iDreamPost
android-app
ios-app

అల్పపీడనం, వాయుగుండం అంటే ఏంటి? ఇవి ఎలా ఏర్పడతాయి?

  • Published Sep 03, 2024 | 7:53 PM Updated Updated Sep 03, 2024 | 7:53 PM

What Is Low Pressure, High Pressures: బంగాళాఖాతంలో అల్పపీడనం, తీరం దాటిన వాయుగుండం అని వింటూ ఉంటాం. వాతావరణశాఖ అల్పపీడనం, వాయుగుండం అని చెబుతూ ఉంటుంది. అసలు అల్పపీడనం అంటే ఏంటి? వాయుగుండం ఎప్పుడు ఏర్పడుతుంది? తుఫానుగా ఎలా రూపాంతరం చెందుతుంది? వంటి వివరాలు మీ కోసం.   

What Is Low Pressure, High Pressures: బంగాళాఖాతంలో అల్పపీడనం, తీరం దాటిన వాయుగుండం అని వింటూ ఉంటాం. వాతావరణశాఖ అల్పపీడనం, వాయుగుండం అని చెబుతూ ఉంటుంది. అసలు అల్పపీడనం అంటే ఏంటి? వాయుగుండం ఎప్పుడు ఏర్పడుతుంది? తుఫానుగా ఎలా రూపాంతరం చెందుతుంది? వంటి వివరాలు మీ కోసం.   

అల్పపీడనం, వాయుగుండం అంటే ఏంటి? ఇవి ఎలా ఏర్పడతాయి?

నీరు పల్లమెరుగు అన్నట్టు.. సముద్రం మీద ఉన్న గాలి కూడా ఎక్కువ పీడనం ఉన్న చోట నుంచి తక్కువ పీడనం ఉన్న చోటకు ప్రయాణిస్తుంది. ఈ సమయంలో సముద్రం ఉపరితలం ఉష్ణోగ్రత 26.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత కారణంగా సముద్రంలో ఉన్న నీరు బిందువులుగా మారి.. ఆవిరిగా మారి తక్కువ పీడనం ఉన్న ప్రాంతం వైపు ప్రయాణిస్తాయి. దీన్నే అల్పపీడన ద్రోణి అని అంటారు. ఇది తుఫాన్ ఏర్పడడానికి ఉన్న ప్రాథమిక దశగా చెబుతారు. సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి క్రమంగా నీటి బిందువులను ఆకర్షిస్తూ పరిమాణాన్ని, వేగాన్ని పెంచుకుంటుంది. దీని వల్ల ఇది మరింత బలపడి అల్పపీడనంగా మారుతుంది. ఈ అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుంటుంది. 

అల్పపీడనం తీరం దాటడం అంటే?

తీవ్ర అల్పపీడనం ఏర్పడిన తర్వాత అది మరింత బలపడుతూ తీరం వైపు వస్తూ ఉంటుంది. తీరం వైపు వస్తున్న క్రమంలోనే మరింత బలపడుతుంది. దీన్నే వాయుగుండంగా పిలుస్తారు. ఈ వాయుగుండం ఏర్పడినప్పుడు గంటకు 32 కి.మీ. నుంచి 51 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి. గంటకు 62 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నట్లైతే దాన్ని తీవ్ర వాయుగుండంగా పరిగణిస్తారు. ఈ సమయంలో సాధారణ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అయితే గాలుల వేగం 62 కి.మీ. దాటితే కనుక దాన్ని తుఫానుగా పరిగణిస్తారు. ఈ క్రమంలో తుఫాను వీచే గాలుల వేగాన్ని బట్టి నాలుగు దశల్లో ఉంటుంది. గంటకు 62 కి.మీ. నుంచి 221 కి.మీ. దాటి గాలులు వీస్తుంటాయి. 62 కి.మీ. వేగంతో గాలులు వీస్తే దాన్ని తుఫాను అని.. 62 కి.మీ. నుంచి 88 కి.మీ.కి చేరుకుంటే దాన్ని తీవ్ర తుఫాన్ అని పిలుస్తారు. 88 నుంచి 118 కి.మీ. వేగంతో గాలులు వీస్తే దాన్ని అతి తీవ్ర తుఫానుగా పిలుస్తారు. 221 కి.మీ. వేగాన్ని దాటితే దాన్ని పెను తుఫాను అని అంటారు. 

తుఫాను తీరం దాటడం, తీరం తాకడం అంటే?:

సైక్లోన్ ఐ తెలుగులో తుఫాను కన్ను అని అంటారు. సముద్రంలో ఏర్పడే సుడిగుండాలను తుఫాను కన్ను అని అంటారు. తుఫాను కన్ను ఏర్పడే మధ్య ప్రదేశం అంతా ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీ అనేది 10 కి.మీ. నుంచి 50 కి.మీ. మేర సముద్రం లోపలకి విస్తరించి ఉంటుంది. తుఫాను కన్ను కింద నుంచి పైకి చూస్తే ఆకాశంలో ఉన్న నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతారు. ఈ తుఫాను కన్ను సుడులు తిరుగుతూ తీరం వైపు వస్తూ తీరాన్ని తాకితే తుఫాను తీరం తాకడం అంటారు. తీరం తాకినప్పుడు వర్షాలు కురుస్తాయి. తుఫాను కన్ను మొత్తం భూమ్మీదకు వస్తే దాన్ని తీరం దాటిందని అంటారు. తీరం దాటితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. వరదలకు, తుఫానుకు కారణమవుతాయి.