక చాలా మంది తమ పరిస్థితి ఇంతేలే అని జీవితాన్ని వెల్లదీస్తున్నారు. కానీ ఓ యువకుడి పేదరికం నుంచి పుట్టిన ఆలోచన అందరిని ఫిదా అయ్యేలా చేసింది.

ఎంతో మంది పేదరికంతో అనేక ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక చాలా మంది తమ పరిస్థితి ఇంతేలే అని జీవితాన్ని వెల్లదీస్తున్నారు. కానీ ఓ యువకుడి పేదరికం నుంచి పుట్టిన ఆలోచన అందరిని ఫిదా అయ్యేలా చేసింది.

నాయనమ్మ కోసం స్పెషల్ వెహికల్.. పేదరికం నుంచి పుట్టిన ఆలోచన!

ఇప్పటి వరకు సమాజంలో అనేక కొత్త కొత్త వస్తువులు సృష్టించబడ్డాయి. అయితే ఏదైనా కొత్త వస్తువు ఆవిష్కరణ వెనుక అనేక సమస్యల కారణంగా జరుగుతాయి. సమస్యల నుంచి పరిష్కారం, ఆవిష్కరణలు జరుగుతుంటాయి. అలా సమస్యలతో మాముల గ్రామాల్లో సైతం కొత్త కొత్తగా ఉండే వింత ఆవిష్కరణలు జరుగుతుంటాయి. తాజాగా యువకుడు తన నాయనమ్మ పడుతున్న ఇబ్బందులు చూసి చలించాడు. ఎలాగైన తన నాయనమ్మకు కష్టాలకులేకుండా చేయాలని భావించి. అలా ఆతడు చేసిన ఓ ఆవిష్కరణ అందరిని ఆకట్టుకుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం దిగువ చోరుపల్లి అనే గ్రామానికి చెందిన మండంగి చిన్నమి అనే 75 ఏళ్ల వృద్ధులు తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. ఆమెకు కళ్లు సరిగ్గా కనపడవు. వృద్ధాప్యం కారణంగా చిన్నమి సరిగ్గా నడవలేని స్థితిలో ఉంది. ఇక వారి ఊరు మన్యంలో ఉండటంతో  ఏ చిన్నపాటి అవసరం వచ్చిన కూడా మైదానం ప్రాంతానికి రాక తప్పదు. గ్రామస్తులు అందరూ మోటార్ సైకిళ్లపై మైదాన ప్రాంతాలకు వెళ్తుంటారు.

ఇది ఇలా ఉండగా కురుపాం మండలం కేంద్రంలోనే ఏపీ వికాస్ గ్రామీణ బ్యాంక్ లో చిన్నమ్మికి ఖాతా ఉంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించే పెన్షన్ డబ్బుతో పాటు తన వద్ద ఉన్న మరికొంత సొమ్మును ఆ కౌంట్ లోనే దాచుకుంటుంది. తాను దాచుకున్న డబ్బుల కోసం తన ఖాతా ఉన్న ఏపి వికాస్ గ్రామీణ బ్యాంక్ కు వెళ్లాల్సి వచ్చింది. కానీ వృద్ధాప్యం కారణంగా ఆమె అక్కడకు వెళ్లలేక పోతుంది.  బైక్ పై తీసుకెళ్దాం అంటే అలా వెళ్లడానికి కూడా ఆమెకు ఓపిక లేదు. దీంతో తన నాయనమ్మ పరిస్థితి చూసిన ఆమె మనవడు శివ మనస్సు చలించింది. ఎలాగైనా సరే తన నాయనమ్మను ఇబ్బంది లేకుండా బ్యాంక్ వద్దకు తీసుకెళ్లాలని భావించాడు.

అలానే ఎప్పటికప్పుడు తన నాయనమ్మ అనారోగ్యం గురించి, ఇతరత్రా చిన్నపాటి అవసరాలను తీర్చడానికి  సమస్య ఉండకూడదనే శివ భావించి.. వినూత్నంగా ఆలోచించాడు. ఈ క్రమంలోనే తన వద్ద ఉన్న పరికరాలతోనే నాయనమ్మ కూర్చునేలా ఓ హహనాన్ని తయారు చేయడానికి ప్రణాళిక వేశాడు. అనుకున్నట్లే తన నాయనమ్మకు అనుకూలంగా ఉండేలే వాహనం తయారీలో నిమగ్నమయ్యాడు. తన వద్ద ఉన్న పాత బైక్ చక్రాలు ఒక పట్టె మంచానికి అమర్చి.. ఓ ట్రాలీలా తయారు చేశాడు. అలానే ఆ మంచంలాంటి ట్రాలీలో కూర్చుంటే తన ఆమెకు ఎండ తగులుతుందని ట్రాలీ పైన కర్రల సహాయంతో ఒక బట్టను ఏర్పాటు చేశాడు.

అలా తయారు చేసిన మంచం ట్రాలీని ..తన బైక్ కి వెనుకాల జాయించ్ చేశాడు. అలా ఆ  ప్రత్యేక వాహనంలో తన నాయనమ్మని తీసుకొని కురుపాం బ్యాంక్ వద్దకు తీసుకెళ్లి పని పూరైతన తరువాత తిరిగి ఇంటికి తీసుకొని వచ్చాడు. తనకు నాయనమ్మపై ఉన్న ప్రేమా, ఆమె పడుతున్న ఇబ్బందులే ఈ వాహనం తయారీకి శ్రీకారం చుట్టిందని, ఈ ట్రాలీ సహాయంతో తన నాయనమ్మ అవసరాలను తీరుస్తాని శివ తెలిపారు.  ఇక నాయనమ్మ కోసం శివ చేసిన ఈ పనికి స్థానికులు ఫిదా అయ్యారు. అతడిపై ప్రశంస వర్షం కురిపిస్తున్నారు. మరి..నాయనమ్మకు ప్రేమతో యువకుడు చేసిన ఈ  పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.