iDreamPost
android-app
ios-app

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్‌.. ఈ జిల్లాల్లో వర్షాలు!

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్‌.. ఈ జిల్లాల్లో వర్షాలు!

ఆగస్టు నెలలో వర్షాలు బాగా తగ్గిపోయాయి. అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వచ్చి పోయాయి. జులై నెలలో వర్షాలు దంచి కొట్టగా.. ఆగస్టు నెల మొత్తం కలిపి మూడు-నాలుగు సార్లు మాత్రమే వర్షాలు పడ్డాయి. అది కూడా కొన్ని జిల్లాల్లో మాత్రమే వర్షాలు కురిశాయి. జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. పగటి వాతావరణం ఎండాకాలాన్ని తలిపిస్తోంది. దానికి తోడు ఉక్కపోతలు కూడా ఎక్కువయ్యాయి. ఇలాంటి నేపథ్యంలోనే వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై కీలక అప్‌డేట్‌ ఇచ్చింది.

ఉత్తరాది రుతుపవనాల ద్రోణి దక్షిణ దిశగా కదులుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ద్రోణి కారణంగా ఏపీ, తెలంగాణాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. రుతుపవనాలు మరింత చురుకుగా మారితే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం కారణంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. ఇక, ఈశాన్య బంగాళాఖాతంలో ఆవర్తనం కారణంగా ఏపీలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు,

అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వర్షాలు పడతాయని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ద్రోని, ఆవర్తనం కారణంగా ఆదివారంనుంచి మంగళవారం వరకు తెలంగాణలోని 20 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ​మరి, తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలు కావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.