Arjun Suravaram
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ ఫెస్టివల్ నడుస్తోంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. మే 13 ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలింగ్ బూత్ లో ఎలా ఓటును వినియోగించుకోవాలంటే..
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ ఫెస్టివల్ నడుస్తోంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. మే 13 ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలింగ్ బూత్ లో ఎలా ఓటును వినియోగించుకోవాలంటే..
Arjun Suravaram
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ ఫెస్టివల్ నడుస్తోంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. తమకే ఓటు వేయ్యండి అంటూ జనాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. శనివారంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. నేటి సాయంత్రం 5 గంటల నుంచి మైకులు మూగబోనున్నాయి. ఎక్కడి ప్రచారాలు అక్కడ ఆగనున్నాయి. ఇదే సమయంలో ఓటర్లు తమ ఓటును వేసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఓటు వేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలింగ్ బూత్ లో మనం ఓటు వేసేటప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. మరి.. ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతి ఐదేళ్లకు ఒకసారి సార్వత్రిక ఎన్నికలు జరుగుతుంటాయి. ఇదే సమయంలో ఓటర్ తీసుకునే నిర్ణయం చాలా కీలకమైనది. అలానే తాను ఓటు వేసే విషయంలో చాలా జాగ్రతలు పాటించాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఓటు వేసే అవకాశాన్ని కోల్పోవచ్చు. అలానే మన ఓటు సరిగ్గా పడకపోవచ్చు. ముందుగా ఓటరు..తన పేరును ఓటర్ల జాబితాలో ఉందా? అనే విషయాన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో మీ పేరు లేదా ఎపిక్ నెంబర్, అడ్రస్‌తో చెక్ చేసుకోవచ్చు. అదే విధంగా ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో మీరు సులభంగా చెక్ చేసుకోవచ్చు.
ఇక పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లిన తరువాత మీరు ఓటు వేసే ప్రక్రియ ప్రారంభం అవుతోంది. మీరు పోలింగ్ బూత్‌లోకి వెళ్లగానే మీ దగ్గరున్న ఓటర్ స్లిప్పును లోపల ఉన్న అధికారికి చూపించండి. అలానే మీ ఓటరు సీరియల్ నెంబర్, పార్టు నెంబరు అధికారికి చూపించాలి. ఇక ఆ స్లిప్పులోని వివరాలను బట్టీ ఒక్క నిమిషంలో మీ వివరాలను ధృవీకరిస్తారు. అన్నీ వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారణ అయిన తరువాత మరో పోలింగ్ అధికారి సిరా ఇంక్ తో మీ ఎడమ చూపుడు గుర్తు వేస్తారు.
ఓటరు జాబితాలో బొటనవేలి ముద్ర లేదా సంతకం చేయించుకుంటారు. ఓటర్ల జాబితలో గుర్తు పెట్టి మీరు ఓటు వేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంపార్టులోకి పంపిస్తారు. ఓటింగ్ కోసం ఏర్పాటు చేసిన చిన్న గదిలో ఓటేసే ఈవీఎం, దానితో పాటు వీవీప్యాట్ యంత్రం ఉంటుంది. ఈవీఎంపై అభ్యర్థుల పేర్లు ఎడమవైపు వరుసగా కిందకి ఉంటాయి. వారి పేరు పక్కన వారికి కేటాయించిన గుర్తులు, దాని పక్కన నీలి రంగు బటన్స్ ఉంటాయి. మీకు నచ్చిన అభ్యర్థికి కేటాయించిన గుర్తు పక్కన ఉన్న నీలి రంగు బటన్‌ను నొక్కితే మీ ఓటు నమోదైనట్లు.
అయితే మీరు బటన్ నొక్కిన తరువాత ఐదు సెకన్ల పాటు చిన్న పాటి బీప్ అనే శబ్ధం వినిపిస్తోంది. ఆ వెంటనే వీవీ ప్యాట్ మెషీన్‌పై పచ్చటి లైట్ వెలుగుతుంది. మీరు ఓటేసిన అభ్యర్థి తాలూకూ సంబంధించిన సమాచారాన్నిముద్రించిన కాగితపు స్లిప్ ఏడు సెకన్లపాటు కనిపిస్తుంది. ముఖ్యంగా ఏపీలో ఇప్పుడు అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి బూత్‌లో రెండు ఈవీఎంలు, రెండు వీవీ పాట్‌లు ఉంటాయి. ఒక ఓటు మాత్రమే వేసి రెండో ఓటు మరిచిపోవద్దు. ఓపిగ్గా.. రెండు ఓట్లు వేసి ప్రజాస్వామ్యంలో ఓటరుగా మీ బాధ్యతను నిర్వర్తించుకోవాలి. అలా ఈ ప్రక్రియ అంతాపూర్తి చేస్తే మీరు ఓటు వేసినట్లు అవుతోంది.