Arjun Suravaram
కొందరు జీవితంలో చేసే పొరపాటును పెద్దగా భావించి..మానసికంగా కుంగిపోతుంటారు. మరికొందరు అయితే దారుణ నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా ఓ మహిళ..తాను చేసిన ఓ చిన్న తప్పుకు జీవితాన్నే బలి చేసుకుంది.
కొందరు జీవితంలో చేసే పొరపాటును పెద్దగా భావించి..మానసికంగా కుంగిపోతుంటారు. మరికొందరు అయితే దారుణ నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా ఓ మహిళ..తాను చేసిన ఓ చిన్న తప్పుకు జీవితాన్నే బలి చేసుకుంది.
Arjun Suravaram
జీవితం అనేది చాలా విలువైంది. ఎన్ని కష్టాలు ఎదురైన ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలి. కానీ కొందరు జీవితంలో చేసే పొరపాటును పెద్దగా భావించి..మానసికంగా కుంగిపోతుంటారు. మరికొందరు అయితే దారుణ నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా ఓ మహిళ క్షమించు బావ..నేను తప్పు చేశానంటూ తన భర్తకు మెసేజ్ చేసింది. అనంతరం సూసైడ్ చేసుకుని జీవితాన్ని ముగించింది. ఆమె చేసిన ఆ తప్పు కేవలం లోన్ యాప్ లో రుణం తీసుకోవడమే. పూర్తి వివరాల్లోకి వెళ్తే…
ఇటీవల కాలంలో లోన్ యాప్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు అనేక మంది విద్యార్థులు, నిరుగ్యోగులు, యువకులు, చిరు ఉద్యోగులు లోన్ యాప్ కారణంగా బలయ్యారు. తాజాగా ఓ మహిళ కూడా లోన్ యాప్ కారణంగా నిండు జీవితాన్ని బలి తీసుకుంది. ఆమె సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఏపీలోని కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కృష్ణాపురంనకు చెందిన స్రవంతిని మంటాడకు చెందిన మేనత్త కొడుకు శ్రీకాంత్ కి ఇచ్చి పెద్దలు వివాహం చేశారు. స్రవంతి భర్త తాపీ మేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఇక ఈ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆమె గృహిణిగా ఉంటు పిల్లలు, భర్తకు బాగోలు చూస్తుంది. ఈ క్రమంలో ఇటీవలే స్రవంతి ఫోన్ కు రూ.5 లక్షలు లోన్ ఇస్తామాని ఓ మెసేజ్ వచ్చింది. ఇబ్బందులు ఎదురైనప్పుడు కుటుంబానికి ఈ డబ్బులు సాయపడతాయనే ఉద్దేశంతో మెసేజ్ వచ్చిన నెంబర్ కు స్రవంతి ఫోన్ చేసింది. రూ.5 లక్షలు లోన్ ఇవ్వాలంటే ముందుగా రూ.20వేలు, రూ.60వేలు.. వరుసగా రూ.80వేలు చెల్లించాలని అవతలి వ్యక్తులు చెప్పారు. వారి మాటలు నమ్మిన స్రవంతి రూ. లక్ష అప్పు తెచ్చి మరీ చెల్లించింది. వారికి చెల్లించింది.
అయినా కూడా ఆమెకు 5 లక్షలు అవతలి వ్యక్తులు ఇవ్వలేదు. అంతేకాక మరో రూ.1.20 లక్షలు చెల్లిస్తే…మొత్తం లోన్ ఇస్తామని మరో మెసేజ్ వచ్చింది. దీంతో తాను మోసపోయానని స్రవంతికి అర్ధమైంది. తాను మోసపోయిన విషయాన్ని భర్తకు చెప్పులేకపోయింది. ఆ బాధతో తాను తప్పు చేశానని భావించి మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. దీంతో స్రవంతి ఓ సెల్ఫీ వీడియోతో జరిగిన విషయాన్ని చెప్పింది. “ నేను తప్పు చేశాను బావ. నన్ను క్షమించు, కుటుంబం కోసమే ఇలా చేశాను. నీకు నా మొహం కూడా చూపించలేను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను” అని వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది.
అనంతరం ఆదివారం ఇంట్లో ఉరివేసుకొని స్రవంతి ఆత్మహత్యాయత్నం చేయగా.. కుటుంబ సభ్యులు గమనించి ఉయ్యూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ స్రవంతి సోమవారం మధ్యాహ్నం మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లోన్ యాప్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా ఇప్పటికీ కొందరు అమాయకంగా మోసపోతున్నారు. అందుకు తాజాగా స్రవంతి ఘటనే ఉదాహరణ.