Dharani
విజయనగరం జిల్లాలో పలార, రాయగడ రైళ్లు ఢీకోని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైలుప్రమాద బాధితుల సహాయం కోసం, సమాచారం అందించేందుకు హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. ఆ వివరాలు..
విజయనగరం జిల్లాలో పలార, రాయగడ రైళ్లు ఢీకోని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైలుప్రమాద బాధితుల సహాయం కోసం, సమాచారం అందించేందుకు హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. ఆ వివరాలు..
Dharani
ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 14 మంది మృతి చెందగా.. 33 మంది గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విశాఖ నుంచి విజయనగరం వైపు బయలుదేరిన పలాస రైలును.. రాయగడ రైలు వెనక వైపు నుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మూడు బోగీలు నుజ్జు నుజ్జు అయ్యాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఎన్‌డీఆర్‌ఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. మృతదేహాలను బయటకు తీస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు.
రైలుప్రమాద బాధితుల సహాయం కోసం, సమాచారం అందించేందుకు రైల్వే, విశాఖ జిల్లా అధికారులు సహాయక కేంద్రాలను (కంట్రోల్ రూం) ఏర్పాటుచేశారు. క్షతగాత్రుల కోసం విశాఖ కేజీహెచ్‌లో, విమ్స్‌లో వైద్యబృందాలను అందుబాటులో ఉంచారు. విశాఖ నుంచి ప్రమాదస్థలికి అంబులెన్సులను పంపారు. బాధితులకు వైద్య సహాయార్థం హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు.