iDreamPost
android-app
ios-app

తాడికొండ శ్రీదేవి.. ఇది స్వయంకృతాపరాధం! ఏడ్చి ఉపయోగం లేదు!

  • Published Feb 24, 2024 | 5:00 PM Updated Updated Feb 24, 2024 | 6:43 PM

Vundavalli Sridevi: తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.. వైఎస్సార్ సీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే ఒకరు. అనంతరం టీడీపీలో చేరి..తాడికొండ సీటు ఆశించారు. అయితే తాజాగా ఆమెకు చంద్రబాబు షాకిచ్చారు.

Vundavalli Sridevi: తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.. వైఎస్సార్ సీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే ఒకరు. అనంతరం టీడీపీలో చేరి..తాడికొండ సీటు ఆశించారు. అయితే తాజాగా ఆమెకు చంద్రబాబు షాకిచ్చారు.

  • Published Feb 24, 2024 | 5:00 PMUpdated Feb 24, 2024 | 6:43 PM
తాడికొండ శ్రీదేవి.. ఇది స్వయంకృతాపరాధం! ఏడ్చి ఉపయోగం లేదు!

రాజకీయాల్లో విశ్వసనీయత, విలువలు, నిజాయితీ అనేవి చాలా ప్రధానమైనవి. అవి లేని రోజు రాజకీయ భవిష్యత్ అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. స్వార్థంతో చేసే రాజకీయాలు కొంతకాలం వరకు హాయిగానే ఉంటాయి. కానీ కెరీర్ ను మాత్రం అంధకారంలోకి నెట్టేస్తాయి. నిజాయితీతో నాయకుడిని, ప్రజలను నమ్మి రాజకీయం చేసి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులు ఎందరో ఉన్నారు. అలానే తమ స్వార్థం కోసం ఆదరించిన పార్టీని మోసం చేసి.. రాజకీయంగా కనుమరుగైన వారు కూడా ఉన్నారు. తాజాగా అలా రాజకీయ జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చుకున్న వారిలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి  శ్రీదేవి పేరు వినిపిస్తోంది. 

ఉండవల్లి శ్రీదేవి.. 2019 వరకు ఎవరికీ అంతగా పరిచయం లేని పేరు. రాజధాని ప్రాంతమైన తాడికొండ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి.. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. హైదరాబాద్ లో వైద్య వృత్తిలో ఉన్న ఆమెను పిలిచి మరీ.. సీఎం జగన్.. ఆనాడు తాడికొండ సీటు ఇచ్చారు. అలా ఇవ్వడమే కాకుండా.. ఆమెను అక్కడి నుంచి గెలిపించి.. అసెంబ్లీకి పంపారు. టీడీపీ అమరావతిని రాజధానిగా ప్రకటించినా కూడా ఆ ప్రాంతంలో వైసీపీ విజయం సాధించింది. దీంతో ఉండవల్లి శ్రీదేవి పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది. ఇక తొలిసారి వచ్చిన అవకాశాన్ని ఎంతో చక్కగా ఉపయోగించుకోవాల్సిన శ్రీదేవి.. రాంగ్ స్టెప్ వేశారని వార్తలు వినిపించాయి. 

తాడికొండ నియోజకవర్గంలో భారీగా అవినీతికి పాల్పడ్డారంటూ శ్రీదేవిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అంతేకాక నియోజకవర్గంలో ఆమెపై అసంతృప్తి ఎక్కువ కావడంతో.. 2024 ఎన్నికల్లో శ్రీదేవికి టికెట్ ఇవ్వమనే సంకేతాలు వైసీపీ అధిష్టానం ఇచ్చింది. దీంతో ఆమె.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థికి క్రాస్ ఓటు వేశారు. ఆ తర్వాత వైసీపీ అనర్హత వేటు వేయడంతో టీడీపీలో చేరారు. అనంతరం రాజకీయ భవిష్యత్  ఇచ్చిన సీఎం జగన్ ను తిడుతూ.. చంద్రబాబుకు జై కొట్టారు. తాజాగా జనసేన, టీడీపీ విడుదల చేసిన జాబితాలో ఆమె పేరు రాలేదు. దీంతో ఇదంతా ఆమె చేసుకున్న స్వయంకృతాపరాధం అని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీలో ఉన్నప్పుడు శ్రీదేవికి తాడికొండ టికెట్ మాత్రమే ఇవ్వమని చెప్పారు.

శ్రీదేవికి రాజకీయ భవిష్యత్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదని వైసీపీ భరోసా ఇచ్చిందని టాక్. అయినా టికెట్ రాలేదనే ఒకే ఒక్క కారణంతో పార్టీని వీడి వెళ్లారు. ఏ టికెట్ కోసమైతే టీడీపీలోకి వెళ్లారో.. అక్కడ కూడా శ్రీదేవికి భంగపాటు ఎదురైంది. కనీసం వైసీపీలో ఉన్నా రాజకీయ భవిష్యత్ ఉండేదని, టీడీపీలోకి వెళ్లి..తన పొలిటికల్ కెరీర్ ను ప్రశ్నార్థకంగా మార్చుకున్నారని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఆమెను పిలిచి మరీ టికెట్ ఇచ్చి.. ఎమ్మెల్యేను చేసిన జగన్ కే వెన్నుపోటు పొడిచినందుకు తగిన శాస్తి జరిగిందనే కామెంట్స్ కూడా వినిపిస్తోన్నాయి. ఎవరి మాటలు ఎలా ఉన్నా రాజకీయాల్లో వచ్చిన మంచి అవకాశాన్ని ఏదో స్వార్థంతో వెళ్లి.. రాజకీయ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చుకున్నారు. ఇదంతా ఆమె స్వయంకృతాపరాధమే అని పొలిటికల్ ఎనలిస్ట్ లు అభిప్రాయపడుతున్నారు.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş