Arjun Suravaram
ఇటీవల కాలంలో కొన్ని మీడియా పత్రికలు తప్పుడు వార్తలను ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నాయి. ఈక్రమంలోనే కొందరని బతికుండగానే చంపేసి..కథనాలు వడ్డిస్తున్నారు. తాజాగా ఓ మహిళ ఓటర్ విషయంలో అదే జరిగింది. ఆమె స్పందించడంతో ఆ ఎల్లో పత్రిక భండారం బయటపడింది.
ఇటీవల కాలంలో కొన్ని మీడియా పత్రికలు తప్పుడు వార్తలను ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నాయి. ఈక్రమంలోనే కొందరని బతికుండగానే చంపేసి..కథనాలు వడ్డిస్తున్నారు. తాజాగా ఓ మహిళ ఓటర్ విషయంలో అదే జరిగింది. ఆమె స్పందించడంతో ఆ ఎల్లో పత్రిక భండారం బయటపడింది.
Arjun Suravaram
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు అనేది సర్వధారణం. అలానే అధికార, పత్రిపక్షాలు పరస్పర ఆరోపణలు చేసుకోవడం మాములే. వీరిద్దరిని ప్రశ్నించేది మీడియా అనే విషయం మనకు తెలిసిందే. అలానే ప్రజలకు ఖచ్చితమైన సమాచారం, సమస్యల పరిష్కారం కోసం మీడియా,జర్నలిజం అనేవి ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో కొన్ని మీడియా ఛానల్స్, పత్రికలు జర్నలిజం విలువలను కాలరాస్తున్నాయి. తమకు ఇష్టమెచ్చినది రాసి..ప్రజలపై రుద్దుతున్నారు. ఇంకా దారుణం ఏమిటింటే.. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఏకంగా బతికున్నవారిని చనిపోయినట్లు చిత్రీకరించి కథనాలు రాస్తున్నారు. దీంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సజీవంగా ఉన్న వారిని మృతి చెందారంటూ తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఓ పత్రిక అధిపతి పై సంబంధిత వ్యక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని చిగురమానుపేటలో కొండవేగు శాంతిప్రియతో పాటు ఆమె భర్త జీవనం సాగిస్తున్నారు. ఇటీవల వారి పేర్లు ఓటరు జాబితాలో ఉంది. ఇక శాంతిప్రియ దంపతలు ఓటర్ల జాబితాలో ఉండడాన్ని ఉదహరిస్తూ వీరు మృతి చెంది రెండు సంవత్సరాలు అయిందంటూ సదరు పత్రికలో తప్పుడు కథనం ప్రచురించరించింది. ఈ కథనంపై శాంతిప్రియ అవాక్కయ్యారు.
ఈ వార్తపై ఆమె స్పందిస్తూ.. ఎక్స్‌ఐవై 2122539 అనే ఓటరు కార్డుతో 17వ వార్డు 11వ సచివాలయంలో తాను నివశిస్తున్నానని ఆమె తెలిపారు. అయితే పచ్చపత్రికలో ‘ఆత్మకు ఓట్లు’ అనే శీర్షికన తన పేరును ప్రచురించడం దుర్మార్గమైన చర్య అని శాంతిప్రియ మండిపడ్డారు. ఇటీవల కొందరు వ్యక్తులు మృతి చెందారంటూ తమ ఫొటోలను ఓ పత్రికలో ప్రచురించడాన్ని వారి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. నిజంగా ఏమైన తప్పులు దొర్లితే చెప్పడం మంచిదే కానీ, ఇలా బతికున్న వాళ్లను చంపేయడం ఏంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి..కొన్ని పత్రికలు, కొన్ని మీడియాలు ఓటర్ల విషయంలో రాస్తున్న తప్పుడు కథనాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.