iDreamPost
android-app
ios-app

వీడియో: అందరు ఉండగానే చోరీకి పాల్పడిన మహిళలు!

వీడియో: అందరు ఉండగానే చోరీకి పాల్పడిన మహిళలు!

ఈ మధ్యకాలంలో అక్రమంగా, సులువుగా డబ్బులు సంపాదించాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కష్టపడటం చేతకాక, సోమరితనంతో ఇతరుల సంపదను దోచుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. ఈ క్రమంలో ఇళ్లు, షాపులు, ఇతర దుకాణాల్లోకి వెళ్లి.. విలువైన వస్తువులను, డబ్బులను దోచుకెళ్తున్నారు. ఈ దొంగతనాల్లో మహిళలు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. మగ దొంగల కంటే.. ఆడ దొంగలు చేసే చోరీలు చూస్తే.. ఆశ్చర్యం కలుగుతుంది. తాజాగా అలా ఆశ్చర్యానికి గురి చేసే చోరీ విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. షాపు నిర్వహకులు తెలిపిన వివరాల ప్రకారం..

విజయనగరం జిల్లా రాజం పట్టణంలో పట్టపగలే చోరీ జరిగింది. రాజం పట్టణంలోని ఓ వస్త్ర దుకాణంలో ఐదుగురు మహిళలు వెళ్లారు. బట్టలు కొంటున్నట్లు అక్కడ కాసేపు తెగ హడావుడి చేశారు. అక్కడ ఉన్న సెల్స్ సిబ్బందిని ఖరీదైన చీరలు చూపించాలంటూ మాటలలో పెట్టారు. అలా సిబ్బంది ఇచ్చిన చీరలను చూస్తున్నట్లు నటిస్తూ.. చీరలను దొంగతనం చేశారు. షాపులో ఉన్న చీరలను ఇద్దరు మహిళలు చూస్తున్నట్లు యాక్టింగ్ చేయగా.. మరో మహిళ వారి చాటున ఉండి.. చీరలను దాచి పెట్టింది. ఇక ఈ మహిళలు చోరీ చేసిన దృశ్యాలు సదరు షాపులోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

అలానే మరో షాపులో కూడా దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆ మహిళలు చోరీ చేసిన విధానం చూసి అందరూ అవాకయ్యారు. షాపు నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేశారు. అలానే సీసీ టీవీ పుటేజ్ ను పరిశీలించారు. మహిళలు చోరీ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారీ చోరీ విధానం చూసి.. నెటిజన్లు షాకవుతున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నట్లు స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. మరి.. వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş