P Venkatesh
ఓ వివాహిత భర్తతో తలెత్తిన గొడవల కారణంగా భర్త, పిల్లలను విడిచి పెట్టింది. ఆ తర్వాత మరో యువకుడితో సహజీవనానికి చేయసాగింది. కానీ చివరకు ఏమైందంటే?
ఓ వివాహిత భర్తతో తలెత్తిన గొడవల కారణంగా భర్త, పిల్లలను విడిచి పెట్టింది. ఆ తర్వాత మరో యువకుడితో సహజీవనానికి చేయసాగింది. కానీ చివరకు ఏమైందంటే?
P Venkatesh
భార్యాభర్తల మధ్య చోటుచేసుకుంటున్న చిన్న చిన్న మనస్పర్థలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. మూడు ముళ్ల బంధంతో ఒక్కటై నిండు నూరేళ్లు జీవించాల్సిన వారు గొడవల కారణంగా విడిపోతున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు తలెత్తడంతో భార్యాభర్తలు దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ వివాహిత భర్తతో తలెత్తిన గొడవల కారణంగా భర్త, పిల్లలను విడిచి పెట్టింది. ఆ తర్వాత మరో యువకుడితో సహజీవనానికి పూనుకుంది. కానీ ఇక్కడ కూడా అనుమానాలే పెనుభూతాలుగా మారాయి. ఇక జీవితం మీద విరక్తి చెందిన ఆ సహజీవన జంట దారుణ నిర్ణయాన్ని తీసుకుంది.
కనీసం మూడు పదుల వయసు నిండకుండానే తనువు చాలించారు ఆ జంట. కడప రవీంద్రనగర్ చెందిన పాలకొండ రాయుడు (26), కడప నెహ్రూ నగర్ చెందిన చందనారెడ్డి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. చందన రెడ్డి అనే మహిళ తన భర్తతో గొడవల కారణంగా ఇళ్లు పిల్లలను వదిలేసి బయటికి వచ్చి జీవిస్తుంది. చందనా రెడ్డి కడప సాంసంగ్ సర్వీస్ సెంటర్ లో పని చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తుంది. ఈ క్రమంలో చందన రెడ్డికి పాలకొండ రాయుడు అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. పాలకొండ రాయుడు ఆరోగ్యశ్రీ ప్రొద్దుటూరు ఆర్వికే హాస్పిటల్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం సహజీవనానికి దారితీసింది.
అయితే భర్తా పిల్లలను వదిలేసి వచ్చిన చందనకు సహజీవనంలో కూడా గొడవలు తలెత్తాయి. ఈ గొడవలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాయి. అక్కడ పోలీసులు కోర్టులో మీ పంచాయితీ తేల్చుకోవాలంటూ వారికి సూచించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో గాని కడప రైల్వే స్టేషన్ లో ఓ గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు మృతుల బంధువులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకున్నారు. దీంతో వారి నుంచి సమాచారం తెలుసుకుని విచారిస్తున్నట్లు రైల్వే ఎస్.ఐ రారాజు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. మరి భర్త, పిల్లలను వదిలేసి ఆతర్వాత మరో యువకుడితో సహజీవనం కొనసాగించి చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డ ఆ జంటపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.